Air Conditioners for home : వేసవి వచ్చేసింది- 2026 బెస్ట్ ఎయిర్ కండీషనర్స్ లిస్ట్ ఇదిగో..
భారతదేశంలో వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఏసీ అనేది ఇప్పుడు విలాసం కాదు, ఒక అత్యవసర గృహోపకరణంగా మారింది. మెరుగైన విద్యుత్ ఆదా, నిశ్శబ్ద పనితీరు, స్మార్ట్ కంట్రోల్స్‌తో 2026లో మార్కెట్లో ఉన్న టాప్-5 ఏసీల లిస్ట్‌ని ఇక్కడ చూసేయండి..
ఎండా కాలం వచ్చేసింది! వారం రోజుల ముందు వరకు చల్లటి వాతావరణంలో ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఇప్పుడు భానుడి భగభగలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరి ఈ వేసవి కాలంలో మీ ఇంట్లోకి మంచి ఏసీ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఆధునిక గృహాలకు సరిపోయే కొన్ని అత్యుత్తమ మోడళ్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
1. ఎల్‌జీ 1.5 టన్ స్మార్ట్ ఇన్వర్టర్ స్ల్పిట్ ఏసీ..
మధ్యస్థ పరిమాణ గదుల కోసం రూపొందించిన ఈ ఏసీ, వేగవంతమైన కూలింగ్, తక్కువ విద్యుత్ వినియోగంపై దృష్టి పెడుతుంది.
ముఖ్య ఫీచర్లు: ఇందులో 'ఏఐ కన్వర్టిబుల్ 6-ఇన్-1' కూలింగ్ ఉంది, ఇది గదిలోని వేడిని బట్టి కెపాసిటీని అడ్జెస్ట్ చేస్తుంది. 55°సీ ఉష్ణోగ్రత వద్ద కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది.
గాలి నాణ్యత: హెచ్డీ ఫిల్టర్, యాంటీ-వైరస్ ప్రొటెక్షన్ గాలిని శుద్ధి చేస్తాయి.
మన్నిక: ఓషన్ బ్లాక్ ప్రొటెక్షన్‌తో కూడిన కాపర్ కండెన్సర్ కాయిల్స్ తుప్పు పట్టకుండా దీర్ఘకాలం మన్నుతాయి.
అమెజాన్ కస్టమర్ల అభిప్రాయం: కూలింగ్, విద్యుత్ ఆదాపై ప్రశంసలు ఉన్నాయి. అయితే, కొంతమంది ఇన్‌స్టాలేషన్- కాపర్ పైపులు అందకపోవడం గురించి ఫిర్యాదు చేశారు.
ఎందుకు ఎంచుకోవాలి?: శక్తివంతమైన కూలింగ్, మన్నికైన బిల్డ్ క్వాలిటీ కోసం దీనిని ఎంచుకోవచ్చు.
2. శాంసంగ్ బెస్‌పోక్ ఏఐ ఇన్వర్టర్ స్ల్పిట్ ఏసీ..
స్మార్ట్ టెక్నాలజీ, విద్యుత్ ఆప్టిమైజేషన్ కలయికతో ఈ ఏసీని రూపొందించారు.
ముఖ్య ఫీచర్లు: 'ఏఐ ఎనర్జీ మోడ్' ద్వారా విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఇందులో 5-స్టెప్ కన్వర్టిబుల్ కూలింగ్ ఉంది.
స్మార్ట్ ఫీచర్లు: వై-ఫై కనెక్టివిటీ, వాయిస్ కంట్రోల్, SmartThings ఇంటిగ్రేషన్ దీని ప్రత్యేకత.
అమెజాన్ కస్టమర్ల అభిప్రాయం: బిల్డ్ క్వాలిటీ, స్మార్ట్ ఫీచర్లు బాగున్నాయని కొనుగోలుదారులు చెబుతున్నారు. కొందరు కూలింగ్ కాస్త ఆలస్యంగా అవుతుందని పేర్కొన్నారు.
ఎందుకు ఎంచుకోవాలి?: ఆధునిక స్మార్ట్ హోమ్ కనెక్టివిటీ, ఏఐ ఫీచర్లు కోరుకునే వారికి ఇది ఉత్తమం.
3. ఎల్‌జీ ఎసెన్షియల్ సిరీస్ 0.8 టన్ స్మార్ట్ ఇన్వర్టర్ స్ల్పిట్ ఏసీ..
చిన్న గదులు, చిన్న అపార్ట్‌మెంట్‌లకు ఇది సరైన ఎంపిక.
ముఖ్య ఫీచర్లు: అత్యంత వేడి ఉన్నప్పుడు క్విక్ కూలింగ్ కోసం 'విరాట్ మోడ్' ఇందులో ఉంది. ఇది నిశ్శబ్దంగా పనిచేస్తుంది.
