...
...
Next Story

రైల్వేలో 4,651 అప్రెంటిస్ ఉద్యోగాలు.. టెన్త్, ఐటీఐ అర్హతతో దరఖాస్తు చేసుకోండి

ఉత్తర రైల్వే (RRC NR) భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. 4,651 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. దరఖాస్తు విధానం, అర్హతలు, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు ఇవే.

Published on: Nov 9, 2026, 15:38:47 IST
Advertisement

రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకునే యువతకు ఉత్తర రైల్వే (Northern Railway) గొప్ప అవకాశం కల్పించింది. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ - నార్తర్న్ రీజియన్ (RRC NR) వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి సంబంధించి ప్రకటన విడుదల చేసింది. మొత్తం 4,651 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆర్‌ఆర్‌సీ ఎన్‌ఆర్ అధికారిక వెబ్‌సైట్ rrcnr.org ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

కీలక తేదీలు

రైల్వేలో 4,651 అప్రెంటిస్ ఉద్యోగాలు.. టెన్త్, ఐటీఐ అర్హతతో దరఖాస్తు చేసుకోండి
రైల్వేలో 4,651 అప్రెంటిస్ ఉద్యోగాలు.. టెన్త్, ఐటీఐ అర్హతతో దరఖాస్తు చేసుకోండి

ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తులు 2026 నవంబర్ 11న ప్రారంభమవుతాయి. దరఖాస్తు సమర్పించడానికి 2026 డిసెంబర్ 11 వరకు గడువు ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ జాబితాను 2027 ఫిబ్రవరి నెలలో విడుదల చేసే అవకాశముంది.

విద్యార్హతలు

అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి (ఎస్సెస్సీ/మెట్రిక్యులేషన్) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

దీనితో పాటు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల (NCVT/SCVT) గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (ITI) కోర్సు పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి

2026 డిసెంబర్ 11 నాటికి అభ్యర్థుల వయస్సు 15 ఏళ్లు నిండి ఉండాలి. 24 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో మినహాయింపులు వర్తిస్తాయి.

ఎంపిక ప్రక్రియ

ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు. 10వ తరగతిలో సాధించిన మార్కులు, ఐటీఐ పరీక్షలో వచ్చిన మార్కులకు సమాన ప్రాధాన్యం (50:50 నిష్పత్తి) ఇస్తూ అభ్యర్థుల సగటు మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. క్లస్టర్, ట్రేడ్, సామాజిక వర్గాల వారీగా ఈ మెరిట్ ఆధారంగానే తుది అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు రుసుము

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks