ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఎట్టకేలకు దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ నుంచి అధికారిక ధృవీకరణ వచ్చేసింది. సీఎస్కే టీమ్ తరఫున రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 ఎడిషన్‌లో ఎమ్మెస్ ధోనీ ఆడనున్నాడు. ఈ విషయాన్ని ధోనీ తమకు తెలియజేశాడని ఆ ఫ్రాంఛైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ స్వయంగా ధృవీకరించారు. “ఎంఎస్ ధోనీ తదుపరి సీజన్‌కు తాను అందుబాటులో ఉంటానని మాకు చెప్పారు” అని కాశీ విశ్వనాథన్ Cricbuzzతో మాట్లాడుతూ పేర్కొన్నారు.
మరో సీజన్ ఆడనున్న ధోనీ
ఐపీఎల్ 2025లో తొలిసారిగా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఆ సీజన్‌లో రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మధ్యలోనే టోర్నీ నుంచి తప్పుకోవడంతో.. ధోనీ స్వయంగా కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. అయితే ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిపించిన ఈ వికెట్ కీపర్-బ్యాటర్, జట్టు అదృష్టాన్ని మార్చలేకపోయాడు.
ముఖ్యంగా ఆ సీజన్‌లో ధోనీ బ్యాటింగ్ స్థానం కూడా చర్చనీయాంశమైంది. అతడు రెండు సార్లు ఏకంగా 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. 44 ఏళ్ల ధోనీ ఐపీఎల్ నిషేధానికి గురైన రెండు సీజన్‌లు మినహా తన కెరీర్ మొత్తం సీఎస్కేతోనే ఉన్నాడు.రాబోయే ఐపీఎల్ సీజన్ ధోనీకి సీఎస్కే తరఫున 17వ సీజన్ కాగా, మొత్తం మీద 19వ ఐపీఎల్ సీజన్ అవుతుంది. ధోనీ సీఎస్కే తరఫున ఇప్పటివరకు 248 మ్యాచ్‌లు ఆడి 4,865 పరుగులు సాధించాడు. 2010, 2011, 2018, 2021, 2023లో ఫ్రాంఛైజీకి ఐదు టైటిల్స్ అందించాడు.
సంజు శాంసన్ ట్రేడింగ్
రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీకి సంజు శాంసన్ దూరం కావాలని అనుకుంటున్నట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా ఈ భారత వికెట్ కీపర్-బ్యాటర్ పై ఢిల్లీ క్యాపిటల్స్ కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే Cricbuzz రిపోర్టు ప్రకారం సంజు శాంసన్ ట్రేడ్‌పై సీఎస్కే ఫ్రాంఛైజీ.. రాజస్థాన్ రాయల్స్ మళ్లీ సంప్రదింపులు ప్రారంభించింది.ఈ ట్రేడింగ్ డీల్‌లో సీఎస్కే నుంచి ఒక టాప్ ప్లేయర్ కూడా ఉండే అవకాశం ఉంది.
రాజస్థాన్ రాయల్స్ యజమాని మనోజ్ బదాలే లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్‌తో సహా అనేక ఫ్రాంఛైజీలతో చర్చలు జరుపుతున్నారు.మరోవైపు చెన్నై ఫ్రాంఛైజీ కూడా తమ జట్టులోని ఒక ముఖ్య ఆటగాడిని రాజస్థాన్ రాయల్స్‌కు ఇవ్వడానికి సిద్ధంగా ఉందా లేదా అన్న విషయం కూడా ఆరా తీసినట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఈ ట్రేడింగ్ పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రిటెన్షన్స్ ప్రకటించడానికి చివరి గడువు నవంబర్ 15 కాగా.. ఐపీఎల్ 2026 ఎడిషన్‌కు ముందు మినీ వేలం డిసెంబర్లో జరిగే అవకాశం ఉంది.
{{/usCountry}}రాజస్థాన్ రాయల్స్ యజమాని మనోజ్ బదాలే లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్‌తో సహా అనేక ఫ్రాంఛైజీలతో చర్చలు జరుపుతున్నారు.మరోవైపు చెన్నై ఫ్రాంఛైజీ కూడా తమ జట్టులోని ఒక ముఖ్య ఆటగాడిని రాజస్థాన్ రాయల్స్‌కు ఇవ్వడానికి సిద్ధంగా ఉందా లేదా అన్న విషయం కూడా ఆరా తీసినట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఈ ట్రేడింగ్ పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రిటెన్షన్స్ ప్రకటించడానికి చివరి గడువు నవంబర్ 15 కాగా.. ఐపీఎల్ 2026 ఎడిషన్‌కు ముందు మినీ వేలం డిసెంబర్లో జరిగే అవకాశం ఉంది.
{{/usCountry}}