భారతదేశంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఐకానిక్ ఎస్‌యూవీ 'టాటా సియెర్రా ఈవీ' ఇటీవలే అధికారికంగా మార్కెట్లోకి విడుదలైంది. రూ. 18.79 లక్షల ప్రారంభ ధరతో వచ్చిన ఈ క్రేజీ ఎలక్ట్రిక్ కారును లోన్‌పై కొనాలనుకుంటే, నెలకు ఎంత ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది? ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
టాటా సియెర్రా ఈవీ- వేరియంట్లు, ధరల వివరాలు..

టాటా సియెర్రా ఈవీ మొత్తం 5 ప్రధాన వేరియంట్లలో లభిస్తుంది: ప్యూర్, ప్యూర్ ఎస్, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్ ఏ. ఇందులో కస్టమర్ల కోసం 63 kWh, 75 kWh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లతో పాటు.. రియర్-వీల్ డ్రైవ్ (ఆర్డబ్ల్యూడీ), ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ/ క్యూడబ్ల్యూడీ) ఆప్షన్లను టాటా మోటార్స్ అందించింది. దీని ఎక్స్-షోరూమ్ ధరలు వేరియంట్‌ను బట్టి రూ. 18.79 లక్షల నుంచి రూ. 25.99 లక్షల వరకు ఉన్నాయి.
టాటా సియెర్రా ఈవీ- లోన్, ఈఎంఐ క్యాలిక్యులేషన్..
మీరు ఈ టాటా సియెర్రా ఎలక్ట్రిక్ కారును ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేయాలనుకుంటే, బేస్ వేరియంట్, టాప్ వేరియంట్లకు అయ్యే సుమారు నెలవారీ ఈఎంఐ అంచనా కింద ఇవ్వడం జరిగింది.
(గమనిక: ఈ లెక్కింపు కోసం ఎక్స్-షోరూమ్ ధరపై 100% లోన్ తీసుకున్నట్లు, బ్యాంక్ వడ్డీ రేటును 9.5% గా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది).
| టాటా సియెర్రా ఈవీ- నెలవారీ ఈఎంఐ లెక్కలు | |||||
|---|---|---|---|---|---|
| మోడల్- వేరియంట్ | ఎక్స్‌షోరూం ధర (రూ.) | లోన్ (ఎక్స్‌షోరూం ధర మీద 100శాతం) | వడ్డీ రేటు | రీపేమెంట్ టన్యూర్ (నెలల్లో) | నెలవారీ ఈఎంఐ (రూ.) |
| Tata Sierra EV Pure 63 | 18.79 లక్షలు | 18.79 లక్షలు | 9.5% | 24 | 86,273 |
| 36 | 60,190 | ||||
| 48 | 47,206 | ||||
| Tata Sierra EV Empowered S 75 QWD | 25.99 లక్షలు | 25.99 లక్షలు | 24 | 119,332 | |
| 36 | 83,254 | ||||
| 48 | 65,295 | ||||
1. బేస్ వేరియంట్: ప్యూర్ 63
ఎక్స్-షోరూమ్ ధర: రూ. 18.79 లక్షలు
- 2 ఏళ్ల టెన్యూర్ (24 నెలలు): నెలకు సుమారు రూ. 86,273 కట్టాలి.
- 3 ఏళ్ల టెన్యూర్ (36 నెలలు): నెలకు సుమారు రూ. 60,165 కట్టాలి.
- 4 ఏళ్ల టెన్యూర్ (48 నెలలు): నెలకు సుమారు రూ. 47,206 కట్టాలి.
ఎక్స్-షోరూమ్ ధర: రూ. 18.79 లక్షలు
- 2 ఏళ్ల టెన్యూర్ (24 నెలలు): నెలకు సుమారు రూ. 86,273 కట్టాలి.
- 3 ఏళ్ల టెన్యూర్ (36 నెలలు): నెలకు సుమారు రూ. 60,165 కట్టాలి.
- 4 ఏళ్ల టెన్యూర్ (48 నెలలు): నెలకు సుమారు రూ. 47,206 కట్టాలి.
2. టాప్ వేరియంట్: ఎంపవర్డ్ 75 క్యూడబ్ల్యూడీ
ఎక్స్-షోరూమ్ ధర: రూ. 25.99 లక్షలు
- 2 ఏళ్ల టెన్యూర్ (24 నెలలు): నెలకు సుమారు రూ. 1,19,332 కట్టాలి.
- 3 ఏళ్ల టెన్యూర్ (36 నెలలు): నెలకు సుమారు రూ. 83,222 కట్టాలి.
- 4 ఏళ్ల టెన్యూర్ (48 నెలలు): నెలకు సుమారు రూ. 65,295 కట్టాలి.
ముఖ్య గమనిక: పైన పేర్కొన్న నెలవారీ ఈఎంఐ విలువలు కేవలం ఒక ప్రాథమిక అంచనా మాత్రమే. మీరు చెల్లించే డౌన్ పేమెంట్, తీసుకునే లోన్ మొత్తం, మీ సిబిల్ స్కోర్ ఆధారంగా బ్యాంకులు ఆఫర్ చేసే వడ్డీ రేటు, టెన్యూర్ మారితే ఈ నెలవారీ ఈఎంఐ మొత్తంలో మార్పులు ఉంటాయి. అలాగే కారు ఆన్-రోడ్ ధరలో పన్నులు, ఇన్సూరెన్స్ అదనంగా ఉంటాయి.