దేశంలో ఓటర్ల జాబితా సవరణ, ఓట్ల తొలగింపు అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు.. ఏకంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌పై పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించాయి. వచ్చే రెండు వారాల్లో ఉభయ సభల్లోనూ దీనికి సంబంధించిన నోటీసు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ విపక్షాలను ఏకతాటిపైకి తెస్తోంది.
ఇండియా కూటమి సంయుక్త వ్యూహం

ఈ అభిశంసన నోటీసు ముసాయిదాను ప్రస్తుతం న్యాయ నిపుణులు పరిశీలిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి కలిసికట్టుగా ఈ నోటీసును సిద్ధం చేస్తోందని పేర్కొన్నాయి. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించేందుకు విపక్షాలు ప్రయత్నించడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
గతంలో లోక్‌సభ, రాజ్యసభల్లో ఇచ్చిన మొదటి నోటీసు తిరస్కరణకు గురికాగా, ఏప్రిల్ 24న 73 మంది ఎంపీలు ఇచ్చిన మరో నోటీసు రాజ్యసభలో పెండింగ్‌లోనే ఉంది. అయితే, ఓటర్ల జాబితాల సవరణలో జరుగుతున్న అక్రమాలపై ఇటీవల ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రచురించిన కథనం వెలుగులోకి రావడంతో విపక్షాలు కొత్తగా మరొకసారి అభిశంసన తీర్మానం ఇవ్వాలని నిర్ణయించాయి.
దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
మరోవైపు, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని, పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ పోరాటానికి దిగింది. సెప్టెంబర్ 25న అన్ని రాష్ట్రాల ప్రధాన నగరాల్లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ తమ రాష్ట్ర కమిటీలను ఆదేశించింది. అలాగే సెప్టెంబర్ 28న దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
"బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ చేపడుతున్న 'భారీ ఓట్ల చోరీ'ని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మొదటి నుంచి ఎండగడుతున్నారు. ఆయన చేసిన రాజ్యాంగ విరుద్ధ చర్యలు ఇప్పుడు బయటపడ్డాయి. ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిన ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలి" అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విమర్శించారు.
ఎన్నికల కమిషనర్ల మధ్య తీవ్ర విభేదాలు
{{/usCountry}}"బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ చేపడుతున్న 'భారీ ఓట్ల చోరీ'ని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మొదటి నుంచి ఎండగడుతున్నారు. ఆయన చేసిన రాజ్యాంగ విరుద్ధ చర్యలు ఇప్పుడు బయటపడ్డాయి. ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిన ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలి" అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విమర్శించారు.
ఎన్నికల కమిషనర్ల మధ్య తీవ్ర విభేదాలు
{{/usCountry}}గత ఏడాది ప్రారంభమైన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై పది నెలల కాలంలో తోటి ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి కనీసం 14 సార్లు తమ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం స్పష్టం చేసింది. ఓటర్ నమోదు ఫారం-6 సవరణ, ఓట్ల చేరికలు-తొలగింపుల నిర్వహణ, సెంట్రలైజ్డ్ డేటాబేస్‌పై సీఈసీ ఏకపక్ష ఆధిపత్యం వహించడంపై వారు ప్రశ్నించినట్లు సదరు కథనం పేర్కొంది.
అయితే ఈ కథనంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందిస్తూ.. "ఒక వ్యవస్థలో వివిధ అంశాలపై విభిన్న అభిప్రాయాలు ఉండటం సహజం. ఎన్నికల వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రతి అధికారికి సూచనలు ఇచ్చే హక్కు ఉంది. కమిషన్ జారీ చేసే అన్ని ఉత్తర్వులు చట్టబద్ధమైన పరిధిలోనే ఉంటాయి" అని వివరణ ఇచ్చింది.