రూ. 12,999కే Samsung Galaxy F70e- 6000ఎంఏహెచ్ బ్యాటరీతో..
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70ఈని సంస్థ తాజాగా ఇండియాలో లాంచ్ చేసింది. ఇదొక బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ స్మార్ట్‌ఫోన్. ఈ గ్యాడ్జెట్‌కి సంబంధించిన కెమెరా, బ్యాటరీ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు కోరుకునే స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం శాంసంగ్ నుంచి అదిరిపోయే వార్త! శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70ఈ పేరుతో సరికొత్త మొబైల్‌ని ఇండియాలో సోమవారం సంస్థ లాంచ్ చేసింది. ఇదొక 5జీ గ్యాడ్జెట్. గెలాక్సీ ఎఫ్70 సిరీస్‌లో వస్తున్న తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. తక్కువ ధరకే 6000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, లెదర్ ఫినిష్ డిజైన్ వంటి అద్భుతమైన ఫీచర్లను శాంసంగ్ ఇందులో జోడించింది. ఈ నేపథ్యంలో ఈ మొబైల్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70ఈ- ధర..
భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది:
4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్: దీని ధర కేవలం రూ. 12,999.
6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్: దీని ధర రూ. 14,999.
ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 17 నుంచి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్లలో అమ్మకానికి రానుంది. ఇది లైమ్‌లైట్ గ్రీన్, స్పాట్‌లైట్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70ఈ- ప్రధాన ఫీచర్లు..
డిస్‌ప్లే: ఈ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్ ఉంటుంది. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో రావడం వల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రాసెసర్: ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ని వాడారు. ఆన్‌టుటు బెంచ్‌మార్క్‌లో ఇది 6.23 లక్షల స్కోరు సాధించినట్లు కంపెనీ వెల్లడించింది.
సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8పై ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ నడుస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా, ఈ ఫోన్‌కు ఏకంగా 6 ఏళ్ల పాటు సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని శామ్‌సంగ్ హామీ ఇచ్చింది.
బ్యాటరీ: రోజంతా నిరంతరాయంగా వాడినా ఛార్జింగ్ అయిపోకుండా ఇందులో 6000ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అమర్చారు.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్70ఈ- కెమెరా, డిజైన్..
ఫోన్ వెనుక భాగం ప్రీమియం లెదర్ ఫినిష్‌తో ఇంప్రెసివ్‌గా ఉంటుంది. కెమెరా మాడ్యూల్ పిల్ ఆకారంలో ఉండి ఫోన్‌కు కొత్త లుక్‌ను ఇస్తోంది.
ఇక కెమెరా విషయానికొస్తే:
రియర్ కెమెరా: 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్.
సెల్ఫీ కెమెరా: ముందు భాగంలో వాటర్‌డ్రాప్ నాచ్‌లో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.
మరి మీరు ఈ శాంసంగ్ కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ని కొంటున్నారా?
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


