7 seater cars : ఇండియాలోకి 5 కొత్త 7 సీటర్ కార్లు- పెద్ద కుటుంబాలకు పండగే!
పెద్ద కుటుంబాలకు పండగ లాంటి వార్త! రానున్న రోజుల్లో 5 కొత్త 7 సీటర్ కార్లు ఇండియాలో అందుబాటులోకి రానున్నాయి. ఇవి మార్కెట్లో హడావుడి చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ కార్ల వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
భారత ఆటోమొబైల్ మార్కెట్లో 7-సీటర్ కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెద్ద కుటుంబాల అవసరాలకు తగ్గట్టుగా, విలాసవంతమైన ఫీచర్లతో ఈ ఏడాది, అలాగే వచ్చే ఏడాది భారీగా కొత్త మోడళ్లు విడుదల కానున్నాయి. ఫోక్స్‌వ్యాగన్, ఎంజీ, నిస్సాన్, రెనాల్ట్ వంటి ప్రముఖ కంపెనీలు తమ కొత్త 7-సీటర్ ఎస్‌యూవీలను రంగంలోకి దించేందుకు సిద్ధమయ్యాయి. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాము..

ఇండియాలోకి 7 సీటర్ ఫ్యామిలీ కార్లు..
1. ఎంజీ మెజెస్టర్
ఎంజీ మోటార్స్ తన కొత్త లగ్జరీ ఎస్‌యూవీ 'మెజెస్టర్'ను తాజాగా ఆవిష్కరించింది. గ్లోస్టర్ మోడల్ కంటే ఇది ప్రీమియం వెర్షన్‌గా రాబోతోంది. వచ్చే నెలలో దీని ధరలను ప్రకటించి, ఏప్రిల్ నుంచి డెలివరీలు ప్రారంభించనున్నారు.
ఇంజిన్: ఇందులో 2.0 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 2డబ్ల్యూడీ, 4డబ్ల్యూడీ ఆప్షన్లలో లభిస్తుంది.
ఫీచర్లు: లెవల్ 2 అడాస్ సేఫ్టీ టెక్నాలజీ, ప్రీమియం ఇంటీరియర్ మరియు అదిరిపోయే ఎక్స్‌టీరియర్ లుక్‌తో ఇది వస్తోంది.
ఈ ఎంజీ మెజెస్టర్ భారీ ఎస్‌యూవీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
2. ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ ఆర్ లైన్
ఫోక్స్‌వ్యాగన్ నుంచి రాబోతున్న అత్యంత ఖరీదైన ఫ్లాగ్‌షిప్ మోడల్ ఈ టైరాన్ ఆర్ లైన్. ఇప్పటికే భారత్‌లో దీని అసెంబ్లింగ్ పనులు ప్రారంభమయ్యాయి. రాబోయే కొద్ది వారాల్లోనే ఇది మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.
ధర: సుమారు రూ. 45 - రూ. 50 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంది.
ప్రత్యేకతలు: ఇది గ్లోబల్ టైగన్ మోడల్‌పై ఆధారపడి రూపొందింది. ఇందులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 4-వీల్ డ్రైవ్ (4డబ్ల్యూడీ) సిస్టమ్ ఇందులో స్టాండర్డ్ ఫీచర్‌గా రానుంది.
3. నిస్సాన్ గ్రావిటే
రెనాల్ట్ ట్రైబర్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తయారైన నిస్సాన్ గ్రావిటే ఫిబ్రవరి 17, 2026 విడుదల కానుంది. భారత్‌లోనే తయారవుతున్న కారు కావడంతో దీని ధర చాలా కాంపిటీటివ్‌గా ఉండే అవకాశం ఉంది. అంతేకాదు ఇది ఇండియాలోనే చౌకైన 7 సీటర్ కార్లలో ఒకటిగా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి.
డిజైన్: ట్రైబర్‌తో పోలిస్తే దీని స్టైలింగ్ పూర్తిగా భిన్నంగా, స్టైలిష్‌గా ఉంటుంది.
ఇంజిన్: 1.0 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ మరియు టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో ఇది అందుబాటులోకి రానుంది.
ఈ నిస్సాన్ గ్రావిటేకి సంబంధించిన ఇతర వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
4. నిస్సాన్ టెక్టాన్ ఆధారిత 7-సీటర్
నిస్సాన్ నుంచి ఒక మిడ్-సైజ్ ఎస్‌యూవీ రాబోతోంది. దాని పేరు ‘టెక్టాన్’. ఇది కొత్త రెనాల్ట్ డస్టర్ ప్లాట్‌ఫారమ్‌ను పంచుకుంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీని 7-సీటర్ వెర్షన్ కూడా రాబోతోందని కంపెనీ ధృవీకరించింది. ఇంజిన్, ట్రాన్స్‌మిషన్, ఇతర ఫీచర్లు టెక్టాన్ మాదిరిగానే ఉన్నప్పటికీ, మరికొన్ని అదనపు ఫీచర్లను ఇందులో ఆశించవచ్చు.
5. కొత్త జనరేషన్ రెనాల్ట్ డస్టర్ 7-సీటర్
రెనాల్ట్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న కొత్త జనరేషన్ డస్టర్ ధరలను వచ్చే నెలలో ప్రకటించనున్నారు. ఏప్రిల్ 2026 నుంచి దీని డెలివరీలు మొదలవుతాయి. దీని ఆధారంగానే 7-సీటర్ వెర్షన్‌ను కూడా రెనాల్ట్ సిద్ధం చేస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న 'బోరియల్' అనే మోడల్ తరహాలో ఈ 7-సీటర్ ఉంటుంది. పూర్తిస్థాయిలో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దీన్ని రూపొందిస్తున్నారు. హైబ్రిడ్ వెర్షన్ ధరలను ఈ ఏడాది చివర్లో ప్రకటించే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


