పాలనలో వేగం పెంచడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక అడుగులు వేశారు. గురువారం దాదాపు నాలుగు గంటల పాటు సాగిన మంత్రిమండలి సమావేశంలో కేంద్ర మంత్రులందరికీ వారి వారి శాఖల పనితీరుకు సంబంధించిన ‘రిపోర్ట్ కార్డుల’ను అందజేశారు. క్యాబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ అసెస్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఏయే శాఖలు ముందున్నాయి, ఎక్కడ వెనుకబడ్డాయో గణాంకాలతో సహా వివరించారు.
అగ్రస్థానంలో నిలిచిన శాఖలు ఇవే

శాఖల వారీగా నిర్వహించిన ఈ సమీక్షలో కొన్ని మంత్రిత్వ శాఖలు అద్భుతమైన ప్రతిభ కనబరిచాయి. ముఖ్యంగా వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ రెండు కీలక విభాగాల్లో (ఫిర్యాదుల పరిష్కారం, పశ్చిమ ఆసియా యుద్ధ సంక్షోభ నిర్వహణ) టాపర్‌గా నిలిచింది. ఫైళ్ల పరిష్కారం, మేనేజ్‌మెంట్ విభాగంలో బొగ్గు శాఖ అత్యుత్తమ మార్కులు సాధించింది. విద్యుత్, ఆరోగ్య శాఖలు కూడా వివిధ కేటగిరీల్లో మంచి ఫలితాలను సాధించినట్లు సమాచారం. పాలనలో పారదర్శకత, నిర్ణయాలు తీసుకోవడంలో వేగం వంటి పారామీటర్లను పరిగణనలోకి తీసుకొని ఈ రేటింగ్స్ ఇచ్చారు.
ఖర్చులు తగ్గించుకోండి.. హంగులు వద్దు
ఈ సమావేశంలో ప్రధాని మోదీ మంత్రులకు, ఉన్నతాధికారులకు అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ధనాన్ని పొదుపుగా వాడాలని, విలాసాలకు తావుండకూడదని స్పష్టం చేశారు. "దేశానికి ప్రయోజనం చేకూర్చే పర్యటనలు లేదా భారత్ భవిష్యత్తును నిర్ణయించేవి అయితే తప్ప విదేశీ ప్రయాణాలు చేయొద్దు" అని ప్రధాని తేల్చి చెప్పారు. అంతేకాకుండా, మంత్రులు భారీ కాన్వాయ్‌లను వదిలేయాలని, నిరాడంబరంగా ఉండాలని సూచించారు. ఇందులో భాగంగానే అంతర్జాతీయ సదస్సులను కూడా రద్దు చేసుకోవాలని ఆదేశించారు. ఢిల్లీలో జరగాల్సిన ఆఫ్రికా సదస్సు, బిగ్ క్యాట్ అలయన్స్ సమావేశాల రద్దును ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు.
ఇంధన భద్రతపై ప్రత్యేక దృష్టి
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వద్ద ఏర్పడిన అడ్డంకుల వల్ల అంతర్జాతీయంగా చమురు సరఫరాకు ఆటంకం కలిగే ప్రమాదం ఉంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై, పెట్రోల్ ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రధాని అప్రమత్తం చేశారు. పెట్రోలియం ఉత్పత్తులపై ఆధారపడటం తగ్గించి, బయో గ్యాస్, పునరుత్పాదక ఇంధన వనరుల (Renewable Energy) వైపు మొగ్గు చూపాలని మంత్రులను కోరారు. వ్యవసాయం, లేబర్, ఎకానమీ వంటి 9 కీలక రంగాలపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు.
{{/usCountry}}పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వద్ద ఏర్పడిన అడ్డంకుల వల్ల అంతర్జాతీయంగా చమురు సరఫరాకు ఆటంకం కలిగే ప్రమాదం ఉంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై, పెట్రోల్ ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రధాని అప్రమత్తం చేశారు. పెట్రోలియం ఉత్పత్తులపై ఆధారపడటం తగ్గించి, బయో గ్యాస్, పునరుత్పాదక ఇంధన వనరుల (Renewable Energy) వైపు మొగ్గు చూపాలని మంత్రులను కోరారు. వ్యవసాయం, లేబర్, ఎకానమీ వంటి 9 కీలక రంగాలపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు.
{{/usCountry}}ఈ రిపోర్ట్ కార్డుల ఉద్దేశ్యం ఎవరినీ తక్కువ చేయడం కాదని, పాలనలో ఉన్న లోపాలను గుర్తించి సరిదిద్దుకోవడమేనని క్యాబినెట్ కార్యదర్శి సోమనాథన్ వివరించారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు నీతి ఆయోగ్ సభ్యులు రాజీవ్ గాబా కూడా పలు సూచనలు చేశారు.