...
...
Next Story

Petrol Price Hike: వాహనదారులకు షాక్ - ప్రీమియం పెట్రోల్ ధరలు పెంపు..! ఎంతంటే..?

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రీమియం(పవర్) పెట్రోల్ ధరను పెంచాయి. లీటరుకు రూ. 2 నుంచి రూ. 2.30 వరకు పెంచాయి. పెంచిన కొత్త ధరలు ఇవాళ్టి నుంచే (మార్చి 20, 2026) అమలులోకి వచ్చాయి.

Published on: Mar 20, 2026, 15:37:08 IST
Advertisement

ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల కారణంగా పశ్చిమాసియా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో ఇంధన సరఫర వ్యవస్థలకు అంతరాయం ఏర్పడుతోంది. ఫలితంగా అంతర్జాతీయంగా చమురు ధరలు ప్రభావితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ లో కూడా ప్రీమియం(పవర్) పెట్రోల్ ధరలు పెరిగాయి. ఈ మేరకు చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

పవర్‌ పెట్రోల్‌ ధర పెంపు (Representative image) (REUTERS)
పవర్‌ పెట్రోల్‌ ధర పెంపు (Representative image) (REUTERS)

ప్రీమియం పెట్రోల్ ధరను లీటరుకు రూ. 2 నుంచి రూ. 2.30 వరకు పెంచాయి.కొత్త ధరలు మార్చి 20, 2026 నుంచి అమలులోకి వచ్చాయి. బీపీసీఎల్ స్పీడ్, హెచ్పీసీఎల్ పవర్, ఐఓసీఎల్ ఎక్స్పీ95 ధరలు లీటరుకు రూ.2.09 నుంచి… రూ.2.35కు చేరాయి. అయితే ప్రస్తుతం రెగ్యూలర్ పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని ఆయా చమురు సంస్థలు స్పష్టం చేశాయి.

మెరుగైన ఇంజన్ పనితీరు, మెరుగైన మైలేజ్ కోసం ప్రీమియం పెట్రోల్‌ను ఉపయోగిస్తారు. దీనిని ప్రధానంగా విలాసవంతమైన (luxury), స్పోర్ట్స్ మరియు హై-పెర్ఫార్మెన్స్ కార్లలో వాడతారు. దీనినే హై-ఆక్టేన్ ఇంధనం లేదా పవర్ పెట్రోల్ అని కూడా పిలుస్తారు.

ఎలాంటి అంతరాయం లేదు - HPCL

ముడి చమురు సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని HPCL(హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) స్పష్టం చేసింది. అదనపు నిల్వలు ఇప్పటికే వస్తున్నాయని… సరఫరా స్థిరంగా ఉంటుందని ఓ ప్రకటన ద్వారా తెలిపింది. పెట్రోల్ కొరత పుకార్లను నమ్మవద్దని…. కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని ప్రజలకు సూచించింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe