IPL 2026 PBKS vs DC : ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ అసాధారణ ఆటతీరుతో చరిత్ర సృష్టించింది. ఢిల్లీ నిర్దేశించిన 265 పరుగుల భారీ లక్ష్యాన్ని 6 వికెట్ల తేడాతో ఛేదించి…. సరికొత్త ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే కాకుండా…. ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత విజయవంతమైన రికార్డు ఛేజింగ్ కావడం విశేషం.
ఓపెనర్ల మెరుపు ఆరంభం

265 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఓపెనర్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి ఓవర్ నుంచే ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడిన ఈ స్టార్ ఓపెనర్లు…, పవర్ ప్లేలో కేవలం 6 ఓవర్లలోనే స్కోరు బోర్డును 105 పరుగులకు చేర్చారు. ఇది ఈ సీజన్‌లోనే అత్యధిక పవర్ ప్లే స్కోరు.
ప్రభ్‌సిమ్రాన్ సింగ్ కేవలం 26 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 76 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అతనికి తోడుగా ప్రియాన్ష్ ఆర్య (17 బంతుల్లో 43; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగడంతో తొలి వికెట్‌కు కేవలం 6.5 ఓవర్లలోనే 126 పరుగులు నమోదయ్యాయి.
శ్రేయస్ మెరుపులు….
వరుసగా మూడు వికెట్లు కోల్పోయి పంజాబ్ కాస్త తడబడినట్లు అనిపించినా…. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. తనకు లభించిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకున్న అయ్యర్…. 36 బంతుల్లో 3 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 71 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో 7 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ లక్ష్యాన్ని చేరుకుంది. ఈ విజయంతో పంజాబ్ ఆడిన ఏడు మ్యాచుల్లో ఆరు గెలిచి (ఒకటి వర్షం వల్ల రద్దు) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ మ్యాచ్ లో ఓటమిపాలైన ఢిల్లీ… ఆరో స్థానంలో నిలిచింది. 7 మ్యాచ్ లు ఆడగా… కేవలం మూడింటిల్లో మాత్రమే నెగ్గింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఢిల్లీ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ చరిత్రలోనే మూడవ అత్యధిక వ్యక్తిగత స్కోరు (152 నాటౌట్) సాధించి రికార్డు సృష్టించాడు. నితీష్ రాణా (91) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, పంజాబ్ బ్యాటర్ల ధాటికి ఢిల్లీ భారీ స్కోరు కూడా తలవంచక తప్పలేదు. గతంలో 2024లో కోల్‌కతాపై పంజాబ్ సాధించిన 261 పరుగుల ఛేజింగ్ రికార్డును ఈ రోజు వారే తిరగరాశారు.
{{/usCountry}}అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ఢిల్లీ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ చరిత్రలోనే మూడవ అత్యధిక వ్యక్తిగత స్కోరు (152 నాటౌట్) సాధించి రికార్డు సృష్టించాడు. నితీష్ రాణా (91) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, పంజాబ్ బ్యాటర్ల ధాటికి ఢిల్లీ భారీ స్కోరు కూడా తలవంచక తప్పలేదు. గతంలో 2024లో కోల్‌కతాపై పంజాబ్ సాధించిన 261 పరుగుల ఛేజింగ్ రికార్డును ఈ రోజు వారే తిరగరాశారు.
{{/usCountry}}ఇక ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఇన్నింగ్స్ మొదలు కాగానే ఢిల్లీ ఆటగాడు లుంగి ఎంగిడి తీవ్రంగా గాయపడ్డాడు. అక్షర్ పటేల్ వేసిన 2.3 ఓవర్‌లో ప్రియాంశ్ క్యాచ్‌ను అందుకునేందుకు ప్రయత్నించి ఎంగిడి కిందపడ్డాడు. అతడి తల నేలకు బలంగా తాకింది.. వెంటనే అంబులెన్స్‌ను మైదానంలోకి తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. ఎంగిడి కోలుకోవాలని ఢిల్లీతో పాటు ఇతర జట్లు ఆటగాళ్లు ఆకాంక్షిస్తున్నారు.