First OTT: భారత్‌లో మొట్టమొదటి ఓటీటీ ఏదో తెలుసా? నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ కంటే ముందే హల్చల్- కానీ!
First OTT In India: నేడు స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు ఆహా, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5ల ఓటీటీల్లో సినిమాలు చూస్తున్నాం. అయితే భారత్‌లో మొట్టమొదటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ఎవరు ప్రారంభించారో, అది ఎందుకు ఇప్పుడు గుర్తులేదో తెలుసా? డిజిటల్ విప్లవానికి ముందే వచ్చిన ఆ ఆసక్తికరమైన కథనం ఇదిగో!
First OTT Platform In India: స్మార్ట్ టీవీ లేదా మొబైల్ స్క్రీన్ ఆన్ చేయగానే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా వంటి ఓటీటీల్లో నచ్చిన సినిమా ప్లే చేయడం మనకు ప్రతిరోజు పనిగా మారింది. థియేటర్లలో విడుదలైన కొన్ని వారాలకే తెలుగు సినిమాలు ఓటీటీ స్క్రీన్లపై ప్రత్యక్షమవుతున్నాయి.

1997లో అమెరికాలో డీవీడీల అద్దె వ్యాపారం
అయితే, భారత్‌లో అసలు ఓటీటీ విప్లవం ఎలా మొదలైంది? మన దేశంలో అడుగుపెట్టిన తొలి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏది? అనే ప్రశ్నలకు సమాధానం వెతికితే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తాయి. 1997లోనే అమెరికాలో డీవీడీల అద్దె వ్యాపారంతో నెట్‌ఫ్లిక్స్ తన ప్రయాణాన్ని ప్రారంభించగా, భారత్‌లో మాత్రం ఈ డిజిటల్ జోరు చాలా ఆలస్యంగా మొదలైంది.
2008లోనే రిలయన్స్ భారీ ప్రయోగం
ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ హవా నడుస్తున్న కాలంలో, భారతీయ డిజిటల్ మార్కెట్లో ఉన్న అవకాశాలను రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ముందుగానే గుర్తింది. 2008లో 'బిగ్ ఫ్లిక్స్' (BigFlix) పేరుతో మన దేశంలోనే మొట్టమొదటి ఓటీటీ వేదికను అందుబాటులోకి తెచ్చింది.
నెట్‌ఫ్లిక్స్ పేరును పోలి ఉన్నప్పటికీ, భారతీయ వీక్షకుల అభిరుచులకు తగినట్లుగా 'వీడియో ఆన్ డిమాండ్', 'మూవీ ఆన్ డిమాండ్' సేవలను అందించడం ప్రారంభించింది బిగ్ ఫ్లిక్స్. తెలుగు సహా తొమ్మిది భారతీయ భాషల్లో దాదాపు 2,000 పైగా హెచ్‌డీ సినిమాలను అందుబాటులో ఉంచారు.
కోట్లు వెచ్చించి ఓటీటీ హక్కులు
మన దేశంలోని వీక్షకులతో పాటు విదేశాల్లో ఉండే నివాస భారతీయులను (NRI) ఆకట్టుకోవడమే లక్ష్యంగా రిలయన్స్ ఈ సాహసానికి శ్రీకారం చుట్టింది. ధర్మా ప్రొడక్షన్స్, డిస్నీ, వియాకామ్18, రాజ్‌శ్రీ ప్రొడక్షన్స్ వంటి దిగ్గజ నిర్మాణ సంస్థలతో రూ.కోట్లు వెచ్చించి డిజిటల్ హక్కుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
ఆలోచన అద్భుతమే.. కానీ టైమింగ్ దెబ్బకొట్టింది!
బిగ్ ఫ్లిక్స్ తెచ్చిన ఐడియా ఎంతో వినూత్నమైనప్పటికీ, ఆ సమయానికి భారతీయ మార్కెట్ దానికి సిద్ధంగా లేదు. 2008 నుంచి 2012 మధ్యకాలంలో మనదేశంలో 2జీ, అరకొర 3జీ నెట్‌వర్క్‌లు మాత్రమే అందుబాటులో ఉండేవి. నేటిలాగా అపరిమిత డేటా ప్యాక్‌లు లేవు.
ఒక జీబీ డేటా కోసం వందల రూపాయలు వెచ్చించాల్సి వచ్చేది. ఇంటర్నెట్ వేగం ఎంత తక్కువగా ఉండేదంటే.. చిన్న వీడియో ప్లే కావడానికే నిమిషాల తరబడి బఫరింగ్ అయ్యేది. అలాంటి రోజుల్లో పూర్తిస్థాయి హెచ్‌డీ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ చేయడం ప్రేక్షకులకు పెద్ద నరకంగా మారేది.
సొంత కంటెంట్ లేకపోవడం
నెట్‌వర్క్ వేగం తక్కువగా ఉండటం, డేటా ఛార్జీలు ఆకాశాన్ని తాకడం బిగ్ ఫ్లిక్స్‌కు పెద్ద ప్రతిబంధకంగా మారింది. దీనికితోడు బిగ్ ఫ్లిక్స్ ఓటీటీలో సొంత కంటెంట్ (Originals) లేకపోవడం మరో లోపంగా పరిణమించింది. కేవలం పాత సినిమాల లైబ్రరీపై మాత్రమే ఆధారపడటంతో వినియోగదారులను ఎక్కువకాలం నిలబెట్టుకోలేకపోయింది.
పోటీ ప్రపంచం.. సరికొత్త వ్యూహం
2016 నాటికి వేగవంతమైన ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం, డేటా ధరలు అందుబాటులోకి రావడంతో భారత మార్కెట్ వైపు అంతర్జాతీయ దిగ్గజాలు కన్నేశారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలు భారత్‌లోకి నేరుగా అడుగుపెట్టాయి. ఆకర్షణీయమైన యూజర్ ఇంటర్‌ఫేస్, వేల కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఒరిజినల్ వెబ్ సిరీస్‌లతో వచ్చి పడ్డాయి.
ఆ పోటీని తట్టుకోవడం బిగ్ ఫ్లిక్స్‌కు సాధ్యపడలేదు. 2017లో నెలకు రూ.50 లభించే చౌకైన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌తో బిగ్ ఫ్లిక్స్‌ను కొత్త రూపంలో రీ-లాంచ్ చేసినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత జియో సినిమా వంటి ప్రయోగాలు చేసిన రిలయన్స్, చివరకు డిస్నీ+ హాట్‌స్టార్‌ను దక్కించుకుని నేడు జియోహాట్‌స్టార్‌గా దేశంలోనే అతిపెద్ద ఓటీటీ సామ్రాజ్యంగా అవతరించింది.
భారత్‌లో తొలి ఓటీటీగా
సరైన ఆలోచన ఉన్నప్పటికీ, సరైన సమయం కాకపోవడం వల్ల బిగ్ ఫ్లిక్స్ విఫలమైనప్పటికీ.. భారత డిజిటల్ వినోద రంగానికి పునాది వేసిన తొలి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా చరిత్రలో నిలిచిపోయింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


