భారత స్టాక్ మార్కెట్ ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌కి ఇంకా రెండు రోజుల సమయమే మిగిలింది! క్యాష్ మార్కెట్, ఈక్విటీ డెరివేటివ్స్ విభాగాల్లో అత్యధిక ట్రేడింగ్ వాల్యూమ్‌తో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్.. రూ. 22,568.94 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంగా మార్కెట్లోకి అడుగుపెడుతోంది.

భారత కార్పొరేట్ చరిత్రలోనే రెండో అతిపెద్ద పబ్లిక్ ఇష్టూగా నిలవనున్న ఈ ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత? ఐపీఓకి అప్లై చేయాలా? వద్దా? వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ- ప్రైజ్ బ్యాండ్, డేట్స్ వివరాలు..
ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ సెప్టెంబర్ 17 (గురువారం) సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుచుకోనుండగా, సెప్టెంబర్ 21 (సోమవారం) నాటితో గడువు ముగుస్తుంది. షేర్ల కేటాయింపు (అలాట్మెంట్) ప్రక్రియ సెప్టెంబర్ 22న, స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 24న పూర్తయ్యే అవకాశాలున్నాయి.
షేరు ధరల శ్రేణిని రూ. 1,700 నుంచి రూ. 1,785గా నిర్ణయించారు. లాట్ పరిమాణం 8 షేర్లుగా ఉంది. గరిష్ఠ ధర ప్రాతిపదికన రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కోసం కనిష్ఠంగా రూ. 14,280 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో రానుంది. ప్రస్తుత వాటాదారులు తమ వద్ద ఉన్న 12.64 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నారు. కొత్తగా షేర్ల జారీ లేకపోవడం వల్ల ఈ ఐపీఓ ద్వారా వచ్చే నిధులు కంపెనీకి వెళ్లవు. గరిష్ఠ ధర వద్ద ఎన్‌ఎస్‌ఈ మార్కెట్ విలువ రూ. 4.41 లక్షల కోట్లను దాటుతుంది.
విచిత్రమైన అంశం ఏంటంటే.. స్వయం నియంత్రణ నిబంధనల ప్రకారం ఎన్‌ఎస్‌ఈ తన సొంత ప్లాట్‌ఫామ్‌పై లిస్ట్ అవ్వడానికి వీల్లేదు. అందువల్ల ఎన్‌ఎస్‌ఈ షేర్లు దాని ఏకైక ప్రత్యర్థి సంస్థ అయిన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)లోనే లిస్ట్ అవుతుంది.
ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకుగ్రే మార్కెట్లో భారీ డిమాండ్!
{{/usCountry}}విచిత్రమైన అంశం ఏంటంటే.. స్వయం నియంత్రణ నిబంధనల ప్రకారం ఎన్‌ఎస్‌ఈ తన సొంత ప్లాట్‌ఫామ్‌పై లిస్ట్ అవ్వడానికి వీల్లేదు. అందువల్ల ఎన్‌ఎస్‌ఈ షేర్లు దాని ఏకైక ప్రత్యర్థి సంస్థ అయిన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)లోనే లిస్ట్ అవుతుంది.
ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకుగ్రే మార్కెట్లో భారీ డిమాండ్!
{{/usCountry}}అన్-లిస్టెడ్ మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ షేర్లకు విపరీతమైన క్రేజ్ కనిపిస్తోంది. గ్రే మార్కెట్ ప్రీమియం (జీపీఎం) ప్రస్తుతం రూ. 208 వద్ద కొనసాగుతోంది. దీని ప్రకారం అన్-లిస్టెడ్ మార్కెట్‌లో ఒక్కో షేరు రూ. 1,993 వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే ఐపీఓ గరిష్ఠ ధర రూ. 1,785తో పోలిస్తే ఇన్వెస్టర్లకు మొదటి రోజే సుమారు 11.65 శాతం వరకు లిస్టింగ్ లాభాలు వచ్చే అవకాశముంది.
అయితే కేవలం జీఎంపీని చూసే ఐపీఓకు అప్లై చేయవద్దని నిపుణులు చెబుతున్నారు. గ్రే మార్కెట్ ప్రీమియం అనేది ఎప్పటికప్పుడు మారుతుందని అంటున్నారు. అందుకే కంపెనీ ఆర్థిక పరిస్థితులు తెలుసుకోవడం చాలా ముఖ్యం అని స్పష్టం చేస్తున్నారు.
ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ- అద్భుతమైన ఆర్థిక ప్రదర్శన!
భారత క్యాపిటల్ మార్కెట్లో ఎన్‌ఎస్‌ఈ దాదాపు ఏకఛత్రాధిపత్యం సాగిస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో క్యాష్ ఈక్విటీ విభాగంలో 92.99 శాతం, ఈక్విటీ ఫ్యూచర్స్‌లో 99.79 శాతం, ఈక్విటీ ఆప్షన్స్‌లో 74.71 శాతం మార్కెట్ వాటాను ఎన్‌ఎస్‌ఈ కలిగి ఉంది.
ఆర్థికంగా చూస్తే, 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ. 16,601.31 కోట్లకు చేరగా, నికర లాభం రూ. 10,302.06 కోట్లుగా నమోదైంది. ఆపరేటింగ్ మార్జిన్ 66.85 శాతంగా, రిటర్న్ ఆన్ ఈక్విటీ 32.98 శాతంగా ఉన్నాయి. కంపెనీకి రూపాయి కూడా అప్పు లేకపోవడం, భారీ కార్పస్ నిధులు కలిగి ఉండడం పెద్ద బలం. 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనూ ఆదాయం 13.10 శాతం వృద్ధి చెందింది.
ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకి అప్లై చేయాలా? వద్దా?
ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంపై ఎక్కువగా ఆధారపడడం, ఆప్షన్స్ ట్రేడింగ్‌పై సెబీ విధిస్తున్న కొత్త నిబంధనలు, పన్నుల పెంపు కొంతవరకు ప్రతికూల అంశాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయినప్పటికీ సుదీర్ఘ కాలానికి ఇది మంచి పెట్టుబడి అని చెబుతున్నారు.
"గరిష్ఠ ధర రూ. 1,785 వద్ద ఎన్‌ఎస్‌ఈ పీఈ నిష్పత్తి 42.89 రెట్లుగా ఉంది. మార్కెట్లో కంపెనీకున్న బలమైన స్థానం, అద్భుతమైన లాభదాయకత, రుణాలు లేని బ్యాలెన్స్ షీట్ దృష్ట్యా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఈ ఐపీఓను సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు," అని శామ్‌కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ అసిస్టెంట్ రాజ్ గైకర్ పేర్కొన్నారు.
"భారత మార్కెట్ల అభివృద్ధిలో ఎన్‌ఎస్‌ఈ పాత్ర అత్యంత కీలకమైనది. బీఎస్‌ఈతో పోలిస్తే ఎన్‌ఎస్‌ఈ వ్యాల్యుయేషన్ సమంజసంగానే ఉంది. లిస్టింగ్ లాభాలతో పాటు దీర్ఘకాలిక పోర్ట్‌ఫోలియో కోసం ఈ ఐపీఓలో దరఖాస్తు చేయవచ్చు," అని సుశీల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణుడు స్వప్నీల్ అభిప్రాయపడ్డారు.