ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్, ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థల్లో ఉద్యోగాల కోత పర్వం కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ తన మొత్తం సిబ్బందిలో దాదాపు 5 శాతం మందిని తొలగించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. వ్యాపారాన్ని విస్తరించేందుకు గేమింగ్, పాడ్‌కాస్ట్‌లు, లైవ్ ఈవెంట్ల వైపు అడుగులు వేస్తున్న నెట్‌ఫ్లిక్స్, వ్యయాలను అదుపులో ఉంచుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వచ్చే వారమే ఉద్యోగాల కోత?

'పక్' (Puck) న్యూస్‌లెటర్ నివేదిక ప్రకారం.. నెట్‌ఫ్లిక్స్ వచ్చే వారంలోనే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఈ కథనాలపై స్పందించేందుకు నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధి నిరాకరించినట్లు బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. గత ఏడాది చివరి నాటికి నెట్‌ఫ్లిక్స్‌లో సుమారు 16,000 మంది పూర్తికాల ఉద్యోగులు ఉండగా, వారిలో 68 శాతం మంది అమెరికాలోనే పనిచేస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్‌కు తగ్గిన ఆదరణ.. పడిపోయిన షేర్లు
నెట్‌ఫ్లిక్స్ షేర్ల విలువ ఇటీవల దాదాపు 42 శాతం మేర పడిపోయింది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడమే ఇందుకు కారణమని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. కాగా, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని స్కైడాన్స్ కార్పొరేషన్ ఇటీవలే దక్కించుకుంది. మరోవైపు నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ వీక్షణలో కూడా మందగమనం కనిపిస్తోంది. గడిచిన కాలంలో నెట్‌ఫ్లిక్స్ ఎంగేజ్‌మెంట్ వృద్ధి కేవలం 2 శాతానికే పరిమితం కాగా, గడిచిన దశాబ్దంలో ఎన్నడూ లేనంతగా ఎమ్మీ అవార్డుల సంఖ్య తగ్గిపోయింది.
ఆదాయాన్ని పెంచుకోవడానికి పాస్‌వర్డ్ షేరింగ్‌పై పరిమితులు విధించడం, చౌకైన అడ్వర్టైజ్‌మెంట్ ప్లాన్‌లను ప్రవేశపెట్టడం, చందా ధరలు పెంచడం వంటి చర్యలు చేపట్టినప్పటికీ సేల్స్ గ్రోత్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదని సీఈఓ టెడ్ సరండోస్ వెల్లడించారు. ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి ఫ్రాన్స్ నెట్‌వర్క్ 'టీఎఫ్1' (TF1) కంటెంట్‌తో పాటు లైవ్ ఈవెంట్లు, గేమ్‌లను అందుబాటులోకి తెస్తోంది. నెట్‌ఫ్లిక్స్ అక్టోబర్ 20న తన త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించనుంది.
అమెజాన్‌లోనూ కొలువుల కోత
మరోవైపు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా స్టోర్స్ విభాగానికి చెందిన 1,000 మంది కంటే తక్కువ మంది వైట్ కాలర్ ఉద్యోగులను తొలగించింది. వార్షిక 'ప్రైమ్ బిగ్ డీల్ డేస్' షాపింగ్ ఈవెంట్ జరుగుతున్న సమయంలోనే అమెజాన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గత ఏడాది నుంచి ఇప్పటివరకు దాదాపు 30,000 మంది సిబ్బందిని తొలగించిన అమెజాన్, అందులో భాగంగానే తాజాగా మరికొందరిని ఇంటికి పంపింది. భారత్, అమెరికా, బ్రిటన్ వ్యాప్తంగా ఉన్న కస్టమర్ సర్వీస్, సెల్లింగ్ పార్ట్నర్ విభాగాల ఉద్యోగులపై ఈ ప్రభావం పడింది.
పాండమిక్ హడావుడే కారణం: జెఫ్ బెజోస్
{{/usCountry}}మరోవైపు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా స్టోర్స్ విభాగానికి చెందిన 1,000 మంది కంటే తక్కువ మంది వైట్ కాలర్ ఉద్యోగులను తొలగించింది. వార్షిక 'ప్రైమ్ బిగ్ డీల్ డేస్' షాపింగ్ ఈవెంట్ జరుగుతున్న సమయంలోనే అమెజాన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గత ఏడాది నుంచి ఇప్పటివరకు దాదాపు 30,000 మంది సిబ్బందిని తొలగించిన అమెజాన్, అందులో భాగంగానే తాజాగా మరికొందరిని ఇంటికి పంపింది. భారత్, అమెరికా, బ్రిటన్ వ్యాప్తంగా ఉన్న కస్టమర్ సర్వీస్, సెల్లింగ్ పార్ట్నర్ విభాగాల ఉద్యోగులపై ఈ ప్రభావం పడింది.
పాండమిక్ హడావుడే కారణం: జెఫ్ బెజోస్
{{/usCountry}}మహమ్మారి సమయంలో ఆన్‌లైన్ ఆర్డర్లు భారీగా పెరగడంతో వేల సంఖ్యలో సిబ్బందిని నియామకం చేసుకున్నామని, తదనంతర పరిణామాల వల్ల కొలువుల కోత తప్పడం లేదని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.