7 seater cars : నెల రోజులు.. మూడు 7 సీటర్​ కార్లు! బడ్జెట్​ నుంచి లగ్జరీ వరకు..

భారతీయ రోడ్లపై ఫ్యామిలీ కార్ల సందడి పెరగనుంది. వచ్చే ఒక నెల వ్యవధిలో మూడు విభిన్న విభాగాలకు చెందిన 7-సీటర్ ఎంపీవీలు (MPV) లాంచ్ కానున్నాయి. బడ్జెట్ ధరలో నిస్సాన్ గ్రావిటీ, లగ్జరీ సెగ్మెంట్‌లో మెర్సిడెస్ వి-క్లాస్, మరియు ఎలక్ట్రిక్ విభాగంలో విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ కారు ప్రియులను అలరించనున్నాయి.

Published on: Feb 10, 2026 9:10 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వచ్చే కొన్ని వారాల్లో సరికొత్త ఎంపీవీ మోడళ్లతో భారత ఆటోమొబైల్ మార్కెట్ కళకళలాడనుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరి అవసరాలకు తగ్గట్టుగా విభిన్న శ్రేణిలో ఈ కార్లు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి- మార్చ్​ మధ్య లాంచ్ కానున్న ఆ 3 కార్ల పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

విన్​ఫాస్ట్ లిమో గ్రీన్..
విన్​ఫాస్ట్ లిమో గ్రీన్..

మూడు కొత్త 7 సీటర్​ కార్లు ఇవే- ఫ్యామిలీకి బెస్ట్​ ఛాయిస్​!

1. నిస్సాన్ గ్రావిటే

నిస్సాన్ ఇండియా తన కొత్త బడ్జెట్​ ఫ్రెండ్లీ 7-సీటర్ ఎంపీవీ గ్రావిటేని ఫిబ్రవరి 17, 2026న ఆవిష్కరించనుంది. ఇది ఇప్పటికే మార్కెట్​లో పాపులర్ అయిన రెనాల్ట్ ట్రైబర్‌కు సమానమైన ప్లాట్‌ఫామ్‌పై వస్తోంది.

లుక్ అండ్​ డిజైన్: ట్రైబర్ బాడీని పోలి ఉన్నప్పటికీ, నిస్సాన్ తనదైన 'వీ-మోషన్' ఫ్రంట్ గ్రిల్, కొత్త స్టైలిష్ హెడ్‌ల్యాంప్స్, స్పోర్టీ బంపర్‌తో దీనికి సరికొత్త రూపం ఇచ్చింది.

ఫీచర్లు: లోపల ఆల్-బ్లాక్ ఇంటీరియర్‌తో పాటు డోర్ల వద్ద బేజ్ కలర్ టచ్ ఇచ్చారు. 3-స్పోక్ స్టీరింగ్, అవసరమైనప్పుడు తీసివేయగలిగే మూడొవ వరుస సీట్లు దీని ప్రత్యేకత.

ఇంజిన్: ఇందులో 72 బీహెచ్​పీ పవర్ ఇచ్చే 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ (ఏఎంటీ) గేర్‌బాక్స్‌లతో లభిస్తుంది.

నిస్సాన్​ గ్రావిటేకి సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

2. మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్

విలాసవంతమైన ప్రయాణాన్ని కోరుకునే వారి కోసం మెర్సిడెస్ బెంజ్ తన వీ-క్లాస్ ఎంపీవీని సరికొత్త హంగులతో మార్చ్​ 3, 2026న లాంచ్ చేస్తోంది.

లగ్జరీ ఫీచర్లు: దీని క్యాబిన్‌లో రెండు పెద్ద డిజిటల్ డిస్​ప్లేలు (టచ్‌స్క్రీన్, డ్రైవర్ డిస్​ప్లే) ఉంటాయి. లోపల విశాలమైన స్థలం, ప్రీమియం సీట్లతో ఇది 'రోడ్లపై నడిచే విమానం'లా ఉంటుంది.

పర్ఫార్మెన్స్: ఇందులో 2.0 లీటర్, 4-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 158 బీహెచ్​పీ పవర్, 380 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ధర: ఇది టయోటా వెల్‌ఫైర్‌కు పోటీగా వస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.10 కోట్ల నుంచి రూ. 1.25 కోట్ల మధ్య ఉండవచ్చని అంచనా.

3. విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్

వియత్నాంకు చెందిన ఈవీ దిగ్గజం విన్‌ఫాస్ట్, భారత్‌లో తన మూడొవ మోడల్‌గా లిమో గ్రీన్ ఎలక్ట్రిక్ ఎంపీవీని ఫిబ్రవరి-మార్చ్​ మధ్యలో విడుదల చేయనుంది.

పవర్ అండ్​ రేంజ్: 60.13 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే ఈ కారు, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450 కి.మీ మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

ఛార్జింగ్: 80 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 30 నిమిషాల్లో 10 నుంచి 70 శాతం వరకు ఛార్జింగ్ పూర్తవుతుంది.

ఈ ఎలక్ట్రిక్​ ఎంపీవీ నేరుగా కియా క్యారెన్స్ ఈవీకి గట్టి పోటీనిచ్చేలా, చాలా తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది.

విన్​ఫాస్ట్​ లిమో గ్రీన్​ ఈవీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.