Oppo Find X10 : 200ఎంపీ డ్యూయెల్ కెమెరాతో ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్..
ఒప్పో నుంచి రానున్న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'ఫైండ్ ఎక్స్10' సిరీస్ గురించి ఆసక్తికరమైన లీక్స్ బయటకు వచ్చాయి. ఇందులో రెండు 200ఎంపీ కెమెరాలతో పాటు, ప్రపంచంలోనే మొట్టమొదటి 2ఎన్ఎం ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తన తదుపరి తరం ఫ్లాగ్‌షిప్ సిరీస్ 'ఫైండ్ ఎక్స్10' కోసం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఫైండ్ ఎక్స్9 మోడళ్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నప్పటికీ, అప్పుడే తర్వాతి జనరేషన్ ఫైండ్ ఎక్స్10 సిరీస్‌కు సంబంధించిన కీలక ఫీచర్లు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా కెమెరా హార్డ్‌వేర్ విషయంలో ఒప్పో మునుపెన్నడూ లేని విధంగా పెను మార్పులు చేయబోతోంది.

డ్యూయల్ 200ఎంపీ కెమెరా సెటప్‌తో ఒప్పో ఫైండ్ ఎక్స్10!
ప్రముఖ టిప్‌స్టర్ 'డిజిటల్ చాట్ స్టేషన్' వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒప్పో తన ఫైండ్ ఎక్స్10 స్మార్ట్‌ఫోన్ సిరీస్ కోసం డ్యూయల్ 200ఎంపీ కెమెరా సెటప్‌ని పరీక్షిస్తోంది. ఈ సెటప్‌లో 200ఎంపీ మెయిన్ కెమెరా, 200ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండనున్నాయి. ఈ రెండు కెమెరాల్లోనూ 1/1.3-ఇంచ్ భారీ సెన్సార్లను వాడుతున్నట్లు సమాచారం.
ఒకవేళ ఇదే నిజమైతే, ఒప్పో ఫైండ్ సిరీస్‌లో ఇప్పటివరకు వాడిన అతిపెద్ద టెలిఫోటో సెన్సార్ ఇదే అవుతుంది!
ఈ కెమెరా కాన్ఫిగరేషన్‌ను స్టాండర్డ్, ప్రో మోడల్స్ రెండింటిలోనూ ఒప్పో ప్రయోగిస్తోంది. అంతేకాకుండా, ఈసారి ఒప్పో తన లైనప్‌ను విస్తరిస్తూ ‘ప్రో మాక్స్’ వేరియంట్‌ను కూడా పరిచయం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సాధారణంగా వచ్చే అల్ట్రా మోడల్ మాత్రం కాస్త ఆలస్యంగా మార్కెట్లోకి రావొచ్చని సమాచారం.
2ఎన్ఎం చిప్‌సెట్ కెమెరాలే కాకుండా, పర్ఫార్మెన్స్ పరంగానూ ఒప్పో ఫైండ్ ఎక్స్10 స్మార్ట్‌ఫోన్ సిరీస్ టాప్ గేర్‌లో ఉండబోతోంది. మీడియాటెక్ రాబోయే ‘డైమెన్సిటీ 9600’ చిప్‌సెట్‌తో పనిచేసే మొదటి ఫోన్లలో ఇది ఒకటి కావచ్చు. ఈ ప్రాసెసర్‌ను 2ఎన్ఎం టెక్నాలజీతో తయారు చేస్తున్నారు. ఇది పాత చిప్‌ల కంటే తక్కువ బ్యాటరీని వాడుకుంటూనే, అత్యుత్తమ పర్ఫార్మెన్స్‌ను అందిస్తుందని ప్రాథమిక పరీక్షలు చెబుతున్నాయి.
ఒప్పో ఫైండ్ ఎక్స్10 స్మార్ట్‌ఫోన్ సిరీస్ డిస్‌ప్లే, బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ ఫీచర్ల గురించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒప్పో అధికారికంగా ఇప్పటివరకు ఎటువంటి వివరాలను ధృవీకరించలేదు. లాంచ్ సమయం దగ్గరపడే కొద్దీ మరిన్ని లీక్స్ ద్వారా పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
ఫైండ్ ఎక్స్9ఎస్ ప్రో లోనూ ఇదే హార్డ్‌వేర్!
ఈ అధునాతన కెమెరా టెక్నాలజీ కేవలం ఫైండ్ ఎక్స్10 సిరీస్‌కే పరిమితం కాకుండా, అంతకంటే ముందే వచ్చే 'ఫైండ్ ఎక్స్9ఎస్ ప్రో'లోనూ కనిపించే అవకాశం ఉంది. ఈ ఏడాది మొదటి అర్థభాగంలో చైనాలో విడుదల కానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో శాంసంగ్ హెచ్‌పీ5 సెన్సార్లను వాడనున్నట్లు సమాచారం. అంటే ఒప్పో తన ప్రీమియం ఫోన్లన్నింటిలోనూ ఈ హై-రిజల్యూషన్ కెమెరా స్ట్రాటజీని అమలు చేయాలని భావిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


