...
...
Next Story

Hyundai Creta : నెక్ట్ జనరేషన్ హ్యుందాయ్ క్రెటా.. హైబ్రిడ్ ఇంజిన్​తో 2027లో గ్రాండ్ ఎంట్రీ!

భారత మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ క్రెటా సరికొత్త అవతారంలో ముస్తాబవుతోంది. ప్లియోస్ డిస్‌ప్లే, ఎలక్ట్రిక్ బాస్ మోడ్, గ్లోబల్ కే3 ప్లాట్‌ఫారమ్, స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజిన్ ప్రతిపాదనలతో 2027లో రాబోతున్న ఈ కారు వివరాలు ఇక్కడ పరిశీలించండి.

Published on: Nov 12, 2026, 05:34:36 IST
Advertisement

తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశవ్యాప్తంగానూ మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ క్రెటా సృష్టిస్తున్న రికార్డులు అన్నీ ఇన్నీ కావు. మార్కెట్లో మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, టయోటా హైరైడర్ వంటి మోడళ్ల నుంచి తీవ్ర పోటీ ఉన్నప్పటికీ, సేల్స్ చార్ట్‌లో క్రెటా దూసుకెళుతూ వస్తోంది. ఈ ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు హ్యుందాయ్ సంస్థ 'నెక్ట్స్ జనరేషన్ క్రెటా'ను సిద్ధం చేస్తోంది. ఇటీవల నిర్వహించిన రోడ్ టెస్టింగ్‌లో ఈ క్రెటా ఫేస్​లిఫ్ట్ కేబిన్, డిజైన్, సాంకేతికతకు సంబంధించిన కీలక అంశాలు వెలుగు చూశాయి.

హ్యుందాయ్ క్రెటా ఫేస్​లిఫ్ట్- కేబిన్..

2027లో నెక్ట్స్ జన్ హ్యుందాయ్ క్రెటా గ్రాండ్ ఎంట్రీ! (torqueculturee/Instagram)
2027లో నెక్ట్స్ జన్ హ్యుందాయ్ క్రెటా గ్రాండ్ ఎంట్రీ! (torqueculturee/Instagram)

కొత్త క్రెటా కేబిన్​లో అడుగుపెట్టగానే సరికొత్తగా రూపుదిద్దిన డాష్‌బోర్డ్ కన్నులవిందు చేస్తుంది. ఇందులో నిలువుగా అమర్చిన భారీ ‘ప్లియోస్’ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేతో పాటు స్లిమ్‌గా ఉండే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను జతచేశారు. పాత మోడల్ కంటే వేగంగా పనిచేసే అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌ను ఇందులో అందించనున్నారు. ఆఫ్‌వైట్, గ్రే రంగుల కాంబినేషన్‌తో కేబిన్ అంతటా ప్రీమియం లుక్ స్పష్టంగా కనిపిస్తోంది.

రైడర్ల సౌకర్యార్థం ఈ ఎస్​యూవీలో డ్రైవర్, ప్యాసింజర్ సీట్లకు ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్ వసతి ఇచ్చారు. ముఖ్యంగా వెనుక సీట్లో కూర్చునే ప్రయాణికుల కోసం 'ఎలక్ట్రిక్ బాస్ మోడ్' ఫీచర్‌ను చేర్చారు. దీని సహాయంతో వెనుక ఉన్నవారు ముందు సీటును బటన్ ద్వారా జరుపుకుని లెగ్‌రూమ్‌ను పెంచుకోవచ్చు. ఇప్పటికే క్రెటా ఈవీ, ఆల్కాజార్ కార్లలో ఉన్న ఈ సదుపాయాన్ని ఇప్పుడు నెక్ట్స్ జనరేషన్ క్రెటా మోడల్‌లోనూ ప్రామాణికంగా మారుస్తున్నారు. వెనుక వైపు కప్‌హోల్డర్లతో కూడిన సెంటర్ ఆర్మ్‌రెస్ట్, రియర్ ఏసీ వెంట్స్, వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయాలను అందించనున్నారు.

హ్యుందాయ్ క్రెటా ఫేస్​లిఫ్ట్- డిజైన్, లెవల్ 2 అడాస్..

ఈ సరికొత్త ఎస్‌యూవీని కియా సెల్టోస్ ఉపయోగిస్తున్న ‘గ్లోబల్ కే3’ ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేస్తున్నారు. దీనివల్ల కారు వెడల్పు, పొడవు పెరిగి లోపల ప్రయాణికులకు విశాలమైన స్థలం దక్కడంతో పాటు బూట్ స్పేస్ కూడా గణనీయంగా పెరుగుతుంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్లు హ్యుందాయ్ క్రెటా ఫేస్​లిఫ్ట్ మోడల్‌లోనూ కొనసాగుతాయి. వీటికి 6-స్పీడ్ మాన్యువల్, ఐవీటీ, 7-స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్‌లను అనుసంధానిస్తారు.

వీటితో పాటు మైలేజ్ ప్రియులను ఆకట్టుకునేందుకు ‘స్ట్రాంగ్-హైబ్రిడ్’ పవర్‌ట్రెయిన్‌ను కూడా ప్రవేశపెట్టే యోచనలో హ్యుందాయ్ ఉంది. ఈ నెక్ట్స్ జనరేషన్ క్రెటా 2027 నాటికి భారత రోడ్లపై పరుగులు తీసే అవకాశం ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks