MG Majestor : ఎంజీ మెజెస్టర్ ఎస్‌యూవీ వేరియంట్లు- వాటి ఫీచర్లు..
భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి ఎంజీ మోటార్స్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ 'మెజెస్టర్'ను పరిచయం చేసింది. గ్లోస్టర్ సక్సెసర్‌గా వస్తున్న ఈ ఎంజీ మెజెస్టర్ వేరియంట్లు, వాటి ఫీచర్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
భారత రోడ్లపై రారాజులా వెలిగిన 'గ్లోస్టర్' ప్రస్థానం ముగిసింది. దాని స్థానాన్ని భర్తీ చేస్తూ, ఎంజీ మోటార్స్ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ‘మెజెస్టర్’ని ఇటీవలే భారత్‌లో ఆవిష్కరించింది. ప్రీమియం ఫీచర్లు, అత్యాధునిక టెక్నాలజీతో వస్తున్న ఈ కారుపై ఇప్పటికే వాహన ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్ వేరియంట్లు, వాటి ఫీచర్ల వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..

ఎంజీ మెజెస్టర్ ఎస్‌యూవీ- వేరియంట్లు, కలర్స్..
ఈ ఎంజీ మెజెస్టర్ ఎస్‌యూవీ ప్రధానంగా రెండు వేరియంట్లలో లభించనుంది.
- షార్ప్
- సావీ
కలర్ల విషయానికి వస్తే.. పెర్ల్ వైట్, కాంక్రీట్ గ్రే, మెటల్ బ్లాక్, మెటల్ యాష్ అనే నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో ఈ భారీ ఎస్‌యూవీ అందుబాటులో ఉంటుంది.
ఎంజీ మెజెస్టర్ ఎస్‌యూవీ 'షార్ప్' వేరియంట్- ఫీచర్లు..
షార్ప్ వేరియంట్ కేవలం 4x2 (ఆర్డబ్ల్యూడీ) ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది. ఇందులో లభించే ప్రధాన ఫీచర్లు:
ఇంటీరియర్ అండ్ కంఫర్ట్:
12-వే పవర్డ్ డ్రైవర్ సీట్, 8-వే పవర్డ్ కో-డ్రైవర్ సీట్.
ప్రీమియం లెదరెట్ సీట్ అప్‌హోలిస్ట్రీ.
డ్యాష్‌బోర్డ్, డోర్లపై సాఫ్ట్-టచ్ మెటీరియల్స్.
3-జోన్ క్లైమేట్ కంట్రోల్, పీఎం 2.5 ఎయిర్ ఫిల్టర్.
టిల్ట్, టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్.
స్టోరేజ్ స్పేస్‌తో కూడిన ఫ్రంట్ అండ్ సెకండ్ రో సెంటర్ ఆర్మ్-రెస్ట్.
ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్లు, సిల్వర్ బూట్ లిప్ సిల్ ప్లేట్.
టెక్నాలజీ అండ్ కనెక్టివిటీ:
12.3-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్.
వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే.
8 స్పీకర్లు, డ్యూయల్ వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్లు.
టైప్-సీ, టైప్-ఏ. రెండు 12వీ ఛార్జింగ్ అవుట్‌లెట్లు.
క్రూయిజ్ కంట్రోల్, ప్యాడిల్ షిఫ్టర్స్.
స్పోర్ట్, నార్మల్, ఎకో డ్రైవ్ మోడ్స్.
64-కలర్ యాంబియంట్ లైటింగ్.
భద్రత:
6 ఎయిర్‌బ్యాగులు, 360-డిగ్రీ కెమెరా.
ఆటో-డిమ్మింగ్ ఐఆర్వీఎం, ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్లు.
ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్.
నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు.
హిల్ హోల్డ్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఏబీఎస్ + ఈబీడీ + బ్రేక్ అసిస్ట్.
టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్), డ్రైవర్ ఫెటీగ్ వార్నింగ్.
ఎక్స్‌టీరియర్:
గెస్టర్ ఆపరేషన్‌తో కూడిన పవర్డ్ టెయిల్‌గేట్.
హీటెడ్ ఓఆర్వీఎంలు (రివర్స్ చేస్తున్నప్పుడు టిల్ట్ అయ్యే సౌకర్యం).
ఎల్ఈడీ హెడ్‌లైట్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, కనెక్టెడ్ టెయిల్ లైట్స్.
19-ఇంచ్ భారీ అలాయ్ వీల్స్.
ఎంజీ మెజెస్టర్ ఎస్‌యూవీ- సావీ వేరియంట్ ఫీచర్లు:
ఇది ఆర్డబ్ల్యూడీ, ఏడబ్ల్యూడీ ఆప్షన్లలో లభిస్తుంది. 'షార్ప్' వేరియంట్‌లోని ఫీచర్లతో పాటు ఇందులో అదనంగా ఉండేవి:
సీట్లు: వెంటిలేటెడ్, మసాజ్ ఫంక్షన్‌తో కూడిన ఫ్రంట్ సీట్లు.
మెమరీ ఫంక్షన్: డ్రైవర్ సీట్, ఓఆర్వీఎంలకు మెమరీ సెట్టింగ్స్.
సౌకర్యాలు: సెకండ్ రోలో 220వీ పవర్ అవుట్‌లెట్, పనోరమిక్ సన్‌రూఫ్, ఎల్ఈడీ క్యాబిన్ లైట్లు.
ఆడియో: 12-స్పీకర్ల శక్తివంతమైన జేబీఎల్ స్టూడియో సౌండ్ సిస్టమ్.
టెక్నాలజీ: లెవల్ 2 అడాస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్).
పెర్ఫార్మెన్స్: 4డబ్ల్యూడీ మోడల్ కోసం ప్రత్యేకమైన ఆఫ్-రోడ్ మోడ్స్.
ఎంజీ మెజెస్టర్ ఎస్‌యూవీ- ఇంజిన్ వివరాలు..
ఈ ఎంజీ మెజెస్టర్‌లో 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 216 హెచ్‌పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది. ఇది గ్లోస్టర్ పవర్‌ట్రెయిన్ లాగే 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కనెక్ట్ చేసి ఉంటుంది.
ఎంజీ మెజెస్టర్ ఎస్‌యూవీ- బుకింగ్స్..
ఎంజీ మేజెస్టర్ అధికారికంగా ఏప్రిల్ 2026లో మార్కెట్లోకి విడుదల కానుంది. అయితే, ఈ కారును సొంతం చేసుకోవాలనుకునే వారు ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. కస్టమర్లకు మే 2026 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
ఈ ఎంజీ మెజెస్టర్ ఎస్‌యూవీ ధరలను సంస్థ ఇంకా వెల్లడించలేదు.
ఈ ఎంజీ మెజెస్టర్.. మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్‌గా దూసుకెళుతున్న టయోటా ఫార్చ్యునర్కి గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంజీ మెజెస్టర్ ఎస్‌యూవీ వర్సెస్ టయోటా ఫార్చ్యునర్కి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రశ్నలు- సమాధానాలు..
ప్రశ్న- ఎంజీ మెజెస్టర్‌లో ఎన్ని వేరియంట్లు ఉన్నాయి?
సమాధానం- రెండు.
ప్రశ్న- ఎంజీ మెజెస్టర్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయా?
సమాధానం- బుకింగ్స్ ఓపెన్ అ్యాయి. రూ. 41వేల టోకెన్ అమౌంట్‌తో ఈ ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


