భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో హైదరాబాద్‌కే చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ చారిత్రాత్మక ఘనత సాధించింది. దేశీయ రోడ్లపై ఏకంగా 4,000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిన మొదటి భారతీయ కంపెనీగా నిలిచింది.

హిమాచల్ ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (HRTC) ఫ్లీట్‌లో నూతనంగా చేరిన 297 ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ విశిష్ట మైలురాయిని వేడుకగా నిర్వహించారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, ఉప ముఖ్యమంత్రి ముకేష్ అగ్నిహోత్రిలకు ఒలెక్ట్రా తమ 4,000వ ఎలక్ట్రిక్ బస్సును అధికారికంగా అందించింది.
"భారత రోడ్లపై 4,000 ఎలక్ట్రిక్ బస్సులను దించిన తొలి సంస్థగా నిలవడం ఒలెక్ట్రా సాధించిన విజయం మాత్రమే కాదు; ఇది భారత ఎలక్ట్రిక్ రవాణా రంగానికే ఒక దిశా నిర్దేశం. పర్యావరణ హిత ప్రజారవాణాపై దేశవ్యాప్తంగా ఆర్టీసీలు ఉంచిన విశ్వసనీయతకు ఇది ప్రతీక" అని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ బాబు తెలిపారు.
పర్యావరణానికి భారీ లబ్ధి
పర్యావరణ పరిరక్షణలో ఈ ఎలక్ట్రిక్ బస్సులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒలెక్ట్రాకు చెందిన 4,000 ఈ-బస్సులు ఇప్పటివరకు రోడ్లపై 73 కోట్లకు పైగా (730 మిలియన్) గ్రీన్ కిలోమీటర్లు ప్రయాణించాయి. ఎలాంటి పొగ ఉద్గారాలు లేకుండా ప్రయాణించి దాదాపు 6.5 లక్షల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదల కాకుండా అరికట్టగలిగాయి.
ఆర్థిక ఫలితాల్లోనూ రికార్డు వృద్ధి
2025-26 (FY26) ఆర్థిక సంవత్సరంలో ఒలెక్ట్రా అత్యుత్తమ ఆర్థిక ప్రదర్శన నమోదు చేసింది. రికార్డు స్థాయిలో ఈ-బస్సుల సరఫరా, ఆదాయంలో రెండంకెల వృద్ధిని సొంతం చేసుకుంది. FY26 లో కంపెనీ రూ. 2,312.17 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత FY25 లో నమోదైన రూ. 1,801.90 కోట్లతో పోలిస్తే ఇది 28 శాతం పెరుగుదల.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఒలెక్ట్రా మొత్తం 1,280 ఎలక్ట్రిక్ వాహనాలను క్లయింట్లకు అందజేసింది. గతేడాది అందించిన 972 వాహనాలతో పోలిస్తే ఇది 32 శాతం ఎక్కువ. కంపెనీ చరిత్రలోనే ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో వాహనాలను సరఫరా చేయడం ఇదే తొలిసారి.
{{/usCountry}}ఈ ఆర్థిక సంవత్సరంలో ఒలెక్ట్రా మొత్తం 1,280 ఎలక్ట్రిక్ వాహనాలను క్లయింట్లకు అందజేసింది. గతేడాది అందించిన 972 వాహనాలతో పోలిస్తే ఇది 32 శాతం ఎక్కువ. కంపెనీ చరిత్రలోనే ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో వాహనాలను సరఫరా చేయడం ఇదే తొలిసారి.
{{/usCountry}}