...
...
Next Story

ఓల్డ్ మాంక్ వివాదం: చట్టపరంగా ‘రమ్’ లేదా ‘విస్కీ’ అని దేనిని పిలవవచ్చో తెలుసా?

తప్పుదోవ పట్టించే లేబులింగ్‌ను ఉపయోగిస్తున్నాయనే కారణంతో 'ఓల్డ్ మాంక్' (Old Monk) కి చెందిన మూడు ప్రముఖ వెరైటీలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో అసలు చట్టబద్ధంగా రమ్, విస్కీలను ఎలా నిర్వచిస్తారు? తయారీ నిబంధనలు ఏం చెబుతున్నాయి? తెలుసుకుందాం.

Published on: Aug 6, 2026, 09:14:39 IST
Advertisement

ఓల్డ్ మాంక్‌కు చెందిన 'ది లెజెండ్' (The Legend), 'గోల్డ్ రిజర్వ్' (Gold Reserve), 'XXX మెచ్యూర్డ్ రమ్' (XXX Matured Rum) ఉత్పత్తులపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిషేధం విధించడంతో మద్యం తయారీ రంగంలో పెద్ద చర్చ నడుస్తోంది. కొన్ని రకాల బ్రాండ్లు 'న్యూట్రల్ స్పిరిట్' (సొంత రుచి లేని రసాయన ఆల్కహాల్) కు కృత్రిమంగా రమ్ లేదా విస్కీ ఫ్లేవర్లను కలిపి ప్రామాణిక ఉత్పత్తులుగా అమ్ముతున్నట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలింది.

ఓల్డ్ మాంక్ వివాదం: చట్టపరంగా ‘రమ్’ లేదా ‘విస్కీ’ అని దేనిని పిలవవచ్చో తెలుసా?
ఓల్డ్ మాంక్ వివాదం: చట్టపరంగా ‘రమ్’ లేదా ‘విస్కీ’ అని దేనిని పిలవవచ్చో తెలుసా?

"రమ్‌కు ప్రత్యేకంగా బయటి నుంచి రమ్ ఫ్లేవర్, విస్కీకి బయటి నుంచి విస్కీ ఫ్లేవర్ కలిపి తయారు చేసే విధానం అంతర్జాతీయంగా ఎక్కడా గుర్తింపు పొందలేదు. సహజమైన సువాసనను కప్పిపుచ్చి విడిగా ఫ్లేవర్లను చేర్చడం వినియోగదారులను మోసం చేయడమే" అని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టం చేసింది.

చట్టపరంగా ‘రమ్’ అంటే ఏమిటి?

FSSAI (ఆల్కహాలిక్ బెవరేజెస్) నిబంధనలు - 2018 ప్రకారం రమ్‌ను క్రింది విధంగా నిర్వచించారు.

మూల పదార్థం (Base Ingredient): చెరకు రసం (Sugarcane Juice), చెరకు మొలాసిస్ (Sugarcane Molasses) లేదా చెరకు సంబంధిత పదార్థాలను పులియబెట్టి (Fermentation) డిస్టిలేషన్ ద్వారా తీసే ఆల్కహాల్ ఆధారంగా రమ్ ఉండాలి.

కలరింగ్ అండ్ ఫ్లేవరింగ్: రమ్‌లో 'కారమెల్' (Caramel) మినహా ఎలాంటి ఇతర కృత్రిమ రంగులు వాడకూడదు.

వైట్ రమ్: ఎలాంటి రంగులు కలపకుండా సహజంగా తయారు చేస్తే దానిని స్పష్టంగా "వైట్ రమ్" (White Rum) అని లేబుల్ చేయాలి.

చట్టపరంగా ‘విస్కీ’ అంటే ఏమిటి?

మూల పదార్థం (Base Ingredient): మొలకెత్తిన ధాన్యాలు (Malted Cereal Grains) అంటే మొక్కజొన్న, జొన్నలు, బార్లీ వంటి ధాన్యాల రసాన్ని పులియబెట్టి, డిస్టిలేషన్ ద్వారా విస్కీ తయారు చేస్తారు.

మద్యానికి దాని ప్రత్యేక రుచి, సువాసన సహజంగా వచ్చే ధాన్యాలు/చెరకు, ఫెర్మెంటేషన్, డిస్టిలేషన్, బారెల్ మెచ్యూరేషన్ (పరిపక్వత) ద్వారా మాత్రమే రావాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టం చేసింది.

న్యూట్రల్ ఆల్కహాల్ వాడుకపై నిషేధం: చౌకగా లభించే న్యూట్రల్ ఆల్కహాల్‌కు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు కలిపి దానిని 'రమ్' లేదా 'విస్కీ' అని అమ్మడం నేరం.

నూతన లేబులింగ్ నిబంధనలు: ఒకవేళ బయటి ఫ్లేవర్లు కలిపి తయారు చేస్తే, బాటిల్ ముందు భాగంలో స్పష్టంగా "రమ్-ఫ్లేవర్డ్ స్పిరిట్" (Rum-flavoured spirit) లేదా "విస్కీ-ఫ్లేవర్డ్ స్పిరిట్" (Whisky-flavoured spirit) అని ముద్రించాలి తప్ప, కేవలం రమ్ లేదా విస్కీగా విక్రయించకూడదు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe