...
...
Next Story

MG Windsor EV : బెస్ట్ సెల్లింగ్ ఎంజీ విండ్సర్​ ఈవీలో స్పెషల్ ఎడిషన్- అదే హైలైట్..

భారత ఈవీ మార్కెట్లో రెండేళ్ల విజయవంతమైన ప్రయాణాన్ని పురస్కరించుకుని జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ ‘విండ్సర్ ఇండల్జ్’ ప్రత్యేక ఎడిషన్‌ను టీజ్ చేసింది. సరికొత్త లుక్, ప్రీమియం క్యాబిన్ అప్‌డేట్లతో రానున్న ఈ ఎలక్ట్రిక్ కారు గురించిన పూర్తి వివరాలు మీకోసం..

Published on: Oct 8, 2026, 14:39:55 IST
Advertisement

భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన ‘ఎంజీ విండ్సర్ ఈవీ’ దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టి విజయవంతంగా రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ రికార్డును పురస్కరించుకుని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ 'జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా' పండుగ సీజన్​లో కస్టమర్లకు ప్రత్యేక కానుక ఇచ్చేందుకు సిద్ధమైంది. విండ్సర్ ఈవీ మోడల్‌లో ‘ఎంజీ విండ్సర్ ఇండల్జ్ ఎడిషన్’ పేరుతో స్పెషల్ ఎడిషన్​ని తీసుకువస్తున్నట్లు ప్రకటిస్తూ ఒక టీజర్‌ను విడుదల చేసింది. ఈ పండుగ సీజన్ మధ్యలో ఈ ప్రత్యేక కారును అధికారికంగా విపణిలోకి ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

80 వేల మైలురాయి దాటిన ప్రయాణం..

ఎంజీ విండ్సర్ ఈవీ ఇండల్జ్ ఎడిషన్.
ఎంజీ విండ్సర్ ఈవీ ఇండల్జ్ ఎడిషన్.

2024లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన ఎంజీ విండ్సర్ ఈవీ, అతి స్వల్ప కాలంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా నిలిచింది. బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ ఆప్షన్‌తో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన ఈ సీయూవీ విశాలమైన లాంజ్ తరహా ఇంటీరియర్‌తో కస్టమర్లను ఆకట్టుకుంది. రెండేళ్ల కాలంలో ఏకంగా 80,000 కంటే ఎక్కువ యూనిట్ల అమ్మకాలతో సరికొత్త రికార్డు నెలకొల్పింది.

ఇండియాలో చాలా నెలల పాటు ఈ విండ్సర్​ ఈవీ.. బెస్ట్ సెల్లింగ్​ మోడల్​గా కొనసాగింది.

ఇక దసరా, దీపావళి పండగల వేళ ఈ 'ఇండల్జ్ ఎడిషన్' లాంచ్ ద్వారా కారు అమ్మకాలను మరింత పెంచాలని కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది.

ఎంజీ విండ్సర్ ఈవీ ఇండల్జ్ ఎడిషన్- కొత్త రంగులు.. ప్రీమియం హంగులు

కంపెనీ విడుదల చేసిన తొలి టీజర్ ద్వారా వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రాకపోయినా, ఈ ప్రత్యేక ఎడిషన్‌లో పలు ఆకర్షణీయమైన మార్పులు ఉండనున్నాయి:

ఎక్స్​టీరియర్ డిజైన్ : సరికొత్త కలర్ ఆప్షన్‌తో పాటు కారు వెలుపల, లోపల పలు చోట్ల ప్రత్యేకంగా 'Indulge Edition' బ్యాడ్జింగ్‌ను అందించనున్నారు.

సాంకేతికత: వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన అనుభూతిని అందించేందుకు ఈ ఎలక్ట్రిక్ కారులో అదనపు టెక్నాలజీ ఫీచర్లను జోడించే అవకాశం ఉంది.

ఎంజీ విండ్సర్ ఈవీ ఇండల్జ్ ఎడిషన్- పవర్‌ట్రెయిన్, బ్యాటరీ వివరాలు..

డిజైన్, క్యాబిన్ పరంగా మార్పులు ఉన్నప్పటికీ, కారు ఇంజిన్, పర్ఫార్మెన్స్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. సాధారణ మోడల్ లాగానే ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లతో రానుంది:

స్టాండర్డ్ వేరియంట్: 38 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉండి, సింగిల్ ఛార్జ్‌పై 332 కిలోమీటర్ల పరిధి (రేంజ్) ఇస్తుంది.

ప్రో వేరియంట్: 52.9 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 449 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

మోటార్ సామర్థ్యం: ఫ్రంట్ యాక్సిల్ ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా 134 బీహెచ్​పీ పవర్, 200 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పన్నం చేస్తుంది.

ఛార్జింగ్: పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉన్న మోడల్ 60 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇంట్లో ఛార్జ్ చేసుకోవడానికి 7.4 కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్‌ను ఉపయోగించవచ్చు.

పండుగ సీజన్‌లో కొత్త ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలనుకునే వారికి, ప్రత్యేక ఆకర్షణలతో రానున్న ఈ 'ఎంజీ విండ్సర్ ఇండల్జ్ ఎడిషన్' ఒక అద్భుతమైన ఆప్షన్‌గా మారనుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks