...
...
Next Story

Ather Rizta : 3 లక్షల మంది ఈ ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ని ఎందుకు కొన్నారు? 5 కారణాలు..

ఏథర్​ రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ప్రస్తుతం మార్కెట్​లో లభిస్తున్న ఈ వాల్యూ-ఫర్-మనీ ఫ్యామిలీ ఈవీని కొనుగోలు చేయాలనుకునే వారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన 5 విషయాలు ఇవే..

Published on: May 21, 2026, 05:35:47 IST
Advertisement

భారతదేశ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్​లో ఏథర్ ఎనర్జీ స్పోర్టీ లుక్ ఉన్న 450 సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, సామాన్య కుటుంబాలకు సరిపోయేలా ప్రాక్టికల్ డిజైన్, బడ్జెట్ ధరతో ఏప్రిల్ 2024లో లాంచ్ చేసిన ‘ఏథర్ రిజ్టా’.. బ్రాండ్ దశనే మార్చేసింది. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే 3 లక్షల మంది కస్టమర్లు ఈ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేశారు. రూ. 1.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లభించే ఈ ఈ-స్కూటర్ కొనే ముందు తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు ఇక్కడ చూద్దాము..

ఏథర్​ రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ కొనే ముందు ఇవి తెలుసుకోండి..

  1. రెండు బ్యాటరీలు - మూడు వేరియంట్లు:

ఏథర్​ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్..
ఏథర్​ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్..

ఏథర్ రిజ్టా మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తోంది. అవి: రిజ్టా ఎస్​, రిజ్టా జెడ్ 2.9 కేడబ్ల్యూహెచ్, రిజ్టా జెడ్ 3.7 కేడబ్ల్యూహెచ్ (టాప్ ఎండ్).

2.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ: ఇది రిజ్టా ఎస్​, రిజ్టా జెడ్ వేరియంట్లలో వస్తుంది. ఇది 123 కిమీల ఐడీసీ రేంజ్‌ని క్లెయిమ్ చేస్తున్నప్పటికీ, రియల్ వరల్డ్ రైడింగ్ మోడ్స్‌ను బట్టి 80 నుంచి 105 కిమీల మైలేజ్ ఇస్తుంది.

3.7 కేడబ్లూహెచ్ బ్యాటరీ: ఇది కేవలం టాప్ వేరియంట్ రిజ్టా జెడ్​లో మాత్రమే లభిస్తుంది. దీని ఐడీసీ రేంజ్ 159 కిమీలు కాగా, రియల్ వరల్డ్ రేంజ్ సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 100 నుంచి 125 కిమీల వరకు ఉంటుంది.

2. గేమ్ చేంజర్ 'ప్రో ప్యాక్'..

ఏథర్ సంస్థ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పాటు అదనంగా 'ప్రో ప్యాక్'ను ఆఫర్ చేస్తోంది. దీనికోసం వేరియంట్‌ను బట్టి రూ. 14,000 నుంచి రూ. 20,000 వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రో ప్యాక్ ద్వారా స్కూటర్ డాష్‌బోర్డ్‌పై గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, హిల్ హోల్డ్ కంట్రోల్, స్కిడ్ కంట్రోల్ (ట్రాక్షన్ కంట్రోల్), మ్యాజిక్ ట్విస్ట్ (రీజెనరేటివ్ బ్రేకింగ్) వంటి ఎన్నో స్మార్ట్ ఫీచర్లు అన్‌లాక్ అవుతాయి. అంతేకాకుండా, ప్రో ప్యాక్ ఎంచుకుంటే బ్యాటరీ వారంటీ కూడా పెరుగుతుంది.

ఏథర్ 450ఎక్స్ లాగా రిజ్టా హై-పర్ఫార్మెన్స్ స్కూటర్ కాదు. ఇది కేవలం ఆఫీస్, ఇల్లు, మార్కెట్ వంటి రోజువారీ అవసరాల కోసం డిజైన్ చేసిన బెస్ట్​ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇందులో 4.3 కేడబ్ల్యూ పీఎంఎస్​ఎం మోటార్‌ను అమర్చారు. ఇది 3.7 సెకన్లలో 0 నుంచి 40 కిమీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 80 కిమీ మాత్రమే. స్మూత్ పవర్ డెలివరీ, ఎక్కువ రేంజ్ ఇవ్వడం కోసమే ఏథర్ దీని స్పీడ్‌ను కాస్త తగ్గించింది.

4. బెస్ట్ ఇన్ క్లాస్ బ్యాటరీ వారంటీ..

సాధారణంగా మార్కెట్​లో ఎలక్ట్రిక్ స్కూటర్లపై 3 ఏళ్లు లేదా 30,000 కిమీల వారంటీ ఇస్తారు. కానీ ఏథర్ రిజ్టా కొంటూ 'ప్రో ప్యాక్' తీసుకునే వారికి ఏకంగా 5 ఏళ్లు లేదా 60,000 కిమీల పొడిగించిన వారంటీ లభిస్తుంది. అంతేకాకుండా కస్టమర్లు కావాలనుకుంటే ఆప్షనల్ కింద ఈ వారంటీని ఏకంగా 8 ఏళ్లు లేదా 80,000 కిమీల వరకు పెంచుకునే సదుపాయాన్ని ఏథర్ కల్పిస్తోంది. ఇది కస్టమర్లకు పెద్ద ఊరటనిచ్చే అంశం.

5. ప్రాక్టికాలిటీ, స్పేస్​కి ప్రాధాన్యత:

ఫ్యామిలీ రైడర్ల కోసం ఈ స్కూటర్‌లో స్పేస్‌కు పెద్ద పీట వేశారు. ఇందులో ఏకంగా 900 మిమీ పొడవైన ఫ్లాట్ సీటు ను అందించారు, ఇది సెగ్మెంట్‌లోనే అతిపెద్ద సీటు. సీటు ఎత్తు (780 ఎంఎం) తక్కువగా ఉండటం వల్ల రైడింగ్ చాలా సులభంగా ఉంటుంది. లగేజ్ కోసం ఇందులో మొత్తం 56-లీటర్ల భారీ స్టోరేజ్ కెపాసిటీ ఉంది. ఇందులో సీటు కింద 34-లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్, ముందు భాగంలో 22-లీటర్ల ఫ్రంట్ యాక్సెసరీ ఫ్రంక్ బాక్స్ ఉన్నాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks