...
...
Next Story

గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో 'మింట్ మనీ' కొత్త ఆప్షన్.. బిల్ పేమెంట్స్ సేవలు ప్రారంభం

హిందూస్థాన్ టైమ్స్ గ్రూప్‌నకు చెందిన ఫిన్‌టెక్ యాప్ 'మింట్ మనీ' ఎన్‌పీసీఐ భారత్ బిల్‌పే భాగస్వామ్యంతో కొత్త బిల్ పేమెంట్స్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. విశ్వసనీయ ఆర్థిక సమాచారంతో పాటు రోజూవారీ బిల్లుల చెల్లింపులకు ఇది ఏకైక వేదికగా నిలవనుంది.

Published on: Sep 10, 2026, 15:56:07 IST
Advertisement

ముంబైలో జరుగుతున్న 'గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026' వేదికగా హెచ్‌టీ మీడియా గ్రూప్‌నకు చెందిన ఫిన్‌టెక్ యాప్ 'మింట్ మనీ' (Mint Money) కీలక ప్రకటన చేసింది. ఎన్‌పీసీఐ భారత్ బిల్‌పే లిమిటెడ్ (ఎన్‌బీబీఎల్) ద్వారా నడిచే 'భారత్ కనెక్ట్' మద్దతుతో కొత్తగా బిల్ పేమెంట్స్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

మింట్ మనీ యాప్ ప్రారంభించిన హెచ్ టీ మీడియా ప్రతినిధి బృందం
మింట్ మనీ యాప్ ప్రారంభించిన హెచ్ టీ మీడియా ప్రతినిధి బృందం

విశ్వసనీయమైన ఆర్థిక సమాచారం, విశ్లేషణలను అందించడంలో పేరుగాంచిన మింట్, ఇప్పుడు రోజువారీ బిల్లుల చెల్లింపులను కూడా తమ యాప్‌లోకి తీసుకొచ్చింది. వినియోగదారులు తమ ఆర్థిక నిర్ణయాలను సరైన రీతిలో తీసుకునేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని సంస్థ తెలిపింది.

మింట్ మనీ యాప్

బిల్లుల చెల్లింపులు ఇక సులభం

కొత్తగా ప్రవేశపెట్టిన బిల్ పేమెంట్స్ ఫీచర్‌ ద్వారా యూజర్లు తమ బిల్లులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయవచ్చు. బిల్లుల గడువుకు సంబంధించి రిమైండర్లు పొందడమే కాకుండా, నేరుగా యాప్ నుంచే క్షణాల్లో చెల్లింపులు పూర్తి చేయవచ్చు. తక్షణ సెటిల్మెంట్, ఆటో పే, బిల్లుల చెల్లింపులపై ప్రత్యేక రివార్డులు కూడా లభిస్తాయి.

మీడియా రంగంలో తొలి వినూత్న ప్రయోగం

భారతదేశ వార్తా మీడియా రంగంలో ఒక ప్రముఖ మీడియా సంస్థ భారత్ కనెక్ట్ సహకారంతో డిజిటల్ బిల్ పేమెంట్ సేవలను తీసుకురావడం ఇదే తొలిసారి. హెచ్‌టీ గ్రూప్‌నకు ఉన్న విశ్వసనీయత, భారత్ కనెక్ట్ నెట్‌వర్క్ కలవడంతో దేశవ్యాప్తంగా మిలియన్ల మందికి డిజిటల్ బిల్లుల చెల్లింపులు మరింత చేరువ కానున్నాయి.

ఆర్థిక నిర్ణయాలు తీసుకునేందుకు ఏఐ సాధనాలు

కేవలం బిల్ పేమెంట్స్ మాత్రమే కాకుండా, యూజర్లు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి మింట్ మనీ పలు వినూత్న ఫీచర్లను అందిస్తోంది.

  • రుణం తీసుకోవడం శ్రేయస్కరమో కాదో అంచనా వేసేందుకు 'క్రెడిట్ సేఫ్' (Credit Safe).
  • క్రెడిట్ స్కోరును మెరుగుపరుచుకోవడానికి పర్సనలైజ్డ్ ప్లాన్ అందించే 'క్రెడిట్ స్కోర్ బిల్డర్' (Credit Score Builder).
  • ఆర్థిక సందేహాలను నివృత్తి చేసే ఏఐ కోచ్ 'మనీ గురు' (Money Guru).
  • అత్యవసర ఆర్థిక అవసరాల కోసం పర్సనల్ లోన్స్ సదుపాయం.

దేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి హెచ్‌టీ గ్రూప్ సమాచార వ్యవస్థ చేరువలో ఉంది. వందేళ్ల నాటి నమ్మకమైన చరిత్ర ఉన్న హెచ్‌టీ గ్రూప్, 'మింట్' విశ్వసనీయ జర్నలిజం ఆధారంగా లక్షలాది మందికి ఆర్థిక అంశాలపై అవగాహన కలిగిస్తూ ఈ యాప్ సేవలను విస్తరిస్తోంది. ఈ కింది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మింట్ మనీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Mint Money app
 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks