...
...
Next Story

బంగ్లాదేశ్‌లో హిందువుల హ‌త్య‌లు.. ఐపీఎల్‌లో ఆ దేశ ఆట‌గాడిపై వేటు.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న బీసీసీఐ

బంగ్లాదేశ్ లో హిందువుల హత్యలు కలకలం రేపుతున్నాయి. ఈ పరిమాణాల నేపథ్యంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలో హిందువుల హత్యలకు నిరసనగా బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రెహ్మాన్‌ ఐపీఎల్ ఆడకుండా వేటు వేసింది. కేకేఆర్ టీమ్ ఆ పేసర్ ను రిలీజ్ చేసింది.

Published on: Jan 3, 2026, 16:58:48 IST
Advertisement

బంగ్లాదేశ్ లో హిందువులపై హత్యలు సంచలనంగా మారాయి. ఈ హత్యలను భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ లో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆడకుండా సంచలన నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. బీసీసీఐ ఆదేశాలతో ముస్తాఫిజుర్ ను తమ జట్టు నుంచి కేకేఆర్ తప్పించింది.

ముస్తాఫిజుర్ ఔట్

ముస్తాఫిజుర్ రెహ్మాన్ (AP)
ముస్తాఫిజుర్ రెహ్మాన్ (AP)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 ఎడిషన్‌కు ముందు బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌పై వేటు పడింది. తమ జట్టు నుండి విడుదల చేయాలనే ఆదేశాలు వచ్చిన తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) శనివారం (జనవరి 3) స్పందించింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) సెక్రటరీ దేవాజిత్ సైకియా పీటీఐతో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో ఇటీవల హిందువులు హత్యకు గురైన కారణంగా ముస్తాఫిజుర్ ను వదులుకోవాలని కేకేఆర్ చెప్పినట్లు తెలిపాడు.

రూ.9.20 కోట్లు

ఇటీవల ఐపీఎల్ 2026 మినీ వేలంలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను రూ.9.20 కోట్లకు కేకేఆర్ కొనుక్కుంది. "రాబోయే ఐపీఎల్ సీజన్‌కు ముందు ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను జట్టు నుండి విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించింది. సరైన ప్రక్రియ, సంప్రదింపుల తర్వాత ఆటగాణ్ని రిలీజ్ చేశాం. ఐపీఎల్ నిబంధనలకు అనుగుణంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంచుకునే అవకాశాన్ని బీసీసీఐ ఇచ్చింది’’ అని కేకేఆర్ ప్రకటనలో తెలిపింది.

అసలు వివాదం ఏమిటి?

గత కొన్ని రోజులుగా కేకేఆర్, దాని సహ-యజమాని షారుక్ ఖాన్ ను పలువురు రాజకీయ నాయకులు, సోషల్ మీడియా యూజర్లు టార్గెట్ చేశారు. జాతీయ సెంటిమెంట్లను పట్టించుకోకుండా బంగ్లాదేశ్ ఆటగాడిని ఫ్రాంచైజీ కొనుగోలు చేయడంపై భారతదేశంలో చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. మైనంలో హిందూ వ్యక్తి దీపు చంద్ర దాస్ మరణం తర్వాత భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా కొనసాగుతున్నాయి.

షారుక్ ఖాన్ దేశద్రోహి

అధికారిక ఐపీఎల్ మార్గదర్శకాల ప్రకారం.. వేలంలో ఒక ఆటగాడిని ఎంచుకున్న తర్వాత ఏ ఫ్రాంచైజీ కూడా తన జట్టు నుండి విడుదల చేయలేదు. తుది నిర్ణయం ఐపీఎల్ పాలక మండలి లేదా బీసీసీఐ తీసుకోవాలి. ఇప్పుడు బీసీసీఐ ఆదేశాలతో కేకేఆర్ తమ టీమ్ నుంచి ముస్తాఫిజుర్ ను తప్పించింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks