...
...
Next Story

6500ఎంఏహెచ్​ బ్యాటరీ, 200ఎంపీ కెమెరా.. Oppo Reno 15 సిరీస్​పై బిగ్​ అప్డేట్​!

భారత్‌లోకి ఒప్పో రెనో 15 స్మార్ట్​ఫోన్​ సిరీస్ లాంచ్​కు రెడీ అవుతోంది. ఇందులో మీడియాటెక్​ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్​ ఉంటుందని తాజా లీక్స్​ సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సిరీస్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 04, 2025 04:00 PM IST
Advertisement

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో నుంచి త్వరలోనే ఒక కొత్త స్మార్ట్​ఫోన్​ సిరీస్​ ఇండియాలోకి రానుంది. దాని పేరు ఒప్పో రెనో 15. ఈ సిరీస్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ధర వివరాలు ఇంకా పూర్తిగా బయటకు రానప్పటికీ, తాజా లీక్స్ ప్రకారం​ ఇందులోని అన్ని మోడల్స్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌లు ఉంటాయని తెలుస్తోంది.

ఒప్పో రెనో 15 లాంచ్​ త్వరలోనే!
ఒప్పో రెనో 15 లాంచ్​ త్వరలోనే!

రెనో 14 స్మార్ట్​ఫోన్​ సిరీస్ తర్వాత రాబోతున్న ఈ కొత్త లైనప్‌లో ఈసారి మూడు మోడల్స్ ఉండే అవకాశం ఉంది. అవి..

  • ఒప్పో రెనో 15
  • ఒప్పో రెనో 15 ప్రో
  • కొత్త ప్రో మినీ వేరియంట్

ప్రస్తుతం, బేస్ మోడల్ రెనో 15గా భావిస్తున్న ఒక హ్యాండ్‌సెట్ వివరాలు గీక్‌బెంచ్​లో కనిపించాయి. ఇది మీడియాటెక్​ డైమెన్సిటీ 8450 చిప్‌తో పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఒప్పో రెనో 15- స్పెసిఫికేషన్లు, పనితీరు వివరాలు (అంచనా)..

ఒప్పో పీఎల్​వీ110 మోడల్ నంబర్‌తో ఉన్న హ్యాండ్‌సెట్ (ఇదే స్టాండర్డ్ ఒప్పో రెనో 15గా అంచనా వేస్తున్నారు) వివరాలు గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో నమోదయ్యాయి. ఈ ఎంట్రీ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్​కి మాలి-జీ720 ఎంసీ7 జీపీయూతో కూడిన మీడియాటెక్​ 8450 చిప్‌సెట్ పవర్​ని ఇస్తుంది. ఈ ప్రాసెసర్​తోనే ఈ ఫోన్ రాబోతుందని గతంలో వచ్చిన లీక్‌లను ఇది బలపరుస్తోంది.

మీడియాటెక్​కి చెందిన ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌లో మూడు క్లస్టర్‌లు ఉన్నాయి:

నాలుగు కోర్లు 2.10జీహెచ్​జెడ్​ వద్ద

మూడు కోర్లు 3.00జీహెచ్​జెడ్​ వద్ద

ఒక హై-పెర్ఫార్మెన్స్ కోర్ 3.25జీహెచ్​జెడ్​ వద్ద క్లాక్ అయ్యింది. దీని బేస్ ఫ్రీక్వెన్సీ 2.10జీహెచ్​జెడ్​.

తాజా లీక్‌ల ప్రకారం, ఒప్పో రెనో 15, ఒప్పో రెనో 15 ప్రో, ఒప్పో రెనో 15 మినీతో కూడిన ఈ సిరీస్ డిసెంబర్‌లో భారతదేశంలో విడుదల కానుంది. ఇంతకుముందు వచ్చిన కొన్ని నివేదికలు ఈ లైనప్‌ను

డిస్‌ప్లే వివరాలు (అంచనా):

  • రెనో 15 ప్రో: 6.78 అంగుళాల 1.5కే ఫ్లాట్ డిస్‌ప్లే.
  • రెనో 15 మినీ: 6.32 అంగుళాల 1.5కే ఫ్లాట్ డిస్‌ప్లే.
  • రెనో 15: 6.59 అంగుళాల స్క్రీన్.

ఈ సిరీస్‌లోని స్మార్ట్​ఫోన్స్​ మెటల్ ఫ్రేమ్‌ను కలిగి ఉండవచ్చని, డస్ట్​ అండ్​ వాటర్​ రెసిస్టెన్స్​ కోసం ఐపీ68 తో పాటు ఐపీ69 రేటింగ్‌లను కూడా అందించే అవకాశం ఉందని అంచనా.

రెనో 15 ప్రోలోని హార్డ్‌వేర్ విషయానికొస్తే, ఇది మీడియాటెక్​ డైమెన్సిటీ9400 చిప్‌సెట్ ద్వారా పవర్​ని పొందుతుందని, అలాగే 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6500ఎంఏహెచ్​ బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

కెమెరా అంచనాలు:

ఒప్పో రెనో 15 ప్రో, ఒప్పో రెనో 15 మినీ రెండూ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయని తెలుస్తోంది.

  • ప్రధాన సెన్సార్‌గా 200-మెగాపిక్సెల్ శాంసంగ్ ISOCELL HP5.
  • 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్.
  • 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరా.

సెల్ఫీల కోసం, ఈ రెండు మోడల్స్‌లోనూ 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe