...
...
Next Story

Moto G37 : మోటోరోలా నుంచి 2 కొత్త స్మార్ట్​ఫోన్స్​- త్వరలోనే లాంచ్! ఫీచర్స్, ధర వివరాలు..

Moto G37 power : భారత మార్కెట్​లోకి మోటో జీ37, మోటో జీ37 పవర్ స్మార్ట్‌ఫోన్స్ మే 19న విడుదల కానున్నాయి. భారీ బ్యాటరీ, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఓఎస్, సరికొత్త డైమెన్సిటీ 6400 చిప్‌సెట్ వంటి అదిరిపోయే ఫీచర్లతో ఈ ఫోన్లు రాబోతున్నాయి.

Published on: May 15, 2026, 05:58:08 IST
Advertisement

Moto G37 India launch date : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా తన పాపులర్ ‘జీ’ సిరీస్‌లో మరో రెండు కొత్త ఫోన్లను భారత మార్కెట్​లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. అవే.. మోటో జీ37, మోటో జీ37 పవర్. ఈ మోడళ్లు మే 19న మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌లో గ్రాండ్‌గా లాంచ్ కానున్నట్లు కంపెనీ తన సోషల్ మీడియా వేదికల ద్వారా ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో అడుగుపెట్టిన ఈ గ్యాడ్జెట్స్​.. భారతీయ వినియోగదారుల కోసం మరిన్ని అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

భారత్ కోసం ప్రత్యేకమైన ప్రాసెసర్!

మోటో జీ37 సిరీస్ లాంచ్​ డేట్​, ఫీచర్స్​, ధరలు.. (Representative Image)
మోటో జీ37 సిరీస్ లాంచ్​ డేట్​, ఫీచర్స్​, ధరలు.. (Representative Image)

యూరప్ మార్కెట్‌లో ఈ మోటో జీ37, మోటో జీ37 పవర్ స్మార్ట్​ఫోన్స్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో విడుదలయ్యాయి. అయితే, భారతీయ వేరియంట్లలో మాత్రం మరింత శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌ను వాడుతున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఇది వినియోగదారులకు వేగవంతమైన పర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది.

బ్యాటరీ ‘పవర్’ మామూలుగా లేదు!

ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణ మోటో జీ37 పవర్. ఇందులో ఏకంగా 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు రోజుల పాటు బ్యాటరీ వస్తుందని కంపెనీ చెబుతోంది. దీనికి తోడు 30డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇక స్టాండర్డ్ మోటో జీ37 మోడల్ 5,200ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది.

డిస్‌ప్లే, ఇతర ఫీచర్లు..

డిస్‌ప్లే: రెండు స్మార్ట్​ఫోన్స్​లోనూ 6.67 అంగుళాల హెచ్​డీ+ ఎల్​సీడీ స్క్రీన్ ఉంటుంది. ఇది 120హెచ్​జెడ్ రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i వాడారు.

సాఫ్ట్‌వేర్: ఆశ్చర్యకరంగా ఇవి లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తున్నాయి.

కెమెరా: ఫోటోగ్రఫీ కోసం వెనుకవైపు క్వాడ్-పిక్సెల్ టెక్నాలజీతో కూడిన 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది.

యూరప్‌లో మోటో జీ37 పవర్ ధర సుమారు రూ. 31,000 (279 యూరోలు) కాగా, మోటో జీ37 ధర సుమారు రూ. 27,000 (249 యూరోలు)గా ఉంది. భారత్‌లో కూడా ఇంచుమించు ఇదే ధరల్లో లేదా పోటీని దృష్టిలో ఉంచుకుని కాస్త తక్కువకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మే 19న లాంచ్ అయిన వెంటనే ఫ్లిప్‌కార్ట్, ఇతర ప్రముఖ రిటైల్ స్టోర్లలో ఇవి కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.

తరచూ అడిగే ప్రశ్నలు-

ప్రశ్న 1- మోటో జీ37 పవర్ బ్యాటరీ ప్రత్యేకత ఏంటి, ఇది ఎంతకాలం వస్తుంది?

సమాధానం: మోటో జీ37 పవర్ 7,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వస్తుంది, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు రోజుల వరకు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీనికి తోడు 30డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు.

ప్రశ్న 2: మోటో జీ37 సిరీస్ ఫోన్లు ఎప్పుడు, ఎక్కడ అందుబాటులోకి వస్తాయి?

సమాధానం: ఈ స్మార్ట్‌ఫోన్లు మే 19వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్​లో లాంచ్ కానున్నాయి. వినియోగదారులు వీటిని ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ప్రధాన రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks