7000ఎంఏహెచ్​ బ్యాటరీతో వన్​ప్లస్​ నుంచి మరో స్మార్ట్​ఫోన్​! లాంచ్​ ఎప్పుడంటే..

వన్​ప్లస్​ నుంచి మరో కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లాంచ్​కు రెడీ అవుతోంది! అదే వన్‌ప్లస్ 15టీ. ఈ మొబైల్​ స్పెసిఫికేషన్స్ కొన్ని ఆన్​లైన్​లో లీక్ అయ్యాయి. ఇందులో 7000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. వివరాల్లోకి వెళితే..

Published on: Nov 1, 2025, 06:00:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫ్లాగ్​షిప్​ వన్​ప్లస్​ 15ని ఇటీవలే లాంచ్​ చేసిన దిగ్గజ సంస్థ ఇప్పుడు మరో స్మార్ట్​ఫోన్​ని విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. అదే వన్​ప్లస్​ 15టీ. ఈ గ్యాడ్జెట్​.. 2026 మొదటి అర్ధభాగంలో విడుదల కానున్నట్లు సమాచారం! కాగా, ఈ డివైజ్​కి సంబంధించిన అనేక లీక్స్​ ద్వారా కొత్త వివరాలు వెలుగులోకి వస్తున్నాయి.

వన్​ప్లస్​ 15టీ (OnePlus/Representative)
వన్​ప్లస్​ 15టీ (OnePlus/Representative)

విశ్వసనీయ సమాచారాన్ని ఇచ్చే 'డిజిటల్ చాట్ స్టేషన్' నుంచి వచ్చిన ఓ సమాచారం ప్రకారం.. వన్‌ప్లస్ 15టీ ఒక చిన్న ఫ్రేమ్‌లో అత్యుత్తమ పనితీరును అందించే, అత్యంత మెరుగైన కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్‌గా రూపుదిద్దుకుంటుంది!

వన్‌ప్లస్ 15టీ: కాంపాక్ట్ పవర్, నెక్స్ట్-జెన్ హార్డ్‌వేర్

లీకైన వివరాల ప్రకారం, వన్‌ప్లస్ 15టీ ముఖ్యమైన ఫీచర్లు ఇవే:

డిస్‌ప్లే: ఈ స్మార్ట్​ఫోన్ 6.31-ఇంచ్​ ఫ్లాట్ ఓఎల్​ఈడీ డిస్‌ప్లేతో, 1.5కే రిజల్యూషన్‌తో వస్తుంది. సిమెట్రికల్ బెజెల్స్ (సమానమైన అంచులు), మునుపటి హై-ఎండ్ వన్‌ప్లస్ మోడల్స్‌లో కనిపించిన అత్యాధునిక అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఇందులో ఉండనున్నాయి.

ప్రాసెసర్: ప్రామాణిక వన్‌ప్లస్ 15కు శక్తినిచ్చే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ఈ ఫోన్‌లో కూడా ఉండనుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ ఏఐ-ఆధారిత ఫీచర్ల కోసం ఇది అగ్రశ్రేణి పనితీరును అందిస్తుందని భావిస్తున్నారు.

భారీ 7,000ఎంఏహెచ్​ బ్యాటరీతో?

వన్‌ప్లస్ 15టీ గురించి అత్యంత ఆసక్తికరమైన అంశం.. ప్రస్తుతం పరీక్షల్లో ఉన్న ఈ ప్రోటోటైప్ మోడల్ నంబర్లు "7" తో మొదలవుతుండటం! దీని బట్టి, ఇందులో భారీ 7,000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉండే అవకాశం ఉందని లీకర్ సూచిస్తున్నారు.

ఈ అంచనా నిజమైతే, వన్‌ప్లస్ కాంపాక్ట్ లైనప్‌లో ఇది అతిపెద్ద ముందడుగు అవుతుంది. ఇది పోటీదారుల కంటే మెరుగైన బ్యాటరీ లైఫ్‌ను, దీర్ఘకాలిక వినియోగాన్ని అందించి, 15టీకి ప్రధాన ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.

ఈ పరికరం సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా మద్దతిచ్చే అవకాశం ఉంది. అయితే ఛార్జింగ్ వాటేజ్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మన్నికైన డిజైన్, అద్భుతమైన నిర్మాణ నాణ్యత..

వన్‌ప్లస్ 15టీ ఐపీ68-రేటెడ్ ఛాసిస్‌తో రానుందని సమాచారం! అంటే ఇది దుమ్ము, నీటి నిరోధకతను కలిగి ఉంటుంది. డిజైన్ పరంగా, మెటల్ ఫ్రేమ్, మ్యాట్ గ్లాస్ ఫినిష్‌తో కూడిన మినిమలిస్ట్ సౌందర్యాన్ని వన్‌ప్లస్ కొనసాగించే అవకాశం ఉంది.

కెమెరా అప్‌గ్రేడ్‌లు: కెమెరా వివరాలు ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, ఈ కొత్త మోడల్‌లో అల్ట్రా-వైడ్ సెన్సార్‌ను అందిస్తారని నివేదికలు సూచిస్తున్నాయి. వన్‌ప్లస్ 13టీలో లోపించిన ముఖ్యమైన అంశాల్లో ఇది ఒకటి. కొత్త స్నాప్‌డ్రాగన్ చిప్ నుంచి ఆశించే ఇమేజ్ ప్రాసెసింగ్ మెరుగుదలలతో, తక్కువ-కాంతి, పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీలో మెరుగైన ఫలితాలు చూడొచ్చని కెమెరా ప్రియులు ఆశించవచ్చు.

వన్​ప్లస్​ 15టీ లాంచ్ టైమ్​లైన్​..

డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించిన ప్రకారం, వన్‌ప్లస్ 15టీ వచ్చే ఏడాది 2026 మొదటి అర్ధభాగంలో అధికారికంగా లాంచ్​ అవుతుంది. ఇది ఆ సంవత్సరంలో విడుదలయ్యే తొలి కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్‌లలో ఒకటి కానుంది.

భారతదేశం వంటి మార్కెట్లలో, ఇది మునుపటి "టీ" మోడళ్ల మాదిరిగానే వన్‌ప్లస్ 15ఎస్​ అనే పేరుతో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. వన్‌ప్లస్ 15 త్వరలో భారత మార్కెట్లో విడుదలవుతున్న నేపథ్యంలో, ఆ వెంటనే 15టీ (లేదా 15ఎస్​) కూడా రానుండటంతో, 2026 వన్‌ప్లస్‌కు మరో ప్రతిష్టాత్మక సంవత్సరంగా నిలవనుంది. పనితీరు, డిజైన్, విలువ మధ్య సమతుల్యతను కొనసాగించడం ద్వారా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల విభాగంలో వన్‌ప్లస్ తన ఆధిపత్యాన్ని విస్తరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More