Oppo K14x : ఒప్పో నుంచి 6500 ఎంఏహెచ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్- కే14ఎక్స్ ధర ఎంతంటే..
ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. 6,500 ఎంఏహెచ్ బ్యాటరీతో ఒప్పో కే14ఎక్స్ ఇండియాలోకి వచ్చింది. ఈ మొబైల్ ఫీచర్స్, ధర సహా ఇతర వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
ఒప్పో తన సరికొత్త బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ని మంగళవారం ఇండియాలో లాంచ్ చేసింది. దాని పేరు ఒప్పో కే14ఎక్స్. ఇదొక 5జీ గ్యాడ్జెట్. భారీ బ్యాటరీ, వేగవంతమైన డిస్‌ప్లే దీని ప్రధాన ఆకర్షణలు. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు, ధర, ఫీచర్లు ఇక్కడ తెలుసుకోండి..

ఒప్పో కే14ఎక్స్ 5జీ- ధర, లభ్యత..
ఒప్పో కే14ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది:
4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్: రూ. 14,999
6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్: రూ. 16,999
ఆఫర్లు: లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్స్‌పై రూ. 1,500 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
సేల్: ఈ ఒప్పో కే14ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 16 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా అమ్మకానికి రానుంది. ఇది ఐసీ బ్లూ, ప్రిజం వైలెట్ వంటి రంగుల్లో లభిస్తుంది.
ఒప్పో కే14ఎక్స్- ప్రధాన ఫీచర్లు..
డిస్‌ప్లే: ఈ ఒప్పో కే14ఎక్స్ స్మార్ట్‌ఫోన్ 6.75- ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1,125 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.
ప్రాసెసర్: ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ వాడారు.
బ్యాటరీ అండ్ ఛార్జింగ్: ఈ ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్‌లోని 6500 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఒకే ఛార్జ్‌తో 17.6 గంటల యూట్యూబ్ ప్లేబ్యాక్‌ను ఇస్తుంది. దీనికి 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
కెమెరా: వెనుక వైపు 50ఎంపీ మెయిన్ కెమెరా + 2ఎంపీ మోనోక్రోమ్ కెమెరా ఈ గ్యాడ్జెట్లో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 5ఎంపీ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓఎస్ 15పై ఈ మొబైల్ నడుస్తుంది.
ఇతర ఫీచర్లు: IP64 రేటింగ్ (వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్), సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5ఎంఎం ఆడియో జాక్.
మరి మీరు ఈ ఒప్పో కే14ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ని కొంటున్నారా?
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