అమెజాన్ కస్టమర్ల అభిప్రాయం: నిశ్శబ్ద పనితీరు, తక్కువ విద్యుత్ ఖర్చుపై ప్రశంసలు ఉన్నాయి. అయితే కూలింగ్ నెమ్మదిగా ఉందనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.
ఎందుకు ఎంచుకోవాలి?: పరిమిత స్థలం ఉన్న గదుల్లో సమర్థవంతమైన ఇన్వర్టర్ టెక్నాలజీ కోసం దీనిని ఎంచుకోవచ్చు.
4. లాయిడ్ 0.8 టన్ ఇన్వర్టర్ స్ల్పిట్ ఏసీ..
తక్కువ ధరలో ఫ్లెక్సిబుల్ కూలింగ్ కోరుకునే వారి కోసం ఇది రూపొందించారు.
ముఖ్య ఫీచర్లు: ఇది 52°సీ ఎండలో కూడా చల్లదనాన్ని ఇస్తుంది. పీఎం2.5, యాంటీ-వైరల్ ఫిల్టర్ల వల్ల గాలి శుభ్రంగా ఉంటుంది.
మన్నిక: గోల్డెన్ ఫిన్స్‌తో కూడిన కాపర్ కండెన్సర్ మెయింటెనెన్స్‌ను తగ్గిస్తుంది.
అమెజాన్ కస్టమర్ల అభిప్రాయం: తక్కువ ధరలో మంచి నాణ్యత ఉందని కొనుగోలుదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకు ఎంచుకోవాలి?: అఫోర్డబుల్ ప్రైసింగ్, ఎయిర్ ప్యూరిఫికేషన్ ఫిల్టర్ల కోసం దీనిని తీసుకోవచ్చు.
5. గోద్రేజ్ 1.5 టన్ ఏఐ పవర్డ్ ఇన్వర్టర్ స్ల్పిట్ ఏసీ..
ఇంటెలిజెంట్ టెంపరేచర్ కంట్రోల్, ఎనర్జీ సేవింగ్ దీని ప్రధాన లక్షణాలు.
ముఖ్య ఫీచర్లు: 5-ఇన్-1 కన్వర్టిబుల్ కూలింగ్, ఐ-సెన్స్ టెక్నాలజీ, సెల్ఫ్-క్లీనింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఇది 52°సీ వద్ద కూడా పనిచేస్తుంది.
అమెజాన్ కస్టమర్ల అభిప్రాయం: వ్యాల్యూ ఫర్ మనీ, బిల్డ్ క్వాలిటీ బాగుందని యూజర్లు చెబుతున్నారు. అయితే ఫ్యాన్ శబ్దం కొంత ఎక్కువగా ఉందనే అభిప్రాయం ఉంది.
ఎందుకు ఎంచుకోవాలి?: శక్తివంతమైన కూలింగ్, ఎక్స్టెండెడ్ వారంటీ కోసం దీనిని ఎంచుకోవచ్చు.
ఏసీ కొనేముందు తెలుసుకోవాల్సిన విషయాలు-
1. 2026లో ఇన్వర్టర్ టెక్నాలజీ ఎంతవరకు ముఖ్యం?
ఇన్వర్టర్ ఏసీలు ఇప్పుడు ప్రామాణికంగా మారాయి. ఇవి గది కూలింగ్ అవసరానికి అనుగుణంగా కంప్రెసర్ వేగాన్ని అడ్జెస్ట్ చేస్తాయి. దీనివల్ల విద్యుత్ ఆదా అవ్వడమే కాకుండా, ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది, శబ్దం తక్కువగా వస్తుంది.
2. మీ ఇంటికి ఏ కెపాసిటీ (టన్ను) ఏసీ సరిపోతుంది?
చిన్న బెడ్ రూమ్స్: 1 టన్ సరిపోతుంది.
మధ్యస్థ గదులు: 1.5 టన్ అనువైనది.
పెద్ద హాల్ లేదా లివింగ్ రూమ్స్: 2 టన్ ఏసీ అవసరమవుతుంది.
సరిగ్గా గది సైజును బట్టి కెపాసిటీని ఎంచుకుంటే కంప్రెసర్‌పై భారం పడదు.
3. పాత మోడళ్ల కంటే కొత్త ఏసీలు మెరుగైనవేనా?
అవును. ఆధునిక ఏసీల్లో మెరుగైన ఇన్వర్టర్ కంప్రెసర్లు, అడ్వాన్స్‌డ్ ఫిల్ట్రేషన్ సిస్టమ్స్ (గాలిని శుద్ధి చేసేవి), స్మార్ట్ కంట్రోల్స్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇవి పాత మోడళ్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ కూలింగ్‌ను ఇస్తాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


