...
...
Next Story

ఈపీఎఫ్‌ఓ పెన్షనర్లకు శుభవార్త! ఇక ఇంటి వద్దకే లైఫ్ సర్టిఫికేట్ సేవలు..

ఈపీఎఫ్‌ఓ పెన్షనర్లకు శుభవార్త! ఇక నుంచి ఇంటి వద్దకే డిజిటల్​ లైఫ్ సర్టిఫికేట్ సేవలను అందించేందుకు ఈపీఎఫ్​ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్​తో ఎంఓయూను కుదుర్చుకుంది. పైగా, ఇది ఉచితం కూడా! ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేదు!

Published on: Nov 4, 2025, 13:07:47 IST
Advertisement

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్​ఓ) కీలక ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం.. 1995 నాటి ఉద్యోగుల పెన్షన్ పథకం కింద పెన్షన్ తీసుకుంటున్న వారికి ఇక ఇంటి వద్దకే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సేవలను అందించనున్నారు!

ఎంఓయూ వివరాలు, విధానం..

ఇంటి వద్దకే లైఫ్ సర్టిఫికేట్ సేవలు..
ఇంటి వద్దకే లైఫ్ సర్టిఫికేట్ సేవలు..

ఈ ఎంఓయూ వల్ల ఈపీఎఫ్​ఓ పెన్షనర్లు ఇకపై తమ సాంప్రదాయ కాగితపు సర్టిఫికేట్‌ను సమర్పించడానికి బ్యాంకు శాఖల చుట్టూ లేదా ఈపీఎఫ్​ఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు!

ఐపీపీబీ నెట్‌వర్క్ వినియోగం: ఐపీపీబీ తన విస్తృత నెట్‌వర్క్‌ను (సుమారు 1.65 లక్షలకు పైగా పోస్ట్ ఆఫీసులు, 3 లక్షలకు పైగా పోస్టల్ సర్వీస్ ప్రొవైడర్‌లు) ఇందుకోసం ఉపయోగించుకోనుంది.

సేవలందించే సిబ్బంది: పోస్ట్‌మెన్, గ్రామీణ డాక్ సేవక్‌లు డోర్‌స్టెప్ బ్యాంకింగ్ పరికరాలతో పెన్షనర్ల ఇంటి వద్దకే వచ్చి ఈ సేవలను అందిస్తారు.

  • నెలకు రూ. 50వేల వరకు జీతంతో బీఎస్​ఎన్​ఎల్​ రిక్రూట్​మెంట్​. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

డిజిటల్ ప్రక్రియ: ఈ ప్రక్రియలో ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీతో పాటు వేలిముద్ర బయోమెట్రిక్ అథెంటికేషన్​ని ఉపయోగిస్తారు. దీనివల్ల పెన్షనర్లు తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సులభంగా ఇంట్లో నుంచే సమర్పించవచ్చు.

ఉచిత సేవ: డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ జారీ చేయడానికి అయ్యే మొత్తం ఖర్చును ఈపీఎఫ్​ఓ భరిస్తుంది. కాబట్టి, పెన్షనర్లకు ఈ సేవ పూర్తిగా ఉచితం.

"ఈ భాగస్వామ్యం, భారతదేశంలోని ప్రతి ఇంటి గుమ్మం వద్దకు ముఖ్యమైన ఆర్థిక, పౌర సేవలను తీసుకెళ్లాలన్న ఐపీపీబీ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మా సాంకేతికతతో కూడిన పోస్టల్ నెట్‌వర్క్, విశ్వసనీయమైన లాస్ట్​-మైల్​ సేవలను ఉపయోగించుకోవడం ద్వారా, ఈపీఎఫ్‌ఓ పెన్షనర్లు—ముఖ్యంగా గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో ఉన్నవారు—ఇకపై తమ లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ ప్రక్రియను సులభంగా, గౌరవప్రదంగా, సౌకర్యవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ చొరవ, భారత ప్రభుత్వ లక్ష్యాలైన ‘డిజిటల్ ఇండియా’, ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ విజన్‌కు పూర్తిగా అనుగుణంగా ఉంది. సాంకేతికతను, పోస్టల్ మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకొని, వృద్ధ పౌరులు, పెన్షనర్లందరికీ సేవలను అందించడంలో మా నిబద్ధతను ఇది తెలియజేస్తుంది," అని పేర్కొంది.

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ), ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ అథెంటికేషన్‌ను ఉపయోగించి జీవన్‌ప్రమాణ్ ఉత్పత్తి కోసం డోర్‌స్టెప్ సర్వీస్‌ను 2020లోనే ప్రారంభించింది.

సర్టిఫికేట్ సమర్పణ ఎలా?

పెన్షనర్లు చేయాల్సిందల్లా.. తమ పోస్ట్‌మెన్ లేదా గ్రామీణ డాక్ సేవక్‌ను సంప్రదించడం, లేదా తమకు దగ్గరలోని పోస్ట్ ఆఫీస్​ని సందర్శించి..

ఆధార్ నంబర్, పెన్షన్ వివరాలు అందించాలి.

ఆధార్​తో అనుసంధానించిన ఫేస్ అథెంటికేషన్ లేదా వేలిముద్ర బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా తమ అభ్యర్థనను ధృవీకరించాలి.

సర్టిఫికేట్ జనరేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, పెన్షనర్ మొబైల్ నంబర్‌కు ఎస్​ఎంఎస్​ ద్వారా నిర్ధారణ సందేశం వస్తుంది.

మరుసటి రోజు https://jeevanpramaan.gov.in/v1.0/next వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో సర్టిఫికేట్‌ను చూసుకోవచ్చు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks