భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మోటోరోలా తన పట్టును మరింత పెంచుకునేందుకు ‘ఎడ్జ్ 70 ఫ్యూజన్’ను లాంచ్ చేసింది. రూ. 30,000 లోపు బడ్జెట్‌లో పవర్‌ఫుల్ ఫీచర్లు కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను రూపొందించారు. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, ధర, సేల్ వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి.
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్- ధర, ఆఫర్లు..

మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది:
8 జీబీ/128 జీబీ: రూ. 26,999
8 జీబీ/256 జీబీ: రూ. 29,999
12 జీబీ/256 జీబీ: రూ. 32,999
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్- సేల్, ఆఫర్స్ వివరాలు..
లాంచ్ ఆఫర్: హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్‌పై రూ. 2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లేదా రూ. 2,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. దీనివల్ల ప్రారంభ ధర రూ. 24,999 కే అందుబాటులోకి వస్తుంది.
అదనంగా, రూ. 35,100 విలువైన గూగుల్ జెమినీ ప్రో ప్లాన్ 18 నెలల పాటు ఉచితంగా లభిస్తుంది.
సేల్: మార్చి 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా వెబ్‌సైట్‌లో అమ్మకాలు ప్రారంభమవుతాయి.
| Variant | Launch Price | First Sale Offers | Net Effective Price |
|---|---|---|---|
| 8GB + 128GB | ₹26,999 | ₹2,000 Bank/Exchange Discount + No Cost EMI + Free Gemini Pro Plan (18 months) | ₹24,999 |
| 8GB + 256GB | ₹29,999 | ₹2,000 Bank/Exchange Discount + No Cost EMI + Free Gemini Pro Plan (18 months) | ₹27,999 |
| 12GB + 256GB | ₹32,999 | ₹2,000 Bank/Exchange Discount + No Cost EMI + Free Gemini Pro Plan (18 months) | ₹30,999 |
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ సేల్- కీలక స్పెసిఫికేషన్లు..
డిస్ప్లే: ఈ మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌లో 6.78-ఇంచ్ 1.5K ఎక్స్ట్రీమ్ అమోలెడ్ డిస్ప్లే.
{{/usCountry}}డిస్ప్లే: ఈ మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌లో 6.78-ఇంచ్ 1.5K ఎక్స్ట్రీమ్ అమోలెడ్ డిస్ప్లే.
{{/usCountry}}ఇది 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 5,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీనికి గొరిల్లా గ్లాస్ 7ఐ రక్షణ ఉంది.
బాడీ అండ్ డిజైన్: ఇది కేవలం 7.99 ఎంఎం మందం, 193 గ్రాముల బరువు ఉంటుంది. ఐపీ68, ఐపీ69 రేటింగ్‌తో నీరు, డస్ట్ నుంచి పూర్తి రక్షణ ఇస్తుంది. అలాగే 16 రకాల మిలిటరీ గ్రేడ్ (MIL-STD-810H) పరీక్షల్లో ఇది ఉత్తీర్ణత సాధించింది.
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 చిప్‌సెట్.
మెరుగైన కూలింగ్ కోసం 4473ఎంఎం² వేపర్ ఛాంబర్‌ను అమర్చారు.సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 16 ఆధారిత ‘హలో యూఐ’. 3 ఓఎస్ అప్‌గ్రేడ్లు, 5 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్ల హామీ ఉంది.
బ్యాటరీ: ఈ మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ గ్యాడ్జెట్లో భారీ 7000 ఎంఏహెచ్ సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంటుంది. దీనికి 68డబ్ల్యూ టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
| మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ | |
|---|---|
| Display | 6.78-inch Super HD AMOLED (2772 x 1272), 144Hz, HDR10+
|
| Rear Camera | 50MP primary (Sony LYTIA 710, OIS) + 13MP ultra-wide/macro
|
| Front Camera | 32MP
|
| Battery & Charging | 7000mAh, 68W wired fast charging
|
| Software | Android 16 (Hello UI)
|
| Durability | IP68, IP69, MIL-STD-810H
|
| Weight | 193g
|
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్- కెమెరా పనితీరు..
రేర్ కెమెరా: 50 ఎంపీ సోనీ LYTIA 710 ప్రైమరీ సెన్సార్ (ఓఐఎస్ సపోర్ట్‌తో) + 13 ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ (ఇది మాక్రో లెన్స్‌గా కూడా పనిచేస్తుంది).
సెల్ఫీ: 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా.
వీడియో: ముందు, వెనుక కెమెరాల నుంచి 4కే 30 ఎఫ్‌పీఎస్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు.
ఇతర ఫీచర్లు: డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్లు, ఎన్ఎఫ్సీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 6.0, 16 రకాల 5జీ బ్యాండ్‌లకు సపోర్ట్ చేస్తుంది.
మరి మీరు ఈ మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌ని కొంటున్నారా?