గ్లోబల్ పునర్వ్యవస్థీకరణ పేరుతో దిగ్గజ సెమీకండక్టర్ తయారీ సంస్థ క్వాల్కామ్ (Qualcomm) ఉద్యోగుల కోతను వేగవంతం చేసింది. అమెరికాలో మొదలైన లేఆఫ్స్ ప్రక్రియ ఇప్పుడు భారతదేశానికీ విస్తరించింది. అంతర్జాతీయంగా చేపడుతున్న సిబ్బంది తగ్గింపులో భాగంగా భారత్‌లో 1,000 మందికిపైగా ఉద్యోగులపై వేటు పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో బెంగళూరులోని క్వాల్కామ్ సెంటర్లో సోమవారం నాడే తొలి విడత పిలుపులు, లేఆఫ్స్ ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆర్థిక కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
భారత్‌లో 1,000 మందికిపైగా ప్రభావం
క్వాల్‌కామ్‌కు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 52,000 మంది ఉద్యోగులు ఉన్నారు. సెప్టెంబర్ 2025 నాటికి ఉన్న లెక్కల ప్రకారం వీరిలో అత్యధికులు పూర్తికాల ఉద్యోగులే. కాగా, గ్లోబల్ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా మొత్తం సిబ్బందిలో దాదాపు 7 శాతం మందిని తొలగించాలని కంపెనీ భావిస్తోంది. భారత్‌లోనే క్వాల్‌కామ్‌కు సుమారు 20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
"ప్రపంచవ్యాప్త నిష్పత్తిని బట్టి చూస్తే భారత్‌లో దాదాపు 1,000 మంది లేదా అంతకంటే కాస్త ఎక్కువ మంది ఉద్యోగులపై ఈ లేఆఫ్స్ ప్రభావం పడే అవకాశం ఉంది" అని ఈఐఐఆర్ట్రెండ్ (EIIRTrend) సీఈఓ, ప్రధాన విశ్లేషకుడు పారీఖ్ జైన్ వెల్లడించారు.
సెవెరెన్స్ ప్యాకేజీ వివరాలు
ఉద్యోగాలు కోల్పోతున్న ఉద్యోగులకు క్వాల్కామ్ పరిహార ప్యాకేజీని ఆఫర్ చేస్తోంది. కంపెనీ నిర్ణయం ప్రకారం బాధిత ఉద్యోగుల సర్వీసు కాలంతో ముడిపడి ఉన్న మూడు నెలల వేతనాన్ని సెవెరెన్స్ ప్యాకేజీగా అందిస్తున్నారు. లేఆఫ్ లేఖలు అందుకున్న మూడు రోజుల్లోగా రిలీవింగ్ పత్రాలపై సంతకం చేసే వారికి అదనంగా మరో నెల జీతాన్ని ఇస్తామని సంస్థ స్పష్టం చేసింది. మరోవైపు వచ్చే ఏడాది జనవరిలో రెండో విడత ఉద్యోగాల తొలగింపులు కూడా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సీఈఓ లేఖతో స్పష్టత.. పర్ఫార్మెన్స్ ఫోకస్
గత అక్టోబర్ నెలలోనే క్వాల్కామ్ సీఈఓ క్రిస్టియానో అమొన్ ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ గురించి వివరించారు. "వ్యాపారాన్ని విస్తరిస్తున్న కొద్దీ దానికి తగిన నైపుణ్యాలు, సామర్థ్యాలు అవసరమవుతాయి. కంపెనీ నిరంతరం విజయవంతం కావాలంటే సరైన స్థానాల్లో సరైన వ్యక్తులు ఉండటం ఎంతో ముఖ్యం" అని అమొన్ ఆ లేఖలో స్పష్టం చేశారు. కంపెనీ వార్షిక పనితీరు సమీక్షలు ముగిసిన తర్వాత నవంబర్ నుంచి ఈ సిబ్బంది తగ్గింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే భారత్‌లో లేఆఫ్స్‌పై కంపెనీ అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
కాలిఫోర్నియాలో 'వార్న్' నోటీసులు
{{/usCountry}}గత అక్టోబర్ నెలలోనే క్వాల్కామ్ సీఈఓ క్రిస్టియానో అమొన్ ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ గురించి వివరించారు. "వ్యాపారాన్ని విస్తరిస్తున్న కొద్దీ దానికి తగిన నైపుణ్యాలు, సామర్థ్యాలు అవసరమవుతాయి. కంపెనీ నిరంతరం విజయవంతం కావాలంటే సరైన స్థానాల్లో సరైన వ్యక్తులు ఉండటం ఎంతో ముఖ్యం" అని అమొన్ ఆ లేఖలో స్పష్టం చేశారు. కంపెనీ వార్షిక పనితీరు సమీక్షలు ముగిసిన తర్వాత నవంబర్ నుంచి ఈ సిబ్బంది తగ్గింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే భారత్‌లో లేఆఫ్స్‌పై కంపెనీ అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
కాలిఫోర్నియాలో 'వార్న్' నోటీసులు
{{/usCountry}}అమెరికాలోనూ తొలగింపుల వేగం పెరగనుంది. స్థానిక 'వార్న్' (WARN) చట్టం కింద రాబోయే రోజుల్లో కాలిఫోర్నియాలో లేఆఫ్ నోటీసులు ఇచ్చేందుకు క్వాల్కామ్ సిద్ధమవుతున్నట్లు ఇన్వెస్టింగ్.కామ్ నివేదించింది. అక్కడ ఎంతమందిపై ప్రభావం పడుతుందనేది ఇంకా ఖరారు కాలేదు.
కంపెనీ భవిష్యత్ వ్యూహం
ఇటీవలి ఆర్థిక త్రైమాసికంలో క్వాల్కామ్ షేరుకు $2.17 ఈపీఎస్ (EPS) సాధించి విశ్లేషకుల అంచనాలను అందుకుంది. కంపెనీ ఆదాయం $10.44 బిలియన్లుగా నమోదుకాగా, మార్కెట్ అంచనా వేసిన $10.14 బిలియన్లను అధిగమించింది.
స్మార్ట్‌ఫోన్ రంగానికి మాత్రమే పరిమితం కాకుండా కృత్రిమ మేధ (AI) డేటా సెంటర్లు, ఇతర కొత్త వ్యాపారాల్లోకి క్వాల్కామ్ వేగంగా విస్తరిస్తోంది. 2027 ఆర్థిక సంవత్సరం నాటికి స్మార్ట్ఫోనేతర వ్యాపారాల నుంచే చిప్ విక్రయాల ఆదాయం అత్యధికంగా వస్తుందని, ప్రస్తుతం కోల్పోతున్న ఆదాయాన్ని ఇవి భర్తీ చేస్తాయని కంపెనీ ధీమాగా ఉంది.