టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్ ప్లస్ 15R (OnePlus 15R) ఎట్టకేలకు బుధవారం నాడు భారత మార్కెట్లో అడుగుపెట్టింది. ప్రీమియం ఫీచర్లు, అదిరిపోయే లుక్స్‌తో వచ్చిన ఈ ఫోన్, ఇప్పటికే మార్కెట్లో దూసుకుపోతున్న ఒప్పో రెనో 14 ప్రో 5G (Oppo Reno 14 Pro 5G) తో పోటీ పడనుంది. సుమారు రూ. 50 వేల ధరలో ఈ రెండు ఫోన్లు ఒకదానికొకటి గట్టి పోటీనిస్తున్నాయి. మరి మీ అవసరాలకు తగ్గట్టుగా ఏ ఫోన్ ఎంచుకోవాలి? వీటి మధ్య ఉన్న అసలైన తేడాలేంటి? పూర్తి వివరాలు మీ కోసం..
ధరల యుద్ధం: ఏది చౌక?

ధర విషయానికి వస్తే, వన్ ప్లస్ కాస్త తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది.
వన్ ప్లస్ 15R: 12GB RAM + 256GB వేరియంట్ ధర రూ. 47,999. కాగా, 512GB మోడల్ ధర రూ. 52,999 గా ఉంది. బ్యాంక్ ఆఫర్లతో దీనిని రూ. 44,999 కే సొంతం చేసుకోవచ్చు. డిసెంబర్ 22 నుంచి అమెజాన్, వన్ ప్లస్ స్టోర్లలో అమ్మకాలు మొదలవుతాయి.
ఒప్పో రెనో 14 ప్రో 5G: దీని బేస్ వేరియంట్ (12GB+256GB) ధర రూ. 49,999 కాగా, 512GB మోడల్ రూ. 54,999 కి లభిస్తోంది. ఇది ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది.
డిస్‌ప్లే & డిజైన్: చూడగానే కట్టిపడేసేలా..
రెండు ఫోన్లలోనూ 6.83 ఇంచుల OLED డిస్ప్లేలను అందించారు. 1.5K రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ రెండింటికీ కామనే. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది.
వన్ ప్లస్ 15R లో 165Hz రిఫ్రెష్ రేట్ ఉండటం గేమర్లకు ప్లస్ పాయింట్. అలాగే కళ్లకు అలసట కలగకుండా 'ఐ కంఫర్ట్' వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
మరోవైపు ఒప్పోలో 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నప్పటికీ, 1200 నిట్స్ బ్రైట్నెస్ ఉండటం వల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే వర్షంలో లేదా గ్లౌవ్స్ వేసుకున్నా కూడా పని చేసేలా దీని డిస్‌ప్లే రూపొందించారు.
పెర్ఫార్మెన్స్: స్పీడ్‌లో ఎవరిది పైచేయి?
{{/usCountry}}మరోవైపు ఒప్పోలో 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నప్పటికీ, 1200 నిట్స్ బ్రైట్నెస్ ఉండటం వల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే వర్షంలో లేదా గ్లౌవ్స్ వేసుకున్నా కూడా పని చేసేలా దీని డిస్‌ప్లే రూపొందించారు.
పెర్ఫార్మెన్స్: స్పీడ్‌లో ఎవరిది పైచేయి?
{{/usCountry}}స్మార్ట్‌ఫోన్ వేగం కోరుకునే వారికి వన్ ప్లస్ 15R ఒక వరం లాంటిది. ఇందులో క్వాల్కమ్ కి చెందిన అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 (3nm) చిప్‌సెట్‌ను వాడారు. గేమింగ్ అయినా, హెవీ మల్టీ టాస్కింగ్ అయినా ఇది అల్ట్రా స్పీడ్‌తో దూసుకుపోతుంది. అలాగే ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 (OxygenOS 16) తో వస్తోంది. దీనికి 4 ఏళ్ల ఓఎస్ అప్‌డేట్స్, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ మాటిచ్చింది.
ఒప్పో రెనో 14 ప్రో విషయానికి వస్తే, ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ ఉంది. ఇది కూడా వేగంగానే పనిచేస్తుంది కానీ, వన్ ప్లస్ చిప్‌సెట్‌తో పోలిస్తే కొంచెం వెనుకబడిందని చెప్పాలి. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓఎస్ 15 తో నడుస్తుంది.
కెమెరా: ఫోటోగ్రఫీ ప్రియుల కోసం..
కెమెరా విభాగంలో ఒప్పో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది.
ఒప్పో రెనో 14 ప్రో: ఇందులో 50MP మెయిన్ + 50MP పెరిస్కోప్ టెలిఫోటో (3.5x జూమ్) + 50MP అల్ట్రా వైడ్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం ఏకంగా 50MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
వన్ ప్లస్ 15R: ఇందులో డ్యూయల్ కెమెరా సెటప్ మాత్రమే ఉంది. 50MP మెయిన్ + 8MP అల్ట్రా వైడ్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ కెమెరా 32MP మాత్రమే. వ్లాగింగ్, ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికి ఒప్పో బెస్ట్ ఆప్షన్.
బ్యాటరీ & ఛార్జింగ్: రోజంతా టెన్షన్ లేదు
బ్యాటరీ సామర్థ్యంలో వన్ ప్లస్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇందులో ఏకంగా 7,400mAh భారీ బ్యాటరీని అందించారు. దీనికి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ బ్యాటరీ నాలుగేళ్ల తర్వాత కూడా 80% సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది.
ఒప్పోలో 6,200mAh బ్యాటరీ ఉంది. అయితే ఇందులో ఒక ప్రత్యేకత ఉంది. 80W వైర్డ్ ఛార్జింగ్‌తో పాటు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. వన్ ప్లస్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం లేకపోవడం ఒక లోటు.
రెండింటిలో ఏది కొనాలి?
మీరు మొబైల్‌లో గేమింగ్ ఎక్కువగా ఆడుతూ, బ్యాటరీ లైఫ్, స్పీడ్ కోరుకునే వారైతే నిస్సందేహంగా వన్ ప్లస్ 15R వైపు వెళ్లొచ్చు. ఒకవేళ మీరు ఫోటోగ్రఫీకి ప్రాధాన్యత ఇస్తూ, అందమైన డిజైన్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కావాలనుకుంటే ఒప్పో రెనో 14 ప్రో 5G మీకు సరైన ఎంపిక.