10,050ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో ఓప్పో ప్యాడ్ ఎయిర్ 5.. అదిరిపోయే ఫీచర్లతో లాంచ్
ఓప్పో తన ప్యాడ్ ఎయిర్ లైనప్‌లో సరికొత్త ‘ఓప్పో ప్యాడ్ ఎయిర్ 5’ను చైనాలో విడుదల చేసింది. 12.1 ఇంచ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7300-అల్ట్రా చిప్‌సెట్, భారీ బ్యాటరీతో వచ్చిన ఈ టాబ్లెట్ త్వరలోనే భారత మార్కెట్లోకి కూడా వచ్చే అవకాశం ఉంది.
టెక్ దిగ్గజం ఓప్పో తన టాబ్లెట్ శ్రేణిని మరింత విస్తరిస్తూ ‘ఓప్పో ప్యాడ్ ఎయిర్ 5’ని చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, మల్టీ టాస్కింగ్ కోసం వెతుకుతున్న వారిని దృష్టిలో పెట్టుకుని ఈ సరికొత్త టాబ్లెట్‌ను రూపొందించింది. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు శక్తివంతమైన హార్డ్‌వేర్‌ను ఇందులో జోడించారు. ఈ నేపథ్యంలో ఈ మోడల్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఒప్పో ప్యాడ్ ఎయిర్ 5- ధర, లభ్యత..
8జీబీ + 128జీబీ: సుమారు రూ. 24,000 (1,899 యువాన్)
8జీబీ + 256జీబీ: సుమారు రూ. 28,000 (2,199 యువాన్)
12జీబీ + 256జీబీ: సుమారు రూ. 32,000 (2,499 యువాన్)
ఇదే ర్యామ్, స్టోరేజ్లతో కూడిన ప్రత్యేకమైన ‘సాఫ్ట్ లైట్’ వెర్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ధర సుమారు రూ. 31,000 నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 31 నుంచి ఇవి అధికారికంగా సేల్స్‌లోకి రానున్నాయి.
స్టార్‌లైట్ పౌడర్, స్పేస్ గ్రే కలర్స్‌లో ఈ ట్యాబ్ అందుబాటులో ఉంటుంది.
అద్భుతమైన డిస్‌ప్లే.. స్మూత్ పర్ఫార్మెన్స్:
ఓప్పో ప్యాడ్ ఎయిర్ 5లో 12.1 ఇంచ్ భారీ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అమర్చారు. ఇది 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు 2.8కే రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. అంటే మీరు గేమ్‌లు ఆడినా లేదా సినిమాలు చూసినా ఎక్స్‌పీరియెన్స్ ఎంతో స్మూత్‌గా ఉంటుంది. ఇక 900 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ వల్ల పగటిపూట వెలుతురులో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది.
పవర్ ప్యాక్డ్ హార్డ్‌వేర్: ఈ టాబ్లెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300-అల్ట్రా ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీనికి తోడు 12జీబీ వరకు ర్యామ్ ఉండటం వల్ల ఒకేసారి ఐదారు యాప్స్ వాడినా హ్యాంగ్ అయ్యే ప్రసక్తే ఉండదు.
ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ ఓఎస్ 16తో ఈ ఒప్పో ప్యాడ్ ఎయిర్ 5 పనిచేస్తుంది.
భారీ బ్యాటరీ.. ఫాస్ట్ ఛార్జింగ్:
టాబ్లెట్లలో బ్యాటరీ చాలా ముఖ్యం. అందుకే ఓప్పో ఇందులో 10,050ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఇచ్చింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా నిశ్చింతగా వాడుకోవచ్చు. దీనికి 33డబ్ల్యూ సూపర్‌వీఓఓసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
కెమెరా- ఇతర ఫీచర్లు:
ఫోటోలు, వీడియో కాల్స్ కోసం వెనుక వైపు 8 మెగాపిక్సెల్, ముందు వైపు 8 మెగాపిక్సెల్ కెమెరాలను ఇచ్చారు. కనెక్టివిటీ పరంగా వై-ఫై 6, బ్లూటూత్, సెల్యులార్ వెర్షన్‌లో 5జీ సపోర్ట్ ఉన్నాయి. కేవలం 6.83ఎంఎం మందంతో, సుమారు 599 గ్రాముల బరువుతో ఇది చాలా స్లిమ్‌గా ఉంటుంది.
ఈ టాబ్లెట్ త్వరలోనే గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారతదేశంలో కూడా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాల సమాచారం.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


