...
...
Next Story

PM Kisan 23rd Installment : జూన్ 20న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు.. మీ పేరు చెక్ చేసుకోండిలా!

PM Kisan 23rd Installment : పీఎం కిసాన్ 23వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం జూన్ 20న విడుదల చేయనుంది. ప్రధాని మోదీ రూ. 2,000 రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Published on: Jun 17, 2026, 18:10:38 IST
Advertisement

దేశంలోని కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వ్యవసాయ పెట్టుబడి సహాయం కోసం ఎదురుచూస్తున్న అన్నదాతల ఖాతాల్లోకి పీఎం-కిసాన్ సమృద్ధి నిధులు చేరేందుకు ముహూర్తం ఖరారైంది. జూన్ 20వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పీఎం-కిసాన్ (PM-Kisan Samman Nidhi) పథకం కింద 23వ విడత నిధులను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్‌లో జరగనున్న భారీ బహిరంగ సభ వేదికగా ప్రధాని ఈ నిధుల విడుదలకు శ్రీకారం చుట్టనున్నారు.

పీఎం కిసాన్ నిధులపై అప్డేట్
పీఎం కిసాన్ నిధులపై అప్డేట్

ఈ విడతలో అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి రూ. 2,000 చొప్పున డీబీటీ ద్వారా లబ్ధి చేకూరనుంది. కాగా, చిన్న, సన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని కింద ఏటా మూడు విడతల్లో రూ. 2 వేల చొప్పున మొత్తం రూ. 6,000 పెట్టుబడి సాయాన్ని కేంద్రం అందిస్తోంది.

మీ పేరుందో లేదో ఇలా తెలుసుకోండి

పీఎం కిసాన్ వెబ్‌సైట్ ద్వారా మీ గ్రామానికి సంబంధించిన లబ్ధిదారుల లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో సులభంగా చెక్ చేసుకోవచ్చు. దానికోసం ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వండి:

మొదట పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ https://pmkisan.gov.in/ ను సందర్శించండి.

హోమ్ పేజీలో కుడివైపున ఉండే ‘Beneficiary List’ (లబ్ధిదారుల జాబితా) ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

ఇప్పుడు ఓపెన్ అయ్యే కొత్త పేజీలో మీ రాష్ట్రం, జిల్లా, సబ్-జిల్లా/బ్లాక్ మరియు మీ గ్రామం (Village) వివరాలను ఎంచుకోండి.

వివరాలన్నీ ఎంటర్ చేశాక 'Get Report' బటన్‌పై క్లిక్ చేయాలి.

పీఎం కిసాన్ 23వ విడత నిధులు పొందాలనుకునే రైతులు తమ అకౌంట్‌కు ఇ-కేవైసీ (e-KYC) పూర్తి చేయడం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. కేవైసీ ప్రక్రియ పూర్తి చేయని వారి ఖాతాల్లో డబ్బులు జమ కావు. రైతులు పీఎం కిసాన్ పోర్టల్‌లోని 'Farmer Corner' లో ఉన్న 'e-KYC' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP) ని నమోదు చేయడం ద్వారా ఇంట్లోనే కూర్చుని వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు.

ఒకవేళ మొబైల్ నంబర్ లింక్ లేని వారు సమీపంలోని మీ-సేవా లేదా సీఎస్‌సీ (CSC) సెంటర్‌కు వెళ్లి బయోమెట్రిక్ (వేలిముద్ర) ద్వారా కూడా కేవైసీ అప్‌డేట్ చేసుకోవచ్చు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe