ఒప్పో ఫైండ్ ఎక్స్9 సిరీస్ నవంబర్ 18, 2025న భారతదేశంలో విడుదల కానుంది. ఈ లాంచ్‌కు సంబంధించి కంపెనీ కొంతకాలంగా టీజర్‌లను విడుదల చేస్తూనే ఉంది. ఫలితంగా ఈ సిరీస్‌లోని ఫైండ్ ఎక్స్9, ఫైండ్ ఎక్స్9 ప్రో స్మార్ట్‌ఫోన్స్‌కి చెందిన డిజైన్, అప్‌గ్రేడ్‌లు, కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు, విడుదల దగ్గర పడుతుండటంతో, ఈ మోడళ్ల గురించిన పలు లీక్‌లు చక్కర్లు కొడుతున్నాయి.

తాజా లీక్‌ల ప్రకారం.. ఒప్పో ఫైండ్ ఎక్స్9 5జీ, ఫైండ్ ఎక్స్9 ప్రో 5జీ మోడళ్ల భారతీయ ధర వివరాలు బయటకు వచ్చాయి. ఇవి ఫ్లాగ్‌షిప్ ధరల విభాగంలో ఉంటాయని తెలుస్తోంది. కాబట్టి మీరు ఈ రెండు మోడళ్లపై దృష్టి సారించి, కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, మీరు ఎంత చెల్లించాల్సి ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి..
ఒప్పో ఫైండ్ ఎక్స్9, ఫైండ్ ఎక్స్9 ప్రో 5G ధర (అంచనా)
టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ ఎక్స్ పోస్ట్ ద్వారా ఒప్పో ఫైండ్ ఎక్స్9 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌కి చెందిన అంచనా ధరలను పంచుకున్నారు. ఈ పోస్ట్ ఆధారంగా ధరలు ఇలా ఉండవచ్చు:
ఒప్పో ఫైండ్ ఎక్స్9 5జీ:
12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: రూ. 74,999
16జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: రూ. 84,990
ఒప్పో ఫైండ్ ఎక్స్9 ప్రో 5జీ:
16జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర: దాదాపు రూ. 99,999
అయితే ఈ ధరలు నిజమా కాదా అని నిర్ధారించుకోవడానికి మనం అధికారిక విడుదల వరకు వేచి చూడాల్సిందే!
ఒప్పో ఫైండ్ ఎక్స్9, ఫైండ్ ఎక్స్9 ప్రో 5జీ: ఆశించదగిన ఫీచర్లు
ఒప్పో ఫైండ్ ఎక్స్9, ఒప్పో ఫైండ్ ఎక్స్9 ప్రో రెండూ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌తో పనిచేస్తాయని నిర్ధారించారు. ఇవి 16జీబీ వరకు ర్యామ్, యూఎఫ్ఎస్ 4.1 (UFS 4.1) స్టోరేజ్‌కి కనెక్ట్ చేసి ఉంటాయి.
{{/usCountry}}ఒప్పో ఫైండ్ ఎక్స్9, ఒప్పో ఫైండ్ ఎక్స్9 ప్రో రెండూ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌తో పనిచేస్తాయని నిర్ధారించారు. ఇవి 16జీబీ వరకు ర్యామ్, యూఎఫ్ఎస్ 4.1 (UFS 4.1) స్టోరేజ్‌కి కనెక్ట్ చేసి ఉంటాయి.
{{/usCountry}}కెమెరా: ఈ రెండు మోడళ్లు కెమెరా-సెంట్రిక్ ఫీచర్లను అందిస్తాయని భావిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ప్రో మోడల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది.
- 50ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా (శామ్‌సంగ్ జేఎన్5 సెన్సార్‌తో)
- 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-828 మెయిన్ కెమెరా
- 200ఎంపీ శామ్‌సంగ్ హెచ్‌పీ5 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్
బ్యాటరీ: ఫైండ్ ఎక్స్9 మోడల్‌లో 7025ఎంఏహెచ్ భారీ బ్యాటరీని, ఫైండ్ ఎక్స్9 ప్రో మోడల్‌లో 7500ఎంఏహెచ్ బ్యాటరీని ఆశించవచ్చు.