...
...
Next Story

వాళ్లేం మాల్కం మార్షల్ కాదు-హార్దిక్, శుభమ్ దూబేపై పాకిస్థాన్ మాజీ పేసర్ సంచలన వ్యాఖ్యలు-జింబాబ్వేపై అతణ్ని ఆడించాలంటూ!

టీ20 ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా కష్టాల్లో పడింది. దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన భారత్ కు సెమీస్ రేసు క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో భారత పేస్ ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్య, శివమ్ దూబేపై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Published on: Feb 24, 2026, 06:20:23 IST
Advertisement

టీ20 ప్రపంచకప్ గ్రూప్ స్టేజీలో వరుసగా నాలుగు విజయాలతో అదరగొట్టిన టీమిండియాకు సూపర్ 8 ఫస్ట్ మ్యాచ్ లోనే బిగ్ షాక్ తగిలింది. సౌతాఫ్రికా చేతిలో ఇండియా 76 పరుగుల తేడాతో దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. దీంతో టీమ్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పాకిస్థాన్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ కూడా ఇండియన్ పేస్ ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్య, శివమ్ దూబెపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

షోయబ్ అక్తర్ విమర్శలు

పాకిస్థాన్ మాజీ పేసర్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ మాజీ పేసర్ సంచలన వ్యాఖ్యలు

ఇండియన్ పేస్ ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్య, శివమ్ దూబేపై షోయబ్ అక్తర్ మాటలతో విరుచుకుపడ్డాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్ లో హార్దిక్, శివమ్ కలిసి ఆరు ఓవర్లలో 67 పరుగులు ఇచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే పడగొట్టారు. దీంతో ఈ జోడీని ఎద్దేవా చేస్తూ షోయబ్ అక్తర్ మాట్లాడాడు.

మాల్కం మార్షల్ కాదు

వెస్టిండీస్ లెజెండరీ పేసర్ మాల్కం మార్షల్ లా బ్యాటర్లను వణికించే బౌలింగ్ కెపాసిటీ హార్దిక్ పాండ్య, శివమ్ దూబేకు లేదని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు.. ‘‘హార్దిక్, శివం దూబె గంటకు సుమారు 120 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నారు. వీళ్లేం దక్షిణాఫ్రికా స్థాయి బ్యాటింగ్ లైనప్ ను వణికించే మాల్కం మార్షల్ లాంటి పేసర్లు కాదు. డెత్ ఓవర్లలో వీళ్లతో బౌలింగ్ చేయిస్తే సౌతాఫ్రికా బాదుడు ఇలాగే ఉంటుంది’’ అని షోయబ్ అక్తర్ తెలిపాడు.

వరుణ్ చక్రవర్తి

ఇండియన్ బౌలింగ్ వీక్ గా ఉందనే విషయాన్ని దక్షిణాఫ్రికా బ్యాటర్లు బయటపెట్టారని షోయబ్ అక్తర్ అన్నాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా సౌతాఫ్రికాపై ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. 4 ఓవర్లలో 47 రన్స్ ఇచ్చిన అతను ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు.

టీ20 ప్రపంచకప్ సూపర్ 8లో ఇండియా తన తర్వాతి మ్యాచ్ లో జింబాబ్వేతో ఆడుతుంది. ఈ మ్యాచ్ లో స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్ ను ఆడించాలని షోయబ్ అక్తర్ సూచించాడు.

"ఇక్కడ మిస్సింగ్ లింక్ కుల్ దీప్ యాదవ్. అతను బంతిని గాలిలో తిప్పి బ్యాటర్లను సర్ ప్రైజ్ చేస్తాడు. అవసరమైనప్పుడు వికెట్లు తీయగలడు. అతను మ్యాచ్ విన్నర్. వరుణ్, వాషింగ్టన్ సుందర్ ఒకే విధమైన బౌలింగ్ నైపుణ్యాలతో ఉన్నారు. అందుకే జింబాబ్వేతో మ్యాచ్ లో కుల్ దీప్ ను ఇండియా ఆడించాలి’’ అని అక్తర్ పేర్కొన్నాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks