OnePlus 16 : గంటలో 70వేల సేల్స్! ఊపేస్తున్న వన్‌ప్లస్ 16- ఫీచర్లు, ధర వివరాలు..
చైనా మార్కెట్లో విడుదలైన తొలి గంటలోనే వన్‌ప్లస్ 16 స్మార్ట్‌ఫోన్ 70,000 యూనిట్ల విక్రయాలతో సరికొత్త రికార్డు సృష్టించింది! 9,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 200 ఎంపీ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
స్మార్ట్‌ఫోన్ రంగాన్ని ఆశ్చర్యపరుస్తూ వన్‌ప్లస్ తమ సరికొత్త ఫ్లాగ్షిప్ మోడల్ ‘వన్‌ప్లస్ 16’ విక్రయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది! చైనా మార్కెట్లో సేల్ ప్రారంభమైన మొదటి గంటలోనే ఏకంగా 70,000 కి పైగా వన్‌ప్లస్ 16 యూనిట్లు అమ్ముడై, వినియోగదారుల నుంచి ఊహించని రీతిలో ఆదరణ దక్కించుకుంది. స్థానిక కాలమానం ప్రకారం అక్టోబర్ 13న ఉదయం 10 గంటలకు ఒప్పో ఆన్లైన్ స్టోర్ ద్వారా ఈ విక్రయాలు ప్రారంభమైనప్పటి నుంచి కస్టమర్లు ఈ ఫోన్ కోసం ఎగబడ్డారు!

ఇంత డిమాండ్ నేపథ్యంలో ఈ వన్‌ప్లస్ 16 ఫీచర్లు, ధర సహా పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వన్‌ప్లస్ 16 గంటలోనే 70,000 ఫోన్ల విక్రయం!
విడుదలైన స్వల్ప వ్యవధిలోనే లభించిన ఈ ఆదరణపై కంపెనీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.
"ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ ఫోన్లలో తొలి వారంలోనే అత్యధిక విక్రయాలు నమోదు చేసిన మోడల్‌గా వన్‌ప్లస్ 16 మొదటి స్థానంలో నిలిచింది," అని వన్‌ప్లస్ చైనా ప్రెసిడెంట్ లి జీ తమ విబో సామాజిక మాధ్యమ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు.
వన్‌ప్లస్ 16- 9,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 200 ఎంపీ కెమెరా!
గత మోడల్ వన్‌ప్లస్ 15లో ఉన్న 7,300 ఎంఏహెచ్ బ్యాటరీతో పోలిస్తే, ఈ నూతన ఫోన్లో ఏకంగా 9,000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చడం విశేషం. దీనికి తోడు 100డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50డబ్ల్యూ వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయాన్ని కల్పించారు.
ఫొటోగ్రఫి ప్రేమికుల కోసం వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో కూడిన 200 ఎంపీ ప్రధాన కెమెరా, 50 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్ ఇచ్చే 50 ఎంపీ టెలిఫోటో లెన్స్ ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 ఎంపీ కెమెరాను పొందుపరిచారు.
వన్‌ప్లస్ 16- పవర్ఫుల్ ప్రాసెసర్, అదిరిపోయే డిస్ప్లే..
గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం ఈ వన్‌ప్లస్ 16లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ జెన్ 6 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 16జీబీ LPDDR5X ఆల్ట్రా రామ్, 1టీబీ వరకు యూఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 17 ఆధారిత కలర్ఓఎస్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇది పనిచేస్తుంది. నీరు, ధూళి నుంచి రక్షణ కోసం ఐపీ66, ఐపీ68, ఐపీ69, ఐపీ69కే రేటింగ్లను అందించారు.
ఇందులో 6.78-ఇంచుల ఫుల్ హెచ్డీ+ ఎల్టీపీఓ అమోలెడ్ స్క్రీన్‌ను అమర్చారు. సాధారణ యాప్‌ల కోసం 165హెచ్‌జెడ్, గేమింగ్ సమయంలో 185హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను ఈ డిస్ప్లే అందిస్తుంది.
వన్‌ప్లస్ 16- ధరలు, వేరియంట్లు..
చైనాలో ఈ వన్‌ప్లస్ 16 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ వేరియంట్ (12GB RAM + 256GB) ధర 5,999 యువాన్ (భారత కరెన్సీలో దాదాపు రూ. 86,000) గా నిర్ణయించారు. 12GB + 512GB వేరియంట్ 6,799 యువాన్, 16GB + 512GB వేరియంట్ 7,499 యువాన్, టాప్-ఎండ్ 16GB + 1TB మోడల్ 8,499 యువాన్‌కు లభిస్తున్నాయి. టుమారోస్ స్టార్, మార్టియన్ మాస్టర్‌పీస్, డార్క్ ఫారెస్ట్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో ఇది అందుబాటులోకి వచ్చింది.
యూరోప్, ఉత్తర అమెరికా మార్కెట్ల నుంచి కంపెనీ తప్పుకున్నందున అక్కడి వినియోగదారులు ఈ ఫోన్‌ను కోల్పోనున్నారు. ఇక టెక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత మార్కెట్లో వన్‌ప్లస్ 16 లాంచ్ తేదీపై సంస్థ త్వరలోనే ప్రకటన చేయనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


