...
...
Next Story

పర్సనల్ లోన్ రిజెక్ట్ అయిందా? ఈ 5 తప్పులు సరిచేసుకోండి

అత్యవసర సమయాల్లో పర్సనల్ లోన్ దరఖాస్తు తిరస్కరణకు గురైతే ఆర్థిక ప్రణాళికలు దెబ్బతింటాయి. లోన్ రిజెక్ట్ కావడానికి గల ప్రధాన కారణాలు, భవిష్యత్తులో సులభంగా అప్రూవల్ పొందే మార్గాలు ఇక్కడ తెలుసుకోండి.

Published on: Jun 27, 2026 02:58 PM IST
Advertisement

ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే చాలామంది మొదట ఆశ్రయించేది పర్సనల్ లోన్‌నే. ప్రక్రియ సులభంగానే ఉన్నట్లు కనిపించినప్పటికీ, దరఖాస్తు తిరస్కరణకు గురైతే ఆ సమయానికి చేతిలో డబ్బు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. లోన్ రిజెక్ట్ కావడం అప్లికెంట్లకు పెద్ద షాక్ ఇస్తుంది.

పర్సనల్ లోన్ రిజెక్ట్ అయిందా? ఈ 5 తప్పులు సరిచేసుకోండి
పర్సనల్ లోన్ రిజెక్ట్ అయిందా? ఈ 5 తప్పులు సరిచేసుకోండి

అందుకే లోన్ కోసం దరఖాస్తు చేసే ముందే బ్యాంకులు లేదా రుణ సంస్థలు అప్లికేషన్‌ను పరిశీలించేటప్పుడు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయో అర్థం చేసుకోవడం చాలా అవసరం. అయితే లోన్ దరఖాస్తు తిరస్కరణకు గురైనంత మాత్రాన ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదు. సరైన పద్ధతులను పాటించడం ద్వారా ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు.

"లోన్ రిజెక్ట్ కావడం అనేది మీ వ్యక్తిగత సామర్థ్యాన్ని తక్కువ చేయడం కాదు. అది మీ ఆర్థిక ప్రొఫైల్‌కు సంబంధించిన ఒక ఫీడ్‌బ్యాక్ మాత్రమే. ఇందులో మార్పులు చేసుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. సాధారణంగా ఇఎంఐలు (EMIs) సకాలంలో చెల్లించకపోవడం, క్రెడిట్ స్కోరు తగ్గడం వల్లే బ్యాంకులు లోన్ ఇవ్వడానికి నిరాకరిస్తాయి. ఆదాయానికి మించి అప్పులు ఉండటం (డెట్-టు-ఇన్‌కమ్ రేషియో) కూడా మరొక ప్రధాన కారణం. సంపాదనలో ఎక్కువ భాగం పాత అప్పులకే పోతుంటే, కొత్త లోన్ తీర్చగలరా లేదా అని బ్యాంకులు ఆందోళన చెందుతాయి," అని పేమీ (PayMe) వ్యవస్థాపకుడు, సీఈఓ మహేష్ శుక్లా వివరించారు.

"కాగితాల సబ్మిషన్‌లో లోపాలు ఉండటం కూడా దరఖాస్తులు నిలిచిపోవడానికి కారణమవుతోంది. సాంప్రదాయ రుణ ప్రక్రియలో డాక్యుమెంటేషన్ చాలా కీలకం. ఒక్క పత్రం తక్కువైనా, సంతకం పెట్టకపోయినా లేదంటే వివరాలు తప్పుగా ఉన్నా లోన్ రాదు. అలాగే ఉద్యోగాలు తరచూ మారడం, స్థిరమైన ఆదాయం లేకపోవడం వల్ల కూడా బ్యాంకులు వెనకడుగు వేస్తాయి" అని మహేష్ శుక్లా జోడించారు.

