మోటోరోలా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2026 మొదటి 'ఎడ్జ్' సిరీస్ స్మార్ట్‌ఫోన్, మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ పేరు, కలర్ ఆప్షన్స్ వంటి వివరాలు ప్రత్యక్షమయ్యాయి. అధికారిక లాంచ్ తేదీపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వనప్పటికీ, లీకైన మార్కెటింగ్ చిత్రాలు, ఫ్లిప్‌కార్ట్ టీజర్లు ఈ ఫోన్ త్వరలోనే విడుదల కానుందని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్- ఫ్లిప్‌కార్ట్ టీజర్, డిజైన్ విశేషాలు..

ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో కనిపిస్తున్న టీజర్ ప్రకారం.. ఈ మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ ఫోన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఫిబ్రవరి 23న వెల్లడి కానున్నాయి. అయితే ప్రధానంగా డిజైన్, భారీ బ్యాటరీపై కంపెనీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
కలర్స్: లెదర్ ఫినిషింగ్‌తో కూడిన బ్లూ సర్ఫ్, కంట్రీ ఎయిర్, సిల్హౌట్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది. వీటికి అదనంగా ఓరియంట్ బ్లూ, స్పోర్టింగ్ గ్రీన్ రంగులు కూడా ఉండే అవకాశం ఉంది.
కెమెరా ఫోకస్: "ఇతరులు మిస్ చేసే వాటిని కూడా క్యాప్చర్ చేసే లెన్స్" అంటూ ఇస్తున్న హింట్స్ చూస్తుంటే, ఇందులో ఉండే 50 మెగాపిక్సెల్ సోనీ లైటియా ప్రైమరీ కెమెరాకు పెద్ద పీట వేసినట్లు అర్థమవుతోంది.
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్- స్పెసిఫికేషన్లు (అంచనా)..
లీకైన సమాచారం ప్రకారం ఈ మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ అత్యంత శక్తివంతమైన ఫీచర్లతో రానుంది:
ప్రాసెసర్ అండ్ మెమరీ: ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేయనుంది. ఇది 12 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్ వేరియంట్లలో అందుబాటులోకి రావచ్చు.
డిస్‌ప్లే: 6.78- ఇంచ్ క్వాడ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో ఈ మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంది. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ రక్షణ ఉంటుంది.
{{/usCountry}}డిస్‌ప్లే: 6.78- ఇంచ్ క్వాడ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో ఈ మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంది. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ రక్షణ ఉంటుంది.
{{/usCountry}}కెమెరా: వెనుక వైపు మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండవచ్చు.
బ్యాటరీ: ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ. దీనికి 68డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుంది.
ప్రొటెక్షన్: ధూళి, నీటి నుంచి రక్షణ కోసం ఈ ఫోన్‌కు ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ ఇచ్చినట్లు సమాచారం.
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్- లుక్, స్టైల్..
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ చాలా స్లిమ్ ప్రొఫైల్‌తో, కర్వ్డ్ ఎడ్జెస్‌తో రానుంది. మెటాలిక్ ఫ్రేమ్, టెక్స్ఛర్డ్ బ్యాక్ ప్యానెల్ దీనికి ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. పవర్, వాల్యూమ్ బటన్లు కుడి వైపున ఉంటాయి. సెంటర్ హోల్-పంచ్ డిజైన్‌తో కూడిన కర్వ్డ్ డిస్‌ప్లే ఫోన్ అందాన్ని మరింత పెంచుతుంది.
ఈ గ్యాడ్జెట్ లాంచ్ డేట్, పూర్తి ఫీచర్స్, ధర వంటి వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.