Nissan Gravite : నిస్సాన్ గ్రావిటే లాంచ్ రేపే- 7 సీటర్ ఫ్యామిలీ ఎంపీవి హైలైట్స్ ఇవే..
మచ్ అవైటెడ్ నిస్సాన్ గ్రావిటే ఎంపీవీ లాంచ్‌కు రెడీ అయ్యింది. ఈ 7 సీటర్ కారును ఫిబ్రవరి 17న సంస్థ అధికారికంగా విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ ఫ్రెండ్లీ, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎంపీవీ గురించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన పట్టును పటిష్టం చేసుకునేందుకు నిస్సాన్ ఇండియా సిద్ధమైంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సరికొత్త 7-సీటర్ ఎంపీవీ ‘నిస్సాన్ గ్రావిటే’ని ఫిబ్రవరి 17న (మంగళవారం) సంస్థ అధికారికంగా విడుదల చేయనుంది. రెనాల్ట్-నిస్సాన్ పార్ట్నర్షిప్లో భాగంగా రూపొందించిన సీఎంఎఫ్-ఏ+ ప్లాట్‌ఫారమ్‌పై ఈ కారును తయారు చేసింది సంస్థ. ప్రాక్టికాలిటీ, సరసమైన ధరను కోరుకునే కుటుంబాల కోసం దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెనాల్ట్ ట్రైబర్‌కు ఇది గట్టి పోటీనివ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

నిస్సాన్ గ్రావిటే- డిజైన్, ఎక్స్‌టీరియర్..
నిస్సాన్ గ్రావిటే కారు చూడటానికి పొడవుగా, విశాలంగా ఉంటూ ఒక పర్‌ఫెక్ట్ ఎంపీవీ లుక్‌ను కలిగి ఉంటుంది.
ముందు భాగం: నిస్సాన్ లేటెస్ట్ డిజైన్ శైలిలో సీ-షేప్డ్ ఎల్‌ఈడీ లైటింగ్, బోల్డ్ గ్రిల్, ఆకర్షణీయమైన బంపర్‌తో వస్తోంది.
సైడ్ అండ్ రియర్: రూఫ్ రైల్స్, బాడీ క్లాడింగ్, అల్లాయ్ వీల్స్ దీనికి మోడరన్ లుక్‌ను ఇస్తాయి. వెనుక భాగంలో ర్యాప్ అరౌండ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, కొత్తగా డిజైన్ చేసిన బంపర్, స్కిడ్ ప్లేట్ దీనికి కొంత రగ్గడ్ లుక్‌ను జోడించాయి.
నిస్సాన్ గ్రావిటే- ఇంటీరియర్, స్పేస్..
కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా క్యాబిల్ లోపలి విషయంలో నిస్సాన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది.
సీటింగ్: ఈ నిస్సాన్ గ్రావిటే ఎంపీవీలో 7-సీటర్ సెటప్ ఉంటుంది. ఫ్లాట్ ఫ్లోర్ ఉండటం వల్ల కాలు పెట్టుకునే స్థలం మెరుగ్గా ఉంటుంది.
ఫ్లెక్సిబిలిటీ: రెండో వరుస సీట్లను రీక్లైన్ (వాల్చుకునే), స్లైడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. మూడో వరుస సీట్లను అవసరానికి తగ్గట్టుగా మడుచుకోవచ్చు, తద్వారా లగేజీ కోసం ఎక్కువ స్పేస్ లభిస్తుంది.
నిస్సాన్ గ్రావిటే- ఫీచర్లు, టెక్నాలజీ..
నేటి తరం కస్టమర్ల కోసం నిస్సాన్ ఇందులో అత్యాధునిక ఫీచర్లను జోడించింది:
- డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్.
- ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అన్ని వరుసలకు రేర్ ఏసీ వెంట్స్.
- టాప్ వేరియంట్లలో 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
నిస్సాన్ గ్రావిటే ఎంపీవీ- ఇంజిన్, పనితీరు..
నిస్సాన్ గ్రావిటే 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. ఇందులో రెండు ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి:
- నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్
- టర్బోచార్జ్డ్ పెట్రోల్
ట్రాన్స్‌మిషన్ విషయానికొస్తే 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉంటాయి. భవిష్యత్తులో కంపెనీ ఫిట్టెడ్ సీఎన్జీ వెర్షన్‌ను కూడా నిస్సాన్ పరిచయం చేసే అవకాశం ఉంది.
నిస్సాన్ గ్రావిటే ఎంపీవీ- ధర ఎంత ఉండొచ్చు?
మార్కెట్ అంచనాల ప్రకారం, నిస్సాన్ గ్రావైట్ ధర రూ. 6 లక్షల నుంచి రూ. 7 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ప్రారంభమై, టాప్ వేరియంట్లు రూ. 13-14 లక్షల వరకు ఉండవచ్చు.
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కొనే బడ్జెట్‌లో 7-సీటర్ కారు కావాలనుకునే వారికి ఈ నిస్సాన్ గ్రావిటే ఎంపీవీ ఒక గొప్ప ఆప్షన్ అవుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రశ్నలు- సమాధానాలు :-
ప్రశ్న- నిస్సాన్ గ్రావిటే ఎప్పుడు విడుదల కానుంది? దీని అంచనా ధర ఎంత?
సమాధానం- నిస్సాన్ గ్రావిటే ఫిబ్రవరి 17, 2026న విడుదల కానుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ. 6-7 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ఉండవచ్చని అంచనా.
ప్రశ్న- ఈ కారులో ఎన్ని సీట్ల అమరిక ఉంటుంది? ఇది కుటుంబాలకు సరిపోతుందా?
సమాధానం- ఇది పూర్తిస్థాయి 7-సీటర్ ఎంపీవీ. ఫ్లాట్ ఫ్లోర్, ఫోల్డబుల్ సీట్ల వల్ల ఇందులో స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాల ప్రయాణాలకు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
ప్రశ్న- నిస్సాన్ గ్రావిటే మైలేజీ, ఇంజిన్ వివరాలేంటి?
సమాధానం- ఇందులో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది టర్బో, నాన్-టర్బో ఆప్షన్లలో లభిస్తుంది. మైలేజీ వివరాలు లాంచ్ సమయంలో అధికారికంగా వెల్లడవుతాయి. భవిష్యత్తులో ఇందులో సీఎన్జీ వెర్షన్ వచ్చే అవకాశం కూడా ఉంది.
ప్రశ్న- ఇందులో ఎలాంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి?
సమాధానం- డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు టాప్ ఎండ్ వేరియంట్లలో 360-డిగ్రీ కెమెరా, సెన్సార్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


