భారతీయ డిజిటల్ చెల్లింపుల రంగంలో ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం 'ఫోన్‌పే' భారీ విప్లవానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు కేవలం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకే పరిమితమైన యూపీఐ సేవలను, ఇప్పుడు సాధారణ కీప్యాడ్ (ఫీచర్) ఫోన్ ఉపయోగిస్తున్న కోట్ల మంది గ్రామీణ, సామాన్య ప్రజలకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఫోన్‌పే యూపీఐ 123పే’ పేరుతో ఈ నూతన సేవలను ప్రారంభించింది. దీని ద్వారా ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా క్షణాల్లో డిజిటల్ లావాదేవీలు పూర్తి చేయవచ్చు.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ లక్షలాది మంది ఇంటర్నెట్ లేని సాధారణ కీప్యాడ్ ఫోన్లనే ఉపయోగిస్తున్నారు. కాగా 2జీ నెట్‌వర్క్ సరిగ్గా లేని మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో ఈ సాంకేతికత డిజిటల్ లావాదేవీల స్వరూపాన్నే మార్చనుంది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 20 కోట్ల మంది ఫీచర్ ఫోన్ వినియోగదారులకు థర్డ్ పార్టీ యాప్ ద్వారా యూపీఐ అందించిన మొదటి సంస్థగా ఫోన్‌పే రికార్డు సృష్టించింది.
ప్రముఖ ఫోన్ కంపెనీలతో భాగస్వామ్యం..
ఈ సేవలను ప్రజలకు మరింత సులభంగా చేరవేసేందుకు నోకియా, హెచ్‌ఎమ్‌డీ, లావా, ఐటెల్ వంటి ప్రముఖ ఫోన్ తయారీ సంస్థలతో ఫోన్‌పే ఒప్పందం కుదుర్చుకుంది. ఇకపై ఈ కంపెనీల ఫీచర్ ఫోన్లలో ఫోన్‌పే యాప్ ముందే ఇన్‌స్టాల్ అయి వస్తుంది.
"ఫోన్‌పే యూపీఐ 123పే ద్వారా సాధారణ ఫోన్ వినియోగదారులకు కూడా డిజిటల్ చెల్లింపుల ప్రయోజనాలు అందుతాయి. దేశంలోని ప్రతీ మూలకు ఈ సేవలను విస్తరించడమే మా లక్ష్యం," అని ఫోన్‌పే వ్యవస్థాపకుడు, సీఈఓ సమీర్ నిగమ్ తెలిపారు. రాబోయే రోజుల్లో మరో 30 కోట్ల మంది నూతన వినియోగదారులను డిజిటల్ చెల్లింపుల పరిధిలోకి తేవడమే తమ ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.
కీప్యాడ్ ఫోన్లలో లభించే సేవలు..
ఫోన్‌పే 123పే ద్వారా వినియోగదారులు అనేక రకాల సేవలను ఉపయోగించుకోవచ్చు:
- ఒకరి ఖాతా నుంచి మరొకరి ఖాతాకు (పీ2పీ) నేరుగా డబ్బు పంపడం.
- వ్యాపారులకు, దుకాణదారులకు (పీ2ఎం) సులభంగా చెల్లింపులు చేయడం.
- కెమెరా ఉన్న ఫీచర్ ఫోన్ల ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు చెల్లించడం.
- బ్యాంక్ ఖాతా వివరాల నిర్వహణ, ఖాతాలో మిగిలిన డబ్బుల (బ్యాలెన్స్) వివరాలు తెలుసుకోవడం.
- గతంలో జరిపిన లావాదేవీల జాబితా తనిఖీ చేయడం.
- ఏఐ వాయిస్ అసిస్టెంట్‌తో సులభమైన నమోదు
ఫోన్‌పే 123పే ద్వారా వినియోగదారులు అనేక రకాల సేవలను ఉపయోగించుకోవచ్చు:
- ఒకరి ఖాతా నుంచి మరొకరి ఖాతాకు (పీ2పీ) నేరుగా డబ్బు పంపడం.
- వ్యాపారులకు, దుకాణదారులకు (పీ2ఎం) సులభంగా చెల్లింపులు చేయడం.
- కెమెరా ఉన్న ఫీచర్ ఫోన్ల ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు చెల్లించడం.
- బ్యాంక్ ఖాతా వివరాల నిర్వహణ, ఖాతాలో మిగిలిన డబ్బుల (బ్యాలెన్స్) వివరాలు తెలుసుకోవడం.
- గతంలో జరిపిన లావాదేవీల జాబితా తనిఖీ చేయడం.
- ఏఐ వాయిస్ అసిస్టెంట్‌తో సులభమైన నమోదు
తొలిసారిగా డిజిటల్ చెల్లింపులు చేసేవారికి అవగాహన కల్పించేందుకు ఫోన్‌పే ఒక కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత వాయిస్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. ఇది ఇంగ్లీషుతో పాటు తెలుగు సహా 12 భారతీయ భాషల్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసేలా వినియోగదారులకు మార్గదర్శనం చేస్తుంది. త్వరలోనే ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా కరెంట్ బిల్లులు, రీఛార్జీలు, ఆధార్ ఆధారిత ఆన్‌బోర్డింగ్ సేవలను కూడా అందించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఫోన్‌పేకి 71.5 కోట్లకు పైగా రిజిస్టర్డ్ వినియోగదారులు, 5 కోట్లకు పైగా వ్యాపార భాగస్వాములు ఉన్నారు.
ఈ సేవను ప్రారంభించడం ఎలా?
ఫోన్‌పే 123పే ఉపయోగించడానికి పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు:
- ఫోన్‌లో ముందే ఉండే ఫోన్‌పే యాప్‌ను ఓపెన్ చేసి, నిబంధనలకు అంగీకరించి మీ బ్యాంక్‌ను ఎంచుకోవాలి.
- రిజిస్ట్రేషన్ కోసం మీ డెబిట్ కార్డ్ చివరి 6 అంకెలు, గడువు తేదీ నమోదు చేయాలి.
- కొత్తగా యూపీఐ పిన్ క్రియేట్ చేసుకుంటే మీ యూపీఐ ఐడీ యాక్టివేట్ అవుతుంది.
- డబ్బులు పంపేందుకు కాంటాక్ట్ నంబర్ లేదా యూపీఐ ఐడీ ఎంచుకుని, మొత్తాన్ని నమోదు చేసి పిన్ ఎంటర్ చేస్తే ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది.
- కెమెరా ఉన్న ఫోన్ అయితే, 'స్కాన్ అండ్ పే' ఆప్షన్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా డబ్బులు పంపవచ్చు.