Dhoni Mobile: ధోనీ చేతుల్లో ఫోన్ చూసి ఫ్యాన్స్ షాక్.. అర్జున్ టెండూల్కర్ పెళ్లిలో ఎప్పుడూ చూడని వింత.. వీడియో వైరల్

క్రికెట్ లెెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకకు ఎంఎస్ ధోనీ హాజరయ్యాడు. ముంబైలో జరిగిన ఈ వేడుకలో ధోనీ చేతిలో మొబైల్ ఫోన్ (Dhoni Mobile) కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారింది.

Published on: Mar 5, 2026, 19:27:28 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రపంచ క్రికెట్‌లో మూడు ఐసీసీ వైట్-బాల్ ట్రోఫీలను గెలిచిన ఏకైక కెప్టెన్ ఎంఎస్ ధోనీ. అతడు గురువారం (మార్చి 5) ముంబైలో జరిగిన అర్జున్ టెండూల్కర్ - సానియా చందోక్ వివాహ వేడుకలో మెరిశాడు. తన భార్య సాక్షితో కలిసి వేదిక వద్దకు చేరుకున్న ధోనీ.. ఫోటోగ్రాఫర్లకు నవ్వుతూ ఫోజులిచ్చాడు. సాక్షి లోపలికి వెళ్లిన తర్వాత కూడా ధోనీ మరికొంత సమయం పాపరాజీల కోసం వేచి ఉండి, వారందరినీ పలకరించడం విశేషం. అయితే అతని చేతుల్లో ఉన్న మొబైల్ పైనే అందరి కళ్లూ పడ్డాయి.

Dhoni Mobile: ధోనీ చేతుల్లో ఫోన్ చూసి ఫ్యాన్స్ షాక్.. అర్జున్ టెండూల్కర్ పెళ్లిలో ఎప్పుడూ చూడని వింత.. వీడియో వైరల్ (CSK - X)
Dhoni Mobile: ధోనీ చేతుల్లో ఫోన్ చూసి ఫ్యాన్స్ షాక్.. అర్జున్ టెండూల్కర్ పెళ్లిలో ఎప్పుడూ చూడని వింత.. వీడియో వైరల్ (CSK - X)

ధోనీ మొబైల్ ఫోన్ మిస్టరీ

ఈ వేడుకలో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ధోనీ చేతిలో మొబైల్ ఫోన్ ఉండటం. ధోనీకి ఫోన్లంటే పెద్దగా ఇష్టం ఉండదని, కనీసం మెసేజ్‌లకు కూడా స్పందించరని అతని మాజీ సహచరులు చాలా సందర్భాల్లో చెప్పారు. గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ సాయి కిషోర్ కూడా గతంలో ధోనీ ఫోన్ వాడకం గురించి చెబుతూ.. "ధోనీ తన ఫోన్‌ను హోటల్ గదిలోనే వదిలేసి మ్యాచ్‌లకు వస్తారు. సోషల్ మీడియాకు, ఫోన్లకు ఆయన చాలా దూరంగా ఉంటారు" అని వెల్లడించారు.

అలాంటిది ధోనీ ఫోన్ పట్టుకుని కనిపించడంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఇది అత్యంత అరుదుగా కనిపించే సీన్ అని, అర్జున్ టెండూల్కర్ పెళ్లిలో ఇది సాధ్యమైందని పలువురు ఫ్యాన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ అంటూ మరికొందరు ఈ న్యూస్ షేర్ చేయగా.. అది సాక్షి ఫోన్ అయితే కాదుగా అని అనుమానం కూడా వ్యక్తం చేశారు.

ప్రముఖుల సమక్షంలో అర్జున్ వివాహం

గతేడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్ ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఈ వేడుకకు భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ వంటి క్రికెట్ దిగ్గజాలు హాజరయ్యారు. వీరితో పాటు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ కూడా సందడి చేశారు.

ఐపీఎల్ 2026 సిద్ధం

ధోనీ ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) శిక్షణ శిబిరంలో చేరి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ కోసం అతడు సిద్ధమవుతున్నాడు. మరోవైపు, అర్జున్ టెండూల్కర్ ఈసారి ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తరపున బరిలోకి దిగనున్నాడు. రూ. 30 లక్షల ట్రేడ్ డీల్‌తో అతడు లక్నో జట్టులో చేరాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More