...
...
Next Story

NEET UG 2026 : నీట్ యూజీ​ రిజిస్ట్రేషన్​ మిస్​ అయ్యారా? మీకోసమే ఈ గుడ్​ న్యూస్​..

NEET UG 2026 Registration date extended : నీట్​ యూజీ 2026 అభ్యర్థులకు బిగ్​ అప్డేట్​! నీట్​ యూజీ రిజిస్ట్రేషన్​ గడువును ఎన్టీఏ ఎక్స్​టెండ్​ చేసింది. తాజా డేట్​తో పాటు ఈ పరీక్షకు సంబంధించిన ఇతర పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Mar 9, 2026, 11:21:02 IST
Advertisement

దేశంలో అత్యంత కఠిన పరీక్షల్లో ఒకటిగా పేరొంది, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్​ యూజీ) 2026 దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పొడిగించింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

నీట్​ యూజీ 2026 రిజిస్ట్రేషన్​ గడువు పొడిగింపు- దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడు?

నీట్​ యూజీ 2026 అప్డేట్స్​.. (Unsplash)
నీట్​ యూజీ 2026 అప్డేట్స్​.. (Unsplash)

ఎన్టీఏ వెల్లడించిన అధికారిక నోటీసు ప్రకారం.. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీని మార్చి 11, 2026 (రాత్రి 9:00 గంటల వరకు) పొడిగించారు. అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి అదే రోజు రాత్రి 11:50 గంటల వరకు సమయం ఉంటుంది.

"ఇదే చివరి అవకాశం, దీని తర్వాత గడువు పొడిగించే ప్రసక్తే లేదు," అని ఎన్టీఏ స్పష్టం చేసింది.

నీట్ యూజీ 2026- దరఖాస్తు చేసుకునే విధానం..

అభ్యర్థులు కింద పేర్కొన్న సులభమైన దశల ద్వారా తమ దరఖాస్తును పూర్తి చేయవచ్చు:

స్టెప్​ 1- అధికారిక వెబ్‌సైట్: ముందుగా neet.nta.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.

స్టెప్​ 2- రిజిస్ట్రేషన్: హోమ్ పేజీలో కనిపించే 'NEET UG 2026 Registration' లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3- వివరాల నమోదు: కొత్త పేజీలో మీ వ్యక్తిగత, విద్యాపరమైన వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.

స్టెప్​ 4- లాగిన్: రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, మీ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.

స్టెప్​ 5- ఫీజు చెల్లింపు: అప్లికేషన్ ఫారమ్‌ను నింపి, ఆన్‌లైన్ మోడ్‌లో నిర్ణీత ఫీజు చెల్లించండి.

స్టెప్​ 7- ప్రింటౌట్: భవిష్యత్తు అవసరాల కోసం నీట్​ యూజీ 2026 అప్లికేషన్​ ఫామ్​ కాపీని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసి పెట్టుకోండి.

నీట్​ యూజీ 2026- కేటగిరీల వారీగా దరఖాస్తు ఫీజు..

జనరల్​- రూ. 1700

జనరల్​- ఈడబ్ల్యూఎస్​, ఓబీసీ- ఎన్​సీఎల్​- రూ. 1600

ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, థర్డ్​ జెండర్​- రూ. 1000

నీట్​ యూజీ 2026- పరీక్ష షెడ్యూల్..

నీట్​ యూజీ 2026 పరీక్ష తేదీ: మే 3, 2026

సమయం: మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు (మొత్తం 180 నిమిషాలు).

భాషలు: తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూ.. మొత్తం 13 భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు.

అభ్యర్థులు ఇతర సమాచారం కోసం క్రమం తప్పకుండా అధికారిక వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలని అధికారులు సూచించారు.

నీట్​ యూజీ 2026 రిజిస్ట్రేషన్​ డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

నీట్​ యూజీ 2026 నోటీసును ఇక్కడ క్లిక్​ చేసి చూడండి.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. నీట్ యూజీ పరీక్ష రాయడానికి ఎన్నిసార్లు అవకాశం ఉంటుంది? వయోపరిమితి ఉందా?

గతంలో నీట్ పరీక్ష రాయడానికి కొన్ని పరిమితులు ఉండేవి, కానీ ప్రస్తుత నిబంధనల ప్రకారం అభ్యర్థులకు ఊరట లభించింది.

అటెంప్ట్స్: నీట్ యూజీ పరీక్షను ఒక అభ్యర్థి ఎన్నిసార్లు అయినా రాయవచ్చు. ప్రయత్నాల సంఖ్యపై ఎటువంటి పరిమితి లేదు.

వయోపరిమితి: అభ్యర్థికి కనీసం 17 ఏళ్లు నిండి ఉండాలి. అయితే, గరిష్ట వయోపరిమితిపై గతంలో ఉన్న ఆంక్షలను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్​ఎంసీ) తొలగించింది. కాబట్టి, అర్హత గల ఎవరైనా ఈ పరీక్షకు హాజరుకావచ్చు.

2. నీట్ పరీక్షలో నెగటివ్ మార్కింగ్ విధానం ఎలా ఉంటుంది? స్కోరును ఎలా లెక్కిస్తారు?

నీట్ పరీక్ష మొత్తం 720 మార్కులకు ఉంటుంది. ఇందులో ప్రతి తప్పు సమాధానానికి మార్కులు కోత విధిస్తారు, కాబట్టి సమాధానాలు గుర్తించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

మార్కింగ్ విధానం: ప్రతి సరైన సమాధానానికి +4 మార్కులు లభిస్తాయి. ప్రతి తప్పు సమాధానానికి -1 మార్కు (నెగటివ్ మార్కింగ్) కట్ అవుతుంది. ఒకవేళ మీరు ఏదైనా ప్రశ్నకు సమాధానం గుర్తించకుండా వదిలేస్తే, ఆ ప్రశ్నకు సున్నా మార్కులు వస్తాయి.

3. ఇంటర్మీడియట్ బోర్డ్ పరీక్షల్లో ఎన్ని మార్కులు వస్తే నీట్ రాయడానికి అర్హత లభిస్తుంది?

నీట్ కేవలం ప్రవేశ పరీక్ష మాత్రమే కాదు, దీనికి హాజరయ్యే ముందు ఇంటర్మీడియట్ (12వ తరగతి)లో నిర్ణీత మార్కులు సాధించడం తప్పనిసరి.

అర్హత మార్కులు: జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/బయోటెక్నాలజీ సబ్జెక్టులలో కలిపి కనీసం 50% మార్కులు సాధించాలి.

రిజర్వ్డ్ కేటగిరీ: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు కనీసం 40% మార్కులు, పర్సన్ విత్ డిజెబిలిటీ (పీడబ్ల్యూడీ) అభ్యర్థులకు 45% మార్కులు ఉండాలి. ఈ మార్కులు కేవలం పాస్ అవ్వడానికి మాత్రమే కాదు, కౌన్సెలింగ్ సమయంలో సీటు పొందేందుకు ప్రాథమిక అర్హతగా పరిగణిస్తారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe