సమాజం తలదించుకునేలా మూడేళ్ల అమాయక చిన్నారిపై ఓ వృద్ధుడు అమానుషంగా అత్యాచారం చేసి, ఆపై హత్య చేసిన కేసులో మహారాష్ట్ర పూణె సెషన్స్ కోర్టు సోమవారం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఈ ఘోరానికి ఒడిగట్టిన 65 ఏళ్ల భీమ్‌రావ్ కాంబ్లే అనే దోషికి కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. భఈమ్రావ్ని "ప్రాణం పోయే వరకు ఉరితీయాలి" అని ప్రత్యేక న్యాయమూర్తి ఎస్ఆర్ సాలుంఖే తన తీర్పులో స్పష్టం చేశారు.
అసలేంటి ఈ కేసు?
ఈ ఏడాది మే 1వ తేదీన భోర్ తహసీల్ పరిధిలోని నస్రాపూర్‌లో ఈ ఘాతుకం జరిగింది. వేసవి సెలవుల కోసం సదరు చిన్నారి తన నానమ్మ ఇంటికి వెళ్లింది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్య సమయంలో కాంబ్లే ఆ చిన్నారికి తినుబండారాలు ఇస్తానని, అలాగే పశువుల పాకలో ఉన్న చిన్న దూడను చూపిస్తానని ఆశ చూపి, నమ్మించి తీసుకువెళ్లాడు. అక్కడ ఒక షెడ్డులోకి తీసుకెళ్లి ఆ పసికందుపై క్రూరంగా లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, ఆపై దారుణంగా హత్య చేశాడు.
అరుదైన వాటిల్లో అత్యంత అరుదైన కేసు!
గత వారమే నిందితుడు భీమ్‌రావ్ కాంబ్లేను దోషిగా నిర్ధారించిన ప్రత్యేక పోక్సో కోర్టు, శిక్షకు సంబంధించిన తీర్పును జూన్ 29కి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ సమర్పించిన పక్కా ఆధారాలు, ఫోరెన్సిక్ రిపోర్టులు నిందితుడే ఈ నేరానికి పాల్పడ్డాడని ఎటువంటి సందేహం లేకుండా నిరూపించాయి. నిందితుడు చేసిన ఈ అమానవీయ చర్యను తీవ్రంగా ఖండించిన ప్రాసిక్యూషన్, ఇది సమాజంపై జరిగిన దాడిగా పేర్కొంటూ ఉరిశిక్షే సరైనదని కోర్టులో వాదించింది.
న్యాయమూర్తి ఎస్ఆర్ సాలుంఖే తీర్పునిస్తూ.. ఈ కేసు సమాజంలో అత్యంత అరుదైన కోవలోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. "నేరం రుజువైనప్పటికీ ప్రతివాదిలో ఎలాంటి పశ్చాత్తాపం గానీ, మారాలనే ఆలోచన గానీ కనిపించడం లేదు. ఇలాంటి క్రూరమైన నేరానికి మరణశిక్ష మాత్రమే సరైన న్యాయం," అని న్యాయస్థానం స్పష్టం చేసింది.
{{/usCountry}}న్యాయమూర్తి ఎస్ఆర్ సాలుంఖే తీర్పునిస్తూ.. ఈ కేసు సమాజంలో అత్యంత అరుదైన కోవలోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. "నేరం రుజువైనప్పటికీ ప్రతివాదిలో ఎలాంటి పశ్చాత్తాపం గానీ, మారాలనే ఆలోచన గానీ కనిపించడం లేదు. ఇలాంటి క్రూరమైన నేరానికి మరణశిక్ష మాత్రమే సరైన న్యాయం," అని న్యాయస్థానం స్పష్టం చేసింది.
{{/usCountry}}నేరం జరిగిన 60 రోజుల్లోనే ఈ కేసులో తీర్పు వెలువరడం జరిగింది.
కాగా భీమ్రావ్పై గతంలోనే పలు కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. 62ఏళ్ల వృద్ధురాలు, 17ఏళ్ల బాలికను వేధించినట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు జంతు దాడికి కూడా పాల్పడినట్టు సమాచారం.
దేశవ్యాప్తంగా మహిళలు, చిన్న పిల్లలపై జరుగుతున్న ఇలాంటి అఘాయిత్యాలకు ఈ తీర్పు ఒక గట్టి హెచ్చరికలా నిలుస్తుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.