విదేశీ చదువులకు ఆస్తితో పనిలేదు, టాలెంట్ ఉంటే చాలు.. రూ. 1.8 కోట్ల వరకు లోన్
విదేశాల్లో చదువుకోవాలనే కలతో ఉన్న భారతీయ విద్యార్థులకు ఇది నిజంగా శుభవార్త. గ్లోబల్ లెండర్ ప్రాడిజీ ఫైనాన్స్ ఫాల్ 2026 ఇన్‌టేక్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆస్తి పత్రాలు, షూరిటీ సంతకాలు లేకుండానే.. కేవలం విద్యార్థి ప్రతిభ ఆధారంగా సుమారు రూ. 1.8 కోట్ల వరకు లోన్ పొందే అవకాశం కల్పిస్తోంది.
మెయగత ఏడాది కాలంగా వీసా సమస్యలు, నిధుల కొరతతో సతమతమైన విదేశీ విద్యా రంగం మళ్లీ ఊపందుకుంది. ఫాల్ 2026 (Fall 2026) అడ్మిషన్ల కోసం విద్యార్థులు ఇప్పుడు మరింత పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో అంతర్జాతీయ విద్యార్థులకు అండగా నిలుస్తున్న ప్రముఖ సంస్థ ‘ప్రాడిజీ ఫైనాన్స్’ (Prodigy Finance) కీలక ప్రకటన చేసింది. ఫాల్ 2026 ఇన్‌టేక్ కోసం లోన్ అప్లికేషన్లను ప్రారంభించినట్లు వెల్లడించింది.

ట్యూషన్ ఫీజు, నివాస ఖర్చులు
సాధారణంగా విదేశీ విద్య కోసం లోన్ కావాలంటే ఆస్తి పత్రాలు చూపించాలి, లేదా తల్లిదండ్రుల ఆర్థిక స్థితిని నిరూపించుకోవాలి. కానీ ప్రాడిజీ ఫైనాన్స్ మాత్రం "నో కొలేటరల్, నో కో-సైన్" (No Collateral, No Co-Signer) విధానాన్ని అమలు చేస్తోంది. అంటే, ఎలాంటి ఆస్తి తనఖా లేకుండా, మరొకరి షూరిటీ అవసరం లేకుండానే అర్హులైన విద్యార్థులకు 2,20,000 డాలర్ల వరకు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 1.8 కోట్లు) ఫండింగ్ అందిస్తోంది.
ఈ లోన్ కేవలం కాలేజీ ఫీజులకే పరిమితం కాదు. ట్యూషన్ ఫీజుతో పాటు, విదేశాల్లో నివసించడానికి అయ్యే ఖర్చులను (Living Expenses) కూడా ఇది కవర్ చేస్తుంది. అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లోని టాప్ యూనివర్సిటీల్లో సీటు సాధించిన విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు.
పల్లెటూరి విద్యార్థులకు కూడా సమాన అవకాశం
ఈ సందర్భంగా ప్రాడిజీ ఫైనాన్స్ గ్లోబల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సోనల్ కపూర్ మాట్లాడుతూ.. ఈ ఇన్‌టేక్ విద్యార్థులకు ఒక గొప్ప అవకాశమని పేర్కొన్నారు. "విద్యార్థి మెట్రో సిటీ నుంచి వచ్చాడా లేక చిన్న పల్లెటూరు నుంచి వచ్చాడా అన్నది మాకు అనవసరం. మా దృష్టిలో ప్రతిభ ఒక్కటే కొలమానం. విద్యార్థి అకడమిక్ రికార్డ్, భవిష్యత్తులో అతడు సంపాదించగలిగే సామర్థ్యం (Future Earning Potential) ఆధారంగానే లోన్ ఇస్తాం. కుటుంబ ఆస్తులతో మాకు పనిలేదు" అని ఆమె స్పష్టం చేశారు.
డబ్బు అడ్డంకి కాకూడదు
"ప్రతిభ ఉండి, జీవితంలో ఎదగాలనే ఆశయం ఉన్న విద్యార్థికి డబ్బు అనేది ఎప్పుడూ అడ్డంకిగా మారకూడదు. ఈసారి పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే, బలమైన విద్యా పునాదులు, స్పష్టమైన కెరీర్ లక్ష్యాలు ఉన్నవారిని మేం కచ్చితంగా ప్రోత్సహిస్తాం. ప్రతిభే ఇక్కడ గేమ్ చేంజర్" అని సోనల్ కపూర్ వివరించారు.
ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి
విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకునే దిశగా ఇది మొదటి అడుగు. ఆసక్తి ఉన్నవారు ప్రాడిజీ ఫైనాన్స్ అధికారిక వెబ్‌సైట్‌లో తమకు నచ్చిన యూనివర్సిటీ లిస్ట్‌ను పరిశీలించి, వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు info@prodigyfinance.com మెయిల్ ఐడీ ద్వారా సంప్రదించవచ్చు.
(గమనిక: ప్రాడిజీ ఫైనాన్స్ సంస్థ అందించిన ప్రెస్ నోట్ ఆధారంగా ఈ కథనం రూపొందిచడమైంది. రుణం తీసుకునే ముందు వడ్డీ రేటు, ఇతర ఏవైనా షరతులు ఉంటే వాటిని జాగ్రత్తగా పరిశీలించండి.)
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


