...
...
Next Story

Rape case : ‘నిర్భయ’ ఘటన రిపీట్- కదులుతున్న బస్సులో 16ఏళ్ల బాలికపై అత్యాచారం!

గ్రేటర్ నోయిడాలో కదులుతున్న స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై డ్రైవర్, కండక్టర్ దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టారు. 2012 నాటి దిల్లీ నిర్భయ ఘటనను గుర్తుచేసిన ఈ ఘోరానికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు వేగంగా విచారించి అరెస్ట్ చేశారు.

Published on: Aug 31, 2026, 13:30:56 IST
Advertisement

దిల్లీలో 2012లో దేశాన్ని కుదిపేసిన 'నిర్భయ' దారుణాన్ని గుర్తుచేస్తూ గ్రేటర్ నోయిడాలో మరో ఘోరం వెలుగుచూసింది. కదులుతున్న ప్రైవేట్ స్లీపర్ బస్సులో 16ఏళ్ల బాలికపై బస్సు డ్రైవర్, కండక్టర్ దారుణంగా సమూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

తల్లి కోప్పడిందని ఇల్లు వదిలి వచ్చి..

గ్రేటర్ నోయిడాలో మరో నిర్భయ తరహా ఘటన!
గ్రేటర్ నోయిడాలో మరో నిర్భయ తరహా ఘటన!

ఉత్తరప్రదేశ్​లోని మైన్‌పురి ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక చదువు విషయంలో తల్లి కోప్పడటంతో మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా నోయిడా సెక్టార్ 63లో నివసిస్తున్న బంధువుల ఇంటికి బయలుదేరింది. ఆగస్టు 4న రాత్రి 9 గంటల సమయంలో కుండపోత వర్షం పడుతుండగా గ్రేటర్ నోయిడాలోని దట్టమైన చీకటితో నిండిన 'పరీ చౌక్' వద్ద ఆ బాలిక బస్సు దిగింది. అక్కడి నుంచి తాను వెళ్లాల్సిన ప్రదేశం ఇంకా 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.

అదే సమయంలో 'విశ్వనాథ్ ట్రావెల్స్' అనే ప్రైవేట్ సంస్థకు చెందిన ఒక స్లీపర్ బస్సు అక్కడకు చేరుకుంది. బస్సులో ప్రయాణికులెవరూ లేరు. సూరజ్‌పూర్ వర్క్‌షాప్ నుంచి తిరిగి వస్తున్న ఆ బస్సు డ్రైవర్ కుల్దీప్ (39), కండక్టర్ సందీప్ (26) బాలికను గమనించారు. తాము కూడా నోయిడా సెక్టార్ 63 వైపే వెళుతున్నామని నమ్మించి ఆమెను బస్సు ఎక్కించుకున్నారు.

స్లీపర్ బస్సులో ఘోరం!

బస్సు కదిలిన కొద్దిసేపటికే నిందితుల బుద్ధి మారింది. స్లీపర్ బెర్తులకు ఉన్న తెరలను ఆసరాగా చేసుకుని, బాలికపై కండక్టర్ లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఆ తర్వాత ఇద్దరూ కలసి ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు. బాలిక కేకలు వేయడానికి ప్రయత్నించగా, తీవ్రంగా కొట్టి చంపేస్తామని బెదిరించారు.

బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బస్సు ప్రయాణించిన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, ఉత్తర దిల్లీలోని తిమార్‌పూర్ పార్కింగ్ స్థలంలో దాక్కున్న డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్‌లను అరెస్ట్ చేశారు.

నిందితులిద్దరూ గత రెండేళ్లుగా అదే ట్రావెల్స్ కంపెనీలో పనిచేస్తున్నారని తేలింది.

బాలికి గ్యాంగ్​ రేప్​నకు గురైన స్లీపర్ బస్సును​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ బృందం బస్సును పరిశీలించి బాలిక జుట్టు వెంట్రుకలు, ఇతర కీలక సాక్ష్యాలను సేకరించింది. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రతపై ఈ ఘటన మళ్లీ అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks