స్టాక్ మార్కెట్‌లో ఇప్పుడు లాభాలు రాకపోయినా పర్వాలేదు కానీ, ఉన్న డబ్బు పోగొట్టుకోకుండా 'సర్వైవ్' అవ్వడం ముఖ్యమని ట్రేడర్లకు సూచించారు జెరోధా (Zerodha) బాస్ నితిన్ కామత్. అంతర్జాతీయ మార్కెట్లు ప్రస్తుతం అత్యంత అస్థిరంగా ఉన్నాయని, కేవలం వార్తల ఆధారంగానే భారీ ఒడిదుడుకులు లోనవుతున్నాయని ఆయన విశ్లేషించారు. ఈ మేరకు ఆయన లింక్డ్‌ఇన్ (LinkedIn) వేదికగా ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు.
ఒకరి కనుసన్నల్లోనే గ్లోబల్ మార్కెట్లు
ప్రస్తుత మార్కెట్ పరిస్థితిపై కామత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మనం విచిత్రమైన కాలంలో ఉన్నాం. ప్రపంచ ఆర్థిక మార్కెట్లన్నీ ఇప్పుడు ఒకే ఒక్క వ్యక్తి ఇష్టాఇష్టాల మీద ఆధారపడి నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ వ్యక్తి ఏ మూడ్‌లో నిద్రలేచి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే అంశమే మార్కెట్లను శాసిస్తోంది" అని ఆయన పేర్కొన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (Geopolitics), కీలక పాలసీ నిర్ణయాలు వెలువడుతున్న తరుణంలో మార్కెట్లు ఎప్పుడు ఎటు మలుపు తిరుగుతాయో ఊహించడం నిపుణులకు కూడా కష్టతరంగా మారింది.
ట్రేడర్లు ఏం చేయాలి? కామత్ చిట్కాలు ఇవే:
ఇలాంటి అనిశ్చితి సమయంలో గెలుపు గుర్రాన్ని పట్టుకోవడం కంటే, రేసులో నిలబడటం ముఖ్యమని ఆయన వివరించారు. ట్రేడర్లు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలను ఆయన సూచించారు:
- రిస్క్ తగ్గించుకోండి: మీ ట్రేడింగ్ పరిమాణాన్ని (Trade Size) భారీగా తగ్గించండి. ఎక్కువ పెట్టుబడితో రిస్క్ తీసుకోవద్దు.
- ఓవర్‌నైట్ పొజిషన్లు వద్దు: మార్కెట్ ముగిసిన తర్వాత వచ్చే వార్తల ప్రభావం మరుసటి రోజు భారీగా ఉంటుంది. అందుకే పొజిషన్లను తదుపరి రోజుకు క్యారీ ఫార్వార్డ్ చేయకపోవడమే మంచిది.
- అవకాశం కోసం వేచి చూడండి: మార్కెట్ ఒక స్థిరమైన దిశను పట్టుకునే వరకు వేచి ఉండాలి. అనవసరంగా దూకుడు ప్రదర్శించి చేతులు కాల్చుకోవద్దు.
వరుస సెలవుల సెటప్.. మరింత రిస్క్
వచ్చే ఏడు రోజుల్లో మూడు సెలవులు రావడం కూడా ట్రేడర్లకు సవాలుగా మారుతుందని నితిన్ కామత్ గుర్తు చేశారు. మార్కెట్ సెలవులో ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏదైనా కీలక పరిణామం జరిగితే, తిరిగి మార్కెట్ తెరుచుకునేసరికి భారీ గ్యాప్-అప్ లేదా గ్యాప్-డౌన్ అయ్యే ప్రమాదం ఉంది.
మానసిక ప్రశాంతత ముఖ్యం
{{/usCountry}}వచ్చే ఏడు రోజుల్లో మూడు సెలవులు రావడం కూడా ట్రేడర్లకు సవాలుగా మారుతుందని నితిన్ కామత్ గుర్తు చేశారు. మార్కెట్ సెలవులో ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏదైనా కీలక పరిణామం జరిగితే, తిరిగి మార్కెట్ తెరుచుకునేసరికి భారీ గ్యాప్-అప్ లేదా గ్యాప్-డౌన్ అయ్యే ప్రమాదం ఉంది.
మానసిక ప్రశాంతత ముఖ్యం
{{/usCountry}}ట్రేడింగ్ అనేది నిరంతరం ఒత్తిడితో కూడుకున్న పని అని, లాభనష్టాల లెక్కలు మనిషిని మానసికంగా కుంగదీస్తాయని కామత్ అన్నారు. "ట్రేడింగ్ అనేది ప్రాథమికంగా ఒక ఒంటరి పోరాటం. నిరంతరం స్క్రీన్ల వైపు చూస్తూ గడిపితే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఈ లాంగ్ వీకెండ్ సమయంలో ట్రేడింగ్‌కు కాస్త విరామం ఇచ్చి, రీఛార్జ్ అవ్వడం మంచిది" అని ఆయన హితవు పలికారు.
స్టాక్ మార్కెట్ సెలవుల వివరాలు:
భారతీయ స్టాక్ మార్కెట్లు (BSE, NSE) రానున్న రోజుల్లో ఈ క్రింది తేదీల్లో మూతపడనున్నాయి:
- మార్చి 26 (గురువారం): శ్రీరామ నవమి సందర్భంగా సెలవు.
- మార్చి 31 (మంగళవారం): మహావీర్ జయంతి సందర్భంగా సెలవు.
- ఏప్రిల్ 3 (శుక్రవారం): గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్కెట్లకు సెలవు.
సెలవుల కారణంగా ట్రేడింగ్ సెషన్లు తక్కువగా ఉన్నప్పుడు మార్కెట్‌లో వోలటాలిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నితిన్ కామత్ సందేశం సారాంశం.
(గమనిక: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.)