Jensen Huang : ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురితో జెన్సన్ హువాంగ్ 'అఫైర్'!
వివాహేతర సంబంధాల వివాదంతో ప్రపంచ ఏఐ దిగ్గజం ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ తన పదవికి రాజీనామా చేసిన కొన్ని గంటలకే మరో సంచలన వార్త బయటకు వచ్చింది. ఇప్పటికే ఇద్దరితో సంబంధాలు బయటపడగా, తాజాగా మరో ఉద్యోగినితోనూ ఆయనకు సన్నిహిత సంబంధం ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
ప్రపంచ కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగాన్ని శాసిస్తున్న టెక్ దిగ్గజం ఎన్విడియా చరిత్రలో పెను కుదుపు సంభవించింది. వ్యక్తిగత జీవితంలోని వివాహేతర సంబంధాల ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరైన సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జెన్సన్ హువాంగ్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన నిష్క్రమణతో కంపెనీ ప్రతిష్ఠకు తీవ్ర భంగం వాటిల్లిన నేపథ్యంలో, ప్రస్తుత చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) కొలెట్ క్రెస్‌ను తాత్కాలిక సీఈఓగా బోర్డు నియమించింది. అయితే హువాంగ్ రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే ఆయనపై మరో సంచలన ఆరోపణ వెలుగులోకి వచ్చింది!
రెండు కాదు మూడు.. రాయిటర్స్ కథనంతో కలకలం!
జెన్సన్ హువాంగ్‌కు సంస్థలోనే పనిచేస్తున్న మరో ఉద్యోగినితో సన్నిహిత సంబంధం ఉందని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ గురువారం సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను ఉటంకిస్తూ రాయిటర్స్ ఈ వివరాలను బయటపెట్టింది. దీనితో హువాంగ్‌పై వచ్చిన వివాహేతర సంబంధాల ఆరోపణల సంఖ్య మూడుకు చేరింది! తాజాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఉద్యోగిని పేరు, హోదా వివరాలను రాయిటర్స్ వెల్లడించలేదు. ఈ కొత్త ఆరోపణలపై ఎన్విడియా యాజమాన్యం కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
చైనాకు గూఢచర్యం చేస్తోందని అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్న వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్‌తో తనకు సంబంధం ఉన్నట్లు జెన్సన్ హువాంగ్ ఇటీవలే అంగీకరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మంగళవారం నాడు 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' మరో విషయాన్ని బయటపెట్టింది. ఎన్విడియా హెల్త్‌కేర్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న ఉన్నతోద్యోగి కింబర్లీ పావెల్‌తోనూ హువాంగ్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పుడు మూడో వ్యక్తి వ్యవహారం తెరపైకి రావడంతో వివాదం మరింత ముదిరింది.
గూఢచర్యం ఊసెత్తని బోర్డు.. కొలెట్ క్రెస్‌కు బాధ్యతలు
కంపెనీ ప్రతిష్ఠ దెబ్బతింటున్న తరుణంలో హువాంగ్ సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు ఎన్విడియా గురువారం అధికారికంగా ప్రకటించింది. శాశ్వత ప్రాతిపదికన కొత్త సీఈఓను ఎంపిక చేసే వరకు సీఎఫ్‌ఓ కొలెట్ క్రెస్‌ను ఎన్విడియా తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తారని తెలిపింది. అయితే బోర్డు విడుదల చేసిన ప్రకటనలో అమెరికా నిఘా సంస్థల దర్యాప్తు గురించి గానీ, చైనా గూఢచర్యం వివాదం గురించి గానీ ఎక్కడా ప్రస్తావించలేదు. జెన్సన్ నిష్క్రమణకు అధికారిక కారణాలను కూడా వెల్లడించలేదు. పైగా సంస్థ అభివృద్ధికి హువాంగ్ అందించిన విశేష సేవలను బోర్డు కొనియాడింది.
"ఎన్విడియా ప్రెసిడెంట్, సీఈఓ, డైరెక్టర్ల బోర్డు సభ్యుడి పదవులకు జెన్సన్ హువాంగ్ రాజీనామా చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది. ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీఎఫ్‌ఓ కొలెట్ క్రెస్ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించారు," అని ఎన్విడియా బోర్డు తన ప్రకటనలో పేర్కొంది.
108 మిలియన్ డాలర్లు ఉఫ్!
పదవి నుంచి వైదొలగడం వల్ల జెన్సన్ హువాంగ్ భారీ ఆర్థిక మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. కంపెనీ ఈక్విటీ ప్రోత్సాహక పథకం ద్వారా ఏళ్ల తరబడి సమకూర్చుకున్న 3,10,000 అన్‌వెస్టెడ్ షేర్లను (ఇంకా పూర్తి హక్కులు రాని షేర్లు) ఆయన కోల్పోనున్నారు. వీటి విలువ సుమారు 108 మిలియన్ డాలర్లు ఉంటుంది.
ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం, ఈ షేర్లను వదులుకున్న తర్వాత 63 ఏళ్ల జెన్సన్ హువాంగ్ నికర ఆస్తుల విలువ 144 బిలియన్ డాలర్లుగా ఉండనుంది. ఆయన కోల్పోతున్న 108 మిలియన్ డాలర్లు ఆయన మొత్తం సంపదలో చాలా చిన్న భాగం మాత్రమే. సీఈఓగా హువాంగ్ ఏటా నగదు రూపంలో సుమారు 7.5 మిలియన్ డాలర్ల వేతనం అందుకునేవారు. ఆయన సంపదలో సింహభాగం ఎన్విడియా షేర్ల రూపంలోనే ఉంది.
మరోవైపు, వివాహేతర సంబంధాల వివాదం చుట్టుముట్టిన నేపథ్యంలో హువాంగ్ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. తన తరఫున వాదించేందుకు ప్రముఖ న్యాయ సంస్థ 'పాల్ వీస్' సేవలను ఆయన తీసుకున్నట్లు 'ది న్యూయార్క్ టైమ్స్' వెల్లడించింది. ఆ సంస్థకు చెందిన న్యాయవాదులు మెలిండా హాగ్, వాల్టర్ బ్రౌన్ ఈ కేసులో హువాంగ్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
'టిమ్ కుక్.. ఎన్విడియా సీఈఓ అవ్వాలి'
మరోవైపు ఎన్విడియా ద్వారా జెన్సన్ హువాంగ్ అందించిన సేవలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు. జెన్సన్ని లెజెండ్‌గా అభివర్ణించారు. అదే సమయంలో.. యాపిల్ సంస్థ మాజీ సీఈఓ టిమ్ కుక్.. ఎన్విడియా సీఈఓ అవ్వాలని అభిప్రాయపడ్డారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