లోన్ తిరస్కరణకు దారితీసే 5 ప్రధాన కారణాలు

1. తక్కువ క్రెడిట్ స్కోరు

మీ నెలవారీ ఆదాయంలో సింహభాగం ఇప్పటికే ఉన్న లోన్లు, ఇతర అప్పుల ఈఎంఐలకే సరిపోతుంటే, బ్యాంకులు కొత్తగా అప్పు ఇవ్వవు. అలాంటి ప్రొఫైల్‌ను రిస్క్‌గా భావిస్తాయి.

3. అసంపూర్తిగా ఉన్న డాక్యుమెంట్లు

ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్.. ఏ పద్ధతిలో అప్లై చేసినా వివరాలు ఖచ్చితంగా ఉండాలి. పాన్ కార్డ్ (PAN) వివరాలు తప్పుగా రాయడం, పేరు స్పెల్లింగ్ తప్పులు, సరిపోలని సంతకాలు వంటి చిన్న పొరపాట్లు కూడా లోన్ రిజెక్షన్‌కు దారితీస్తాయి.

4. స్థిరమైన ఉద్యోగం, ఆదాయం లేకపోవడం:

ఉద్యోగాలు తరచూ మారడం లేదా ఆదాయంలో స్థిరత్వం లేకపోతే లోన్ సకాలంలో తీర్చలేరని బ్యాంకులు భావిస్తాయి. సరైన సంపాదన రికార్డు లేకపోతే లోన్ తిరస్కరించడం లేదా ఎక్కువ వడ్డీ రేట్లకు ఇవ్వడం జరుగుతుంది.

5. స్వల్ప వ్యవధిలో ఎక్కువ లోన్ల కోసం అప్లై చేయడం

వైద్య అత్యవసరాలు లేదా పిల్లల చదువుల కోసం కంగారులో ఒకేసారి నాలుగైదు బ్యాంకులు లేదా యాప్స్‌లో లోన్ కోసం దరఖాస్తు చేస్తుంటారు. దీనివల్ల క్రెడిట్ ప్రొఫైల్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ప్రతి అప్లికేషన్ వల్ల క్రెడిట్ బ్యూరోలో 'హార్డ్ ఎంక్వైరీ' (Hard Inquiry) నమోదవుతుంది. ఇది మీ ఆర్థిక అవసరాన్ని లేదా 'క్రెడిట్ హంగర్'ను సూచిస్తుంది.

పరిష్కార మార్గాలు - లోన్ అప్రూవల్ పెంచుకోండిలా

"లోన్ రిజెక్ట్ అయిన ప్రతి కారణం మనల్ని సరైన మార్గంలో పెట్టే గైడ్‌లాంటిదే తప్ప అది ముగింపు కాదు. క్రమం తప్పకుండా క్రెడిట్ రిపోర్ట్ తనిఖీ చేసుకుంటూ తప్పులుంటే సరిదిద్దుకోవాలి. కొత్త లోన్ కోసం అప్లై చేసే ముందే పాత అప్పులను వీలైనంత వరకు తీర్చేయాలి. డాక్యుమెంట్లు అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. తక్కువ వ్యవధిలో ఎక్కువ చోట్ల దరఖాస్తు చేయకూడదు. క్రమశిక్షణతో కూడిన అడుగులు వేస్తే ప్రతి ఒక్కరికీ ఆర్థిక సాయం అందుతుంది" అని మహేష్ శుక్లా స్పష్టం చేశారు.

సంక్షిప్తంగా చెప్పాలంటే, పర్సనల్ లోన్ తిరస్కరణను ఒక ఎదురుదెబ్బగా భావించకుండా, మీ ఆర్థిక ప్రొఫైల్‌ను బలోపేతం చేసుకునే అవకాశంగా చూడాలి. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించడం, అర్హత ప్రమాణాలను అర్థం చేసుకోవడం, బాధ్యతాయుతంగా అప్పులను నిర్వహించడం ద్వారా భవిష్యత్తులో లోన్ అప్రూవల్ పొందే అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe