...
...
Next Story

PM Modi Speech : మహిళల కలలను చిదిమేశారు - ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ విమర్శలు

PM Modi Speech Women Reservation Bill : రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవడం ద్వారా ప్రతిపక్షాలు మహిళల కలలను చిదిమేశాయని ప్రధాని మోదీ విమర్శించారు. కోటా బిల్లును నెగ్గకుండా చేసి విపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయని దుయ్యబట్టారు.

Published on: Apr 18, 2026 09:46 PM IST
Advertisement

PM Modi Speech Women Reservation Bill : మహిళా రిజర్వేషన్లు అడ్డుకోవడం దారుణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌లో బిల్లు పెట్టామని… కానీ కాంగ్రెస్, డీఎంకే కలిసి బిల్లును అడ్డుకున్నాయన్నారు.రిజర్వేషన్ల కోసం తన పోరాటం ఇంకా ముగియలేదన్నారు.

ప్రధాని మోదీ
ప్రధాని మోదీ

శనివారం జాతిని ఉద్దేశించిన మాట్లాడిన ప్రధానమంత్రి మోదీ…. 'నారీ శక్తి వందన్ అధినియం' బిల్లు లోక్‌సభలో వీగిపోవటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే వంటి పార్టీలు మహిళా సాధికారతకు అడ్డుపడి పెద్ద పాపం చేశాయని ధ్వజమెత్తారు.

నల్ల దుస్తులు ధరించినంత మాత్రాన చీకటి ఒప్పందాలను దాచి పెట్టలేరని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. “నేను అన్ని పొలిటికల్ పార్టీలతో పర్షనల్‌గా మాట్లాడాను. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరాను. మహిళా రిజర్వేషన్ల విషయంలో అవసరమైతే మీరే క్రెడిట్ తీసుకున్నా పర్వాలేదని చెప్పాను. చివరకు కాంగ్రెస్, డీఎంకే కలిసి బిల్లును అడ్డుకున్నాయి. ఈ విషయంపై డీఎంకే, కాంగ్రెస్‌కు సరైన సమాధానం చెప్పాలి” అని ప్రధాని మోదీ డిమాండ్ చేశారు.

మహిళలకు క్షమాపణలు - ప్రధాని మోదీ

విపక్షలన్నీ కలిసి చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నాలను విఫలం చేశారని ప్రధాని మోదీ ఆరోపించారు. దేశంలోని మహిళలందరి నుంచి క్షమాపణ కోరుతున్నానని వ్యాఖ్యానించారు. మహిళా అధికారాన్ని ప్రతిపక్షాలు పెద్దగా పట్టించుకోలేదన్నారు.

మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించడం ద్వారా ప్రతిపక్షాలు పాపం చేశాయని… దీనికి వారు ఖచ్చితంగా శిక్షించబడతారని అన్నారు. బిల్లును ఓడించి ప్రతిపక్ష పార్టీలు మన రాజ్యాంగాన్ని అవమానించాయని వ్యాఖ్యానించారు.

"కాంగ్రెస్ తన గత తప్పులను సరిదిద్దుకుంటుందని నేను ఆశించాను. కానీ కొత్త చరిత్ర లిఖించే అవకాశాన్ని కోల్పోయింది. కుటుంబం నడుపుతున్న పార్టీలు మహిళలు ముందుకు సాగాలని కోరుకోవడం లేదు… ఎందుకంటే అది వారి స్వార్థపూరిత రాజకీయాలకు ముగింపు పలుకుతుంది" అని ప్రధాని మోదీ చెప్పారు.

“కాంగ్రెస్ పరాన్నజీవిలా తయారైంది. ఇతర పార్టీలపై ఆధారపడి మనుగడ సాగిస్తోంది. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు. అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు దక్కేలా బిల్లు తెచ్చాం. ఇదే విషయాన్ని పదే పదే చెబుతూ వచ్చాం. కానీ దీన్ని ఒప్పుకోవడానికి విపక్షాలు సిద్ధపడలేదు. దేశ ప్రజలను విభజించి లబ్ధి పొందాలన్నది కాంగ్రెస్ ఆలోచన. డీలిమిటేషన్ సాకుగా చూపించి మహిళా రిజర్వేషన్లు అడ్డుకున్నారు” అని ప్రధాని మోదీ ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ ఉత్తర-దక్షిణ విభజన అంటూ విషప్రచారం చేస్తూ దేశ నిర్మాణాన్ని అడ్డుకుంటోందని ఆయన మండిపడ్డారు. ఈ బిల్లు ఎవరి హక్కులను లాక్కోవడానికి కాదని, మహిళల సాధికారతకు రెక్కలు తొడగడానికేనని మోదీ స్పష్టం చేశారు. నారీ శక్తి వందన్ అధినియం ద్వారా దేశవ్యాప్తంగా సమానమైన అభివృద్ధిని సాధించాలన్నది తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe