భారతదేశంలో టూ-వీలర్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు 'హోండా యాక్టివా'. దశాబ్దాలుగా తిరుగులేని అమ్మకాలతో దూసుకుపోతున్న ఈ స్కూటర్.. అనేకసార్లు హీరో స్ల్పెండర్ని సైతం వెనక్కి నెట్టి దేశంలోనే నంబర్ వన్ టూ-వీలర్‌గా నిలిచింది. హోండా సంస్థను భారత మార్కెట్లో రెండో స్థానంలో నిలబెట్టడంలో యాక్టివా పాత్ర అత్యంత కీలకం.

ప్రస్తుతం హోండా యాక్టివా శ్రేణిలో పెట్రోల్ వెర్షన్లయిన యాక్టివా 6జీ, యాక్టివా 125తో పాటు ఎలక్ట్రిక్ వెర్షన్ యాక్టివా ఈ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రీమియం మోడల్ అయిన 'యాక్టివా 125'లో డీఎల్ఎక్స్, హెచ్-స్మార్ట్ అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. ఇందులో టాప్ ఎండ్ మోడల్ అయిన హెచ్-స్మార్ట్ ధర రూ. 94,096 (ఎక్స్-షోరూమ్) గా ఉంది.
మీరు ఈ స్కూటర్‌ను ఫైనాన్స్‌లో తీసుకోవాలనుకుంటే, నెలకు ఎంత ఈఎంఐ పడుతుందో పూర్తి విశ్లేషణ ఇక్కడ చూడండి:
| హోండా యాక్టివా 125: నెలవారీ ఈఎంఐ లెక్కలు | |||||
|---|---|---|---|---|---|
| ధర (ఎక్స్‌షోరూం) | లోన్ (100శాతం ఎక్స్‌షోరూం) | వడ్డీ రేటు | రీపేమెంట్ వ్యవధి | నెలవారీ ఈఎంఐ | మొత్తం వడ్డీ |
| రూ. 94,096 | రూ. 94,096 | 9% | 12 నెలలు | రూ. 8,229 | రూ. 4,650 |
| 24 నెలలు | రూ. 4,299 | రూ. 9,074 | |||
అంటే.. ఎక్స్‌షోరూం ధర మొత్తానికి (రూ. 94.096) లోన్ తీసుకుంటే, 9శాతం వడ్డీ చొప్పున, 12 నెలల టెన్యూర్‌లో మీరు ప్రతి నెల రూ. 8229 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అదే 24 నెలల ఈఎంఐ పెట్టుకుంటే, ప్రతి నెల రూ. 4,299 కట్టాల్సి ఉంటుంది.
Skoda March 2026 Offers : స్కోడా కార్లపై రూ. 5లక్షల వరకు ఆఫర్లు! త్వరపడండి..
గమనించాల్సిన ముఖ్య విషయాలు:
{{/usCountry}}Skoda March 2026 Offers : స్కోడా కార్లపై రూ. 5లక్షల వరకు ఆఫర్లు! త్వరపడండి..
గమనించాల్సిన ముఖ్య విషయాలు:
{{/usCountry}}పైన పేర్కొన్న ఈఎంఐ వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వాస్తవానికి ఈఎంఐ మొత్తం కింది కారణాల వల్ల మారవచ్చు:
డౌన్ పేమెంట్: మీరు ఎంత ఎక్కువ నగదు ముందుగా చెల్లిస్తే, లోన్ అమౌంట్ అంత తగ్గుతుంది, తద్వారా ఈఎంఐ భారం తగ్గుతుంది.
వడ్డీ రేటు: బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు మీ క్రెడిట్ స్కోర్‌ను బట్టి వడ్డీ రేటును మారుస్తుంటాయి. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే మీ మీద అధిక వడ్డీ రేటు భారం పడే అవకాశం లేకపోలేదు. క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే, మీకు బార్గైన్ చేసేందుకు మంచి అవకాశం ఉంటుంది.
లోన్ కాలపరిమితి: మీరు తీసుకునే కాలపరిమితిని బట్టి వడ్డీ, ఈఎంఐ మారుతాయి.
హోండా యాక్టివా 125 హెచ్- స్మార్ట్ ఫీచర్స్..
ఈ స్కూటర్లో స్మార్ట్ కీ- విత్ హెచ్ స్మార్ట్ టెక్నాలజీ ఉంది. ఇందులో టీఎఫ్టీ స్క్రీన్ డిస్ప్లే కూడా ఉంది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కోసం హోండా రోడ్ సింక్ ఫెసిలిటీ కూడా ఉంది. ఓపెన్ గ్లోవ్ బాక్స్‌లో 15డబ్ల్యూ యూఎస్బీ టైప్-సీ పోర్టుతో వస్తోంది ఈ హోడా యాక్టివా 125 వేరియంట్.
ఫ్రెంట్ అండ్ రేర్ అలాయ్ వీల్స్, ఐడ్లింగ్ స్టాప్ సిస్టెమ్, ఫ్యూయెల్- ఎఫీషియెంట్ ట్యూబ్‌లెస్ టైర్లు దీని సొంతం.