MG Majestor : ఎంజీ మెజెస్టర్ బుకింగ్స్ షురూ- బడా ఎస్‌యూవీలోని టాప్ 5 హైలైట్స్ ఇవే..
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన ఫ్లాగ్‌షిప్ ఎస్యూవీ 'మెజెస్టర్'ని భారత్‌లో ఆవిష్కరించింది. ఎంజీ గ్లోస్టర్ పైన ఉండబోయే ఈ బడా ఎస్యూవీ బుకింగ్స్ రూ. 41,000తో ప్రారంభమయ్యాయి. 2.0 లీటర్ ట్విన్-టర్బో ఇంజన్, అదిరిపోయే ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలతో వచ్చిన ఈ ఎస్యూవీ విశేషాలు ఇక్కడ తెలుసుకోండి..
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన లైనప్‌లోకి సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది. అదే ‘ఎంజీ మెజెస్టర్’. ఇప్పటికే ఉన్న గ్లోస్టర్ కంటే ఇది మరింత శక్తివంతమైనది, విలాసవంతమైనది! ఈ కొత్త ఎస్యూవీ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. రూ. 41వేల టోకెన్ అమౌంట్‌తో సంస్థకు చెందిన అధికారిక వెబ్సైట్లో దీనిని బుక్ చేసుకోవచ్చు.

హెక్టార్, హెక్టార్ ప్లస్, ఆస్టర్, గ్లోస్టర్ తర్వాత కంపెనీ నుంచి వస్తున్న ఐదొవ పెట్రోల్/డీజిల్ (ఐసీఈ) ఎస్యూవీ ఇది. ఈ నేపథ్యంలో ఈ ఎంజీ మెజెస్టర్ గురించి మీరు తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలను ఇక్కడ చూసేయండి..
ఎంజీ మెజెస్టర్- ఈ బడా ఎస్యూవీ టాప్ 5 హైలైట్స్..
1. ట్విన్-టర్బో పవర్.. 4డబ్ల్యూడీ సత్తా-
ఈ ఎస్‌యూవీలో 2.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ ఉంది. ఇది 215 బీహెచ్పీ పవర్‌ని, 478 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేశారు.
ఆఫ్‌రోడింగ్: ఇందులో 4డబ్ల్యూడీ సామర్థ్యంతో పాటు సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా 'ట్రిపుల్ డిఫరెన్షియల్ లాక్' ఫీచర్‌ను అందించారు.
మోడ్స్: సాండ్, రాక్, మడ్, స్నో వంటి మల్టిపుల్ టెర్రైన్ మోడ్స్ ఉన్నాయి. ఇది 810 ఎంఎం లోతు నీటిలో కూడా సులభంగా ప్రయాణించగలదు.
2. రాజసం ఉట్టిపడే డిజైన్-
ఈ ఎంజీ మెజెస్టర్ ఎస్యూవీ చూడటానికి చాలా భారీగా, బాక్సీ ఆకృతిలో కనిపిస్తుంది.
లైటింగ్: 'డ్రాగన్ ఐ' ఎల్ఈడీ డీఆర్ఎల్స్, నిలువుగా ఉండే ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ దీనికి కొత్త లుక్ ఇచ్చాయి.
లుక్స్: 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, వెనుక వైపు కనెక్ట్ చేసిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, ప్రముఖంగా కనిపించే 'మోర్రిస్ గ్యారేజ్' బ్రాండింగ్‌తో ఇది అదిరిపోయే రోడ్ ప్రజెన్స్‌ను కలిగి ఉంది.
3. విలాసవంతమైన ఇంటీరియర్ (6 అండ్ 7 సీటర్)-
ఈ కారు క్యాబిన్ ఎంతో ప్రీమియంగా ఉంటుంది. స్మోక్డ్ ఎబోనీ థీమ్, లెదర్ అప్హోలిస్టరీ దీనికి లగ్జరీ లుక్ ఇచ్చాయి.
మసాజ్ సీట్లు: ఇందులో 8 రకాల ప్యాటర్న్స్ ఉన్న మల్టీ-మోడ్ మసాజ్ సీట్లు ఉన్నాయి.
టెక్నాలజీ: 12.3- ఇంచ్ టచ్‌స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, 12-స్పీకర్ల జేబీఎల్ ఆడియో సిస్టమ్, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
4. జియో కనెక్టెడ్ టెక్నాలజీ
రిలయన్స్ జియో భాగస్వామ్యంతో ఐ-స్మార్ట్ కనెక్టెడ్ కార్ ఫీచర్లను మెరుగుపరిచారు.
వాలెట్ మోడ్: డ్రైవర్ కార్‌ను పార్క్ చేసేటప్పుడు వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరుస్తుంది.
క్వైట్ మోడ్: ప్రయాణికుల సౌకర్యం కోసం కొన్ని జోన్లలో ఆడియోను తగ్గిస్తుంది.
వీటితో పాటు బ్లూటూత్ డిజిటల్ కీ కూడా అందుబాటులో ఉంది.
5. సేఫ్టీలో 'లెవల్ 2 అడాస్'-
ఎంజీ మెజెస్టర్ని ధృడమైన 'లాడర్-ఫ్రేమ్' ఛాసిస్‌పై నిర్మించారు.
భద్రత: ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, హిల్-హోల్డ్ కంట్రోల్ ఉన్నాయి.
అడాస్: లెవల్ 2 అడాస్ ప్యాకేజీలో భాగంగా.. లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు లభిస్తాయి.
మరి మీరు ఈ ఎస్‌యూవీని కొంటున్నారా?

E-Paper












